1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇంట్లోనే ఈ–పాఠాలు
Sakshi Education
కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఇళ్లవద్దే ఉండిపోయిన విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనను అందుబాటులో ఉంచేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
ఎప్పుడు కావాలంటే అప్పుడు వినేలా..
ఆన్‌లైన్, ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా వచ్చే పాఠాలను అవి ప్రసారమయ్యే సమయంలోనే నేర్చుకోవాలి. ఆ ఇబ్బందిని తొలగిస్తూ విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో.. తమకు ఇష్టమున్న సబ్జెక్ట్, పాఠాలను ఎంచుకుని వినేలా విద్యా శాఖ తాజాగా ఏర్పాట్లు చేసింది. 1నుంచి 10 వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులపై వీడియో పాఠ్యాంశాలను రూపొందించి ‘యూట్యూబ్’ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. ప్రతి విద్యార్థికి దీనికి సంబంధించిన లింక్‌ను వారి మొబైల్ ఫోన్లకు పంపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు టెక్నాలజీ ఏ మేరకు అందుబాటులో ఉందనే వివరాలను పాఠశాల విద్యాశాఖ ద్వారా తెలుసుకుని అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించి ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
పాఠాలన్నీ కళ్లెదుటే..
విద్యార్థులు తమ మొబైల్స్‌కు వచ్చిన లింక్‌ను ఓపెన్ చేయగానే వారికి పీడీఎఫ్ ఫార్మాట్‌లో తరగతుల వారీగా వీడియో లింక్ బాక్సులు కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేయగానే ఏ క్లాసు కావాలంటే ఆ క్లాసు, ఏ సబ్జెక్టు కావాలంటే ఆ సబ్జెక్టు వీడియో పాఠాలు ప్రత్యక్షమవుతాయి. ఈ పాఠ్యాంశాలు ఇంటరాక్టివ్ మోడ్ (పరస్పర విధానం)లో రూపొందించడం విశేషం. అంటే వీటిని చూస్తున్న విద్యార్థి తాను తరగతి గదిలో టీచర్ చెప్పే పాఠాలు వింటూ నేర్చుకుంటున్నట్టుగానే ఉంటుంది. పైగా తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు అర్థమయ్యేలా వీటిని రెండు భాషల్లోనూ రూపొందించారు. ఇలా చేయడం దేశంలోనే మొదటిసారి అని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ జేడీ ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు.
సందేహాల నివృత్తికి చాట్ బాక్సు
విద్యార్థులకు సందేహాలు వస్తే నివృత్తి చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. అక్కడ అందుబాటులో ఉన్న చాట్ బాక్సులో తమ సందేహాలను టైప్ చేస్తే చాలు. తరువాత సంబంధిత సబ్జెక్ట్ నిపుణుడు విద్యార్థులకు ఫోన్ చేసి వాటిని నివృత్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. 1నుంచి 10వ తరగతి వరకు కూడా బైలింగ్యువల్ మోడ్‌లో పాఠాలన్నిటినీ విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. టెన్త్ విద్యార్థులకు వారికి ఉపయుక్తంగా పరీక్షల్లో వచ్చే ప్రశ్నపత్రం అనాలసిస్ కూడా ఉంది. విద్యార్థుల నుంచి కూడా ఈ ‘టేక్‌బుల్’ లింకుకు మంచి స్పందన వస్తోందని అధికారులు పేర్కొన్నారు. వీటికి ఇంతకు ముందు ఉన్న విద్యామృతం, విద్యావారధి పేర్లనే కొనసాగిస్తున్నారు.
పరీక్షలు.. స్వయం మూల్యాంకనం
విద్యార్థులు ఈ లింకులోని వీడియో పాఠ్యాంశాల ద్వారా ఏ మేరకు పాఠాలు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు కూడా చేశారు. పాఠ్యాంశాల చివర ఎక్సర్‌సైజులు, ప్రశ్నలు, పునఃశ్చరణలను ఎస్‌సీఈఆర్టీ పొందుపరిచింది. వీటిద్వారా విద్యార్థులు ఇళ్ల వద్దనే ఉండి వాటికి జవాబులు రాసుకునేలా చేస్తున్నారు. ఆ జవాబులు ఎంతవరకు సరైనవో, తప్పులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు కూడా ఎస్‌సీఈఆర్టీ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు వాటిని చూసి స్వయం మూల్యాంకనం చేసుకుంటూ తమ పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకునే అవకాశం కలుగుతోంది.
ఉపాధ్యాయుల ‘పలకరింపు’
స్కూళ్లు లేకపోయినా విద్యార్థులకు టీచర్లను అందుబాటులో ఉంచేలా కొన్ని జిల్లాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయులు తమ తరగతి పిల్లలకు నిత్యం ఫోన్లు చేస్తూ వారి క్షేమ సమాచారాన్ని, పాఠాలు నేర్చుకుంటున్న తీరును తెలుసుకుంటూ వారి సందేహాలను తీరుస్తున్నారు. దీనికి ‘పలకరింపు’ అనే పేరు కూడా పెట్టారు.
