Skip to main content

విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక

  1. కరీర్ అనే లాటిన్ పదానికి అర్థం?
    1) పందెపు బాట
    2) పరుగెత్తే గుర్రం
    3) నేర్చుకునే విధానం
    4) ప్రణాళిక
  2. ఉపాధ్యాయుడు పాఠశాలలో నిర్వహించే కృత్యాల కార్యక్రమమే పాఠ్య ప్రణాళిక అని తెలిపినవారు?
    1) స్పిస్పియ‌ర్స్‌
    2) కన్నింగ్ హోమ్
    3) హిరస్ట్, పీట‌ర్స్‌
    4) బ్లూమ్స్
  3. పాఠశాల అనే స్టూడియోలో తన అభిరుచికి అనుగుణంగా మెటీరియల్‌ను మలచడానికి కళాకారుడు ఉపయోగించే సాధనం కరిక్యులం అని తెలిపినవారు?
    1) హిరస్ట్, పీట‌ర్స్‌
    2) బ్లూమ్స్
    3) స్పియ‌ర్స్‌
    4) కన్నింగ్ హోమ్
  4. ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక అని తెలిపినవారు?
    1) హెర్బర్ట్‌
    2) బ్లూమ్స్
    3) స్పియ‌ర్స్‌
    4) పీట‌ర్స్‌
  5. ప్రాచీన‌ కాలంలో కరిక్యులం దేనికి పరిమితమైంది?
    1) విషయ విజ్ఞానం, పాఠ్యేతర కార్యక్రమాలు
    2) విషయజ్ఞానానికి
    3) సహపాఠ్య కార్యక్రమాలకు
    4) క్షేత్ర పర్యటనలకు
  6. విషయజ్ఞానంతోపాటు, సహ పాఠ్య ప్రణాళికా కార్యక్రమాలు కూడా ఇమిడి ఉండేది?
    1) సిలబస్
    2) కరిక్యులం
    3) బోధన పద్ధతి
    4) మూల్యాంకనం
  7. పాఠ్యప్రణాళిక రూపొందించేటప్పుడు అభ్యాసకుడి స్వభావం, విషయ స్వభావం, సమాజ స్వభావం అనే మూడు అంశాలను పరిగణించాలని సూచించినవారు?
    1) డబ్ల్యూజే జాకబ్‌సన్
    2) కన్నింగ్ హోమ్
    3) రిచ‌ర్డ్‌స‌న్‌
    4) స్పియ‌ర్స్‌
  8. పాఠ్యప్రణాళిక రచనలో కిందివాటిలో పరిగణనలోకి తీసుకోని అంశం?
    1) సమాజ అవసరాలు
    2) కోర్సు స్వభావ లక్ష్యాలు
    3) సహ సంబంధం
    4) ఏవీకావు
  9. జాతీయ విద్యావిధానం(1986) పాఠ్య ప్రణాళికలో పొందుపర్చాల్సిన పది మౌలిక అంశాల్లో కిందివాటిలో ఏది జీవ శాస్త్రానికి సంబంధించింది?
    1) రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులు, బాధ్యతలు
    2) సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
    3) భారతీయ సంస్కృతి
    4) చిన్నకుటుంబ భావన
  10. ప్రాథమిక భావాల అవగాహనకు కనీస సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు తప్పనిసరిగా అభ్యసించాల్సిన విషయాలను ఏమంటారు?
    1) పాఠ్యప్రణాళిక
    2) మూల పాఠ్యప్రణాళిక
    3) లోపభూయిష్ట పాఠ్యప్రణాళిక
    4) ఉత్తమ పాఠ్యప్రణాళిక
  11. ప్రజాస్వామ్య సమాజంలో సమర్థంగా జీవించడానికి కొన్ని ప్రవర్తనా సామర్థ్యాలు అత్యావశ్యకం. ఈ ప్రవర్తనా సామర్థ్యాలను వృద్ధిచేసే అనుభవాల సమూహమే?
    1) సిలబస్
    2) పాఠ్యప్రణాళిక
    3) మూల పాఠ్యప్రణాళిక
    4) సహ పాఠ్యపథకం
  12. కింది వాటిలో ఏది ప్రస్తుత పాఠ్య ప్రణాళికలోని లోపం?
