Chitluri Veerabhadra Rao: చదువుకున్న పాఠశాలకే ప్రధానోపాధ్యాయుడిగా..
Sakshi Education
సుజాతనగర్ : 1979లో పదో తరగతి పూర్తి చేసిన ఓ విద్యార్థి.. ఇప్పుడు అదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన అరుదైన ఘట న సుజాతనగర్‌లో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన చిట్లూరి వీరభద్రరావు 1 నుంచి 10వ తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. 1989లో ప్రభు త్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రాగా, మొదట ఏపీలోని కూనవరంలో విధుల్లో చేరారు. ఆ తర్వాత మామునూరు, జూ లూరుపాడు హైస్కూళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
2015లో సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్‌గా బదిలీపై వచ్చారు. ఆ తర్వాత బదిలీ అయిన వీరభద్రరావు తిరిగి ప్రధానోపాధ్యాయుడిగా సుజాతనగర్ ఉన్నత పాఠశాలలో పోస్టింగ్ ఇస్తూ వరంగల్ ఆర్జేడీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 26 Sep 2023 04:04PM