ఇంట్లోనే కూర్చుని విద్యార్థులు తమ తరగతి పాఠాలను నేర్చుకునే అవకాశం కల్పించింది. కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యార్థులు ఈ–పాఠాలను ప్రత్యక్షంగా చూస్తూ వింటూ నేర్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) రూపొందించిన వీడియో పాఠాలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు లేని వారి కోసం దూరదర్శన్, ఆకాశవాణి ప్రసారాల ద్వారా పాఠ్యబోధన చేయిస్తోంది.
ఎప్పుడు కావాలంటే అప్పుడు వినేలా..
ఆన్‌లైన్, ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా వచ్చే పాఠాలను అవి ప్రసారమయ్యే సమయంలోనే నేర్చుకోవాలి. ఆ ఇబ్బందిని తొలగిస్తూ విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో.. తమకు ఇష్టమున్న సబ్జెక్ట్, పాఠాలను ఎంచుకుని వినేలా విద్యా శాఖ తాజాగా ఏర్పాట్లు చేసింది. 1నుంచి 10 వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులపై వీడియో పాఠ్యాంశాలను రూపొందించి ‘యూట్యూబ్’ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. ప్రతి విద్యార్థికి దీనికి సంబంధించిన లింక్‌ను వారి మొబైల్ ఫోన్లకు పంపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు టెక్నాలజీ ఏ మేరకు అందుబాటులో ఉందనే వివరాలను పాఠశాల విద్యాశాఖ ద్వారా తెలుసుకుని అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించి ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
పాఠాలన్నీ కళ్లెదుటే..
విద్యార్థులు తమ మొబైల్స్‌కు వచ్చిన లింక్‌ను ఓపెన్ చేయగానే వారికి పీడీఎఫ్ ఫార్మాట్‌లో తరగతుల వారీగా వీడియో లింక్ బాక్సులు కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేయగానే ఏ క్లాసు కావాలంటే ఆ క్లాసు, ఏ సబ్జెక్టు కావాలంటే ఆ సబ్జెక్టు వీడియో పాఠాలు ప్రత్యక్షమవుతాయి. ఈ పాఠ్యాంశాలు ఇంటరాక్టివ్ మోడ్ (పరస్పర విధానం)లో రూపొందించడం విశేషం. అంటే వీటిని చూస్తున్న విద్యార్థి తాను తరగతి గదిలో టీచర్ చెప్పే పాఠాలు వింటూ నేర్చుకుంటున్నట్టుగానే ఉంటుంది. పైగా తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు అర్థమయ్యేలా వీటిని రెండు భాషల్లోనూ రూపొందించారు. ఇలా చేయడం దేశంలోనే మొదటిసారి అని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ జేడీ ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు.
సందేహాల నివృత్తికి చాట్ బాక్సు
విద్యార్థులకు సందేహాలు వస్తే నివృత్తి చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. అక్కడ అందుబాటులో ఉన్న చాట్ బాక్సులో తమ సందేహాలను టైప్ చేస్తే చాలు. తరువాత సంబంధిత సబ్జెక్ట్ నిపుణుడు విద్యార్థులకు ఫోన్ చేసి వాటిని నివృత్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. 1నుంచి 10వ తరగతి వరకు కూడా బైలింగ్యువల్ మోడ్‌లో పాఠాలన్నిటినీ విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. టెన్త్ విద్యార్థులకు వారికి ఉపయుక్తంగా పరీక్షల్లో వచ్చే ప్రశ్నపత్రం అనాలసిస్ కూడా ఉంది. విద్యార్థుల నుంచి కూడా ఈ ‘టేక్‌బుల్’ లింకుకు మంచి స్పందన వస్తోందని అధికారులు పేర్కొన్నారు. వీటికి ఇంతకు ముందు ఉన్న విద్యామృతం, విద్యావారధి పేర్లనే కొనసాగిస్తున్నారు.
పరీక్షలు.. స్వయం మూల్యాంకనం
విద్యార్థులు ఈ లింకులోని వీడియో పాఠ్యాంశాల ద్వారా ఏ మేరకు పాఠాలు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు కూడా చేశారు. పాఠ్యాంశాల చివర ఎక్సర్‌సైజులు, ప్రశ్నలు, పునఃశ్చరణలను ఎస్‌సీఈఆర్టీ పొందుపరిచింది. వీటిద్వారా విద్యార్థులు ఇళ్ల వద్దనే ఉండి వాటికి జవాబులు రాసుకునేలా చేస్తున్నారు. ఆ జవాబులు ఎంతవరకు సరైనవో, తప్పులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు కూడా ఎస్‌సీఈఆర్టీ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు వాటిని చూసి స్వయం మూల్యాంకనం చేసుకుంటూ తమ పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకునే అవకాశం కలుగుతోంది.
ఉపాధ్యాయుల ‘పలకరింపు’
స్కూళ్లు లేకపోయినా విద్యార్థులకు టీచర్లను అందుబాటులో ఉంచేలా కొన్ని జిల్లాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయులు తమ తరగతి పిల్లలకు నిత్యం ఫోన్లు చేస్తూ వారి క్షేమ సమాచారాన్ని, పాఠాలు నేర్చుకుంటున్న తీరును తెలుసుకుంటూ వారి సందేహాలను తీరుస్తున్నారు. దీనికి ‘పలకరింపు’ అనే పేరు కూడా పెట్టారు.
Published date : 18 Jun 2021 01:46PM