Skip to main content

PM Shri scheme: పీఎం శ్రీ పథకం కింద 21 పాఠశాలలు ఎంపిక

PM Shri scheme
  • ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకం
  • ప్రయోగశాలల్లో నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సాహం

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక పరిశోధన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకానికి గుంటూరు జిల్లాలో 21 పాఠశాలలు ఎంపికయ్యాయి. విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తిని పెంపొందింపజేసి ప్రయోగశాలల్లో నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు పీఎంశ్రీ ద్వారా పాఠశాలల్లో వివిధ రకాల వసతులను కల్పించనున్నారు. పీఎంశ్రీ కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో ల్యాబోరేటరీలతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ వృత్తి విద్యాకోర్సులను అందించనున్నారు. జాతీయ నూతన విద్యా విధానం అమ ల్లో భాగంగా ఆధునిక విద్యకు కేంద్రాలుగా పాఠశాలలను తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో జిల్లాలో ఎంపిక చేసిన 21 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలను కల్పించేందుకు కేంద్రం నిధులు విడుదల చేయనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 40 శాతం నిధులు జోడించాల్సి ఉంది.

చ‌ద‌వండి: Govt Medical College: త్వరలోనే ఏలూరు వైద్య కళాశాల సిద్ధం

పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు
పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలలకు నూతన భవ న నిర్మాణాలను చేపట్టడంతో పాటు టాయిలెట్లు, గ్రంథాలయం, సౌర విద్యుత్‌ వ్యవస్థ, పాఠశాలల ప్రాంగణాల్లోనే కాయగూరలు, ఆకుకూరల సాగు, కాలుష్యానికి తావు లేని విధంగా గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌తో నిర్మాణాలు ఉండాలనే నిబంధన విధించింది. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు, డిజిటల్‌ లైబ్రరీ, క్రీడల్లో ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని రకాల క్రీడా సామగ్రిని అందించనుంది. కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడతారు. జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో పీఎంశ్రీ కింద దరఖాస్తు చేసుకున్న పాఠశాలల నిర్వహణలో విద్యాశాఖతో పాటు స్థానిక సంస్థల భాగస్వామ్యం ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. నిధుల వినియోగంపై పక్కాగా ఆడిట్‌తో పాటు మంజూరు చేసే నిధులను కాంపోనెంట్స్‌ వారీగా ఖర్చు చేయాల్సి ఉంది.

డాక్యుమెంటేషన్‌ జరుగుతోంది
పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలల్లో కల్పించాల్సిన వసతులు, భౌతికపరమైన అంశాల పై డాక్యుమెంటేషన్‌ జరుగుతోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులను ప్రారంభించేందుకు వీలుగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నా రు. పాఠశాలలకు సంబంధించిన పమగ్ర వివరాలు, క్రీడా స్థలం, తరగతి గదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాం.
–పి.శైలజ, డీఈవో, గుంటూరు

చ‌ద‌వండి: AP education: ఏపీ విద్యాసంస్కరణలపై తెలంగాణ ఆసక్తి

Published date : 12 Aug 2023 05:02PM

Photo Stories