    1) ఎక్కువ సంఖ్యలో పాఠ్యాంశాల వల్ల లోతు తగ్గుతుంది
    2) వైయుక్తిక భేదాలను అనుసరించి ఉంది
    3) పాఠ్యాంశాల చుట్టూ కేంద్రితమై లేదు
    4) నిజ జీవితానికి దగ్గరగా ఉంది
  13. పాఠ్య ప్రణాళికలో సాంకేతిక, వృత్తి విద్యా సంబంధ విషయాలు లేవు అనే లోపాన్ని సూచించింది?
    1) జాతీయ విద్యా కమిషన్
    2) ప్రాథమిక విద్యా కమిషన్
    3) కొఠారి కమిషన్
    4) మాధ్యమిక విద్యా కమిషన్
  14. పాఠ్యప్రణాళిక జ్ఞాన విస్ఫోటానికి అనుగుణంగా సరిదిద్దకపోవడం అనేది ఎవరు సూచించిన లోపం?
    1) మాధ్యమిక విద్యా కమిషన్
    2) కొఠారి కమిషన్
    3) మొదలియార్ కమిషన్
    4) ఏదీకాదు
  15. దేశమంతా ఒకే మౌలిక ప్రణాళిక ఉండాలని.. 80% ఒకేలా, 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని సూచించింది?
    1) మాధ్యమిక కమిషన్
    2) కొఠారి కమిషన్
    3) నూతన జాతీయ విద్యావిధానం
    4) రాధాకృష్ణన్ కమిషన్
  16. ‘భవిష్యత్తులో సమర్థమైన జీవనానికి, తగిన వృత్తిని ఎంచుకోవడానికి తగిన పునాది పాఠ్య ప్రణాళికలో ఇమిడి ఉండాలి’ దీన్ని తెలిపే పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం?
    1) సృజనాత్మక సూత్రం
    2) సమాజ కేంద్రీకృత సూత్రం
    3) సమైక్యతా సూత్రం
    4) దూరదృష్టి సూత్రం
  17. ‘పాఠ్యప్రణాళికలో విద్యార్థులను ఇమడ్చడం కాకుండా, విద్యార్థుల కోసం పాఠ్యప్రణాళిక అభివృద్ధి చెందాలి’ అని తెలిపినవారు?
    1) బ్లూమ్స్
    2) బ్రూటేకర్
    3) మొదలియర్
    4) కొఠారి
  18. ఒకే శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్యప్రణాళికలో అభివృద్ధి చెందించే పద్ధతి?
    1) ఏక కేంద్రక పద్ధతి
    2) అంశాల పద్ధతి
    3) ప్రక్రియ పద్ధతి
    4) శాఖాంతర పద్ధతి
  19. విజ్ఞాన శాస్త్ర విషయాలను శాఖలుగా విభజించకుండా, అంశాలుగా విభజించడం వల్ల అన్ని శాఖల విజ్ఞానం పొందుపర్చే పద్ధతి?
    1) ఏకకేంద్రక పద్ధతి
    2) అంశాల పద్ధతి లేదా శీర్షిక విధానం
    3) ప్రక్రియ పద్ధతి
    4) భావన పద్ధతి
  20. పాఠ్యప్రణాళికలో కాంతి అధ్యయనం, వాతావరణం అనే అంశాలు ఏ కోవకు చెందినవి?
    1) పరిసర కేంద్రిత అంశాలు
    2) జీవన కేంద్రిత అంశాలు
    3) పరిసర, జీవన కేంద్రిత అంశాలు
    4) పైవేవీకావు
  21. ప్రక్రియ పద్ధతిలో ఉత్పత్తి కంటే ప్రక్రియకు ప్రాధాన్యత ఉంది. దీనికి ఉదాహరణగా అమెరికాలో 1962-68లో దేన్ని అమలు చేశారు?
    1) SAPA
    2) NASA
    3) COPES
    4) SUPW
  22. అమెరికాలో ప్రవేశపెట్టిన COPES (Conceptually Oriented Program in Science) ఆధారంగా అభివృద్ధి చెందిన పద్ధతి?
    1) ఏకకేంద్రక పద్ధతి
    2) శీర్షిక విధానం
    3) ప్రక్రియ పద్ధతి
    4) భావన పద్ధతి
  23. వస్తువులు మండేటప్పుడు ఏం జరుగుతుంది? అనే అంశం చుట్టూ ఆక్సిడేషన్ అనే రసాయన శాస్త్ర విషయం, శ్వాసక్రియ అనే జీవశాస్త్ర విషయం, ఉష్ణం అనే భౌతిక శాస్త్ర విషయాలను చెప్పడం?
    1) శీర్షిక విధానం
    2) ప్రక్రియ పద్ధతి
    3) సమైక్య, శాఖాంతర పద్ధతి
    4) భావన పద్ధతి
  24. కిరణజన్య సంయోగక్రియ గురించిన విషయాల కోసం హిల్ గురించి అధ్యయనం చేయడం ఏ పద్ధతిని సూచిస్తుంది?
    1) ప్రక్రియ పద్ధతి
    2) చారిత్రక పద్ధతి
    3) భావన పద్ధతి
    4) సమైక్య పద్ధతి
  25. పాఠ్యపుస్తకం అనేది ముద్రిత రూపంలో ఉండి తరగతి గదిలో ఉపయోగించే మౌలిక బోధనోపకరణం అని తెలిపిన వారు?
    1) జాకబ్‌సన్
    2) సింప్సన్
    3) పియ‌ర్స్‌
    4) బ్లూమ్స్
  26. ‘తరగతి స్థాయికి తగినట్లుగా అక్షరాలు ముద్రించాలి’ ఇది పాఠ్యపుస్తకం ఏ లక్షణం?
    1) గ్రంథ రచయిత
    2) భాషాశైలి
    3) భౌతిక లక్షణాలు
    4) అంతర్గత లక్షణం
  27. వోగెల్ స్పాట్‌చెక్ ఇవాల్యుయేషన్ స్కేల్ దేని మూల్యాంకనానికి ఉపయోగపడుతుంది?
    1) బోధన పద్ధతి
    2) లక్ష్యాలు
    3) బోధనోపకరణాలు
    4) పాఠ్యపుస్తకం
  28. పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో పరిరక్షణ సూత్రం దేనికి సంబంధించింది?
    1) సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ
    2) సిద్ధాంతాల పరిరక్షణ
    3) బోధన పద్ధతుల పరిరక్షణ
    4) బోధనాపరికరాల పరిరక్షణ
  29. ‘మనం తినే ఆహారం’ అనే పాఠ్యాంశం ఏ విభాగానికి చెందిన అంశం?
    1) పరిసర కేంద్రిత
    2) జీవన కేంద్రిత
    3) పరిసర - జీవన కేంద్రిత
    4) ఉపాధ్యాయ కేంద్రిత
  30. వివిధ పాఠ్యప్రణాళికలో కృత్యాల వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని విభజించిన యూనిట్‌లను ఏమంటారు?
    1) పాఠ్యవిషయ యూనిట్
    2) బోధన యూనిట్
    3) అనుభవ యూనిట్
    4) మూలాధార యూనిట్
  31. లోలకం ఊగడం భూకేంద్రక ఆకర్షణకు లోబడి ఉంటుంది. ఇది జీవశాస్త్రంలోని ఏ అంశానికి సంబంధం కలిగి ఉంది?
    1) కిరణజన్య సంయోగక్రియ
    2) జంతువుల పెరుగుదల
    3) మొక్కల పెరుగుదల దశలు
    4) అయస్కాంతత్వం
  32. జాతీయ విద్యావిధానం (1986) పాఠ్య ప్రణాళికలో పొందుపర్చాలని ప్రతిపాదించిన 10 మౌలిక అంశాల్లో జీవశాస్త్ర సంబంధిత అంశాల సంఖ్య?
    1) 6
    2) 3
    3) 4
    4) 8
  33. ‘ప్రతి ఒక్కరికి అన్ని శాస్త్రాల్లో కనీస పరిజ్ఞానం అవసరం’ అనే విషయంపై ఆధారపడి నిర్మించింది?
    1) మూల పాఠ్య ప్రణాళిక
    2) సహ పాఠ్య ప్రణాళిక
    3) పాఠ్యేతర పాఠ్య ప్రణాళిక
    4) విషయ ప్రణాళిక
  34. కన్నింగ్ హోమ్ నిర్వచనంలో కళాకారుడు?
    1) విద్యార్థి
    2) విద్యార్థి తండ్రి
    3) ఉపాధ్యాయుడు
    4) విద్యాశాఖాధికారి
  35. తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆటస్థలంలో, వ‌ర్క్‌షాప్‌లో అనేక కృత్యాల అనుభవాల సమస్తం?
    1) విషయ ప్రణాళిక
    2) పాఠ్యపుస్తకం
    3) ప్రయోగాలు
    4) పాఠ్యప్రణాళిక
  36. గణిత పరిభాషలో చెప్పాలంటే ఏది పాఠ్య ప్రణాళికకు ఉప సమితి?
    1) టైం టేబుల్
    2) పాఠ్యపుస్తకం
    3) సిలబస్
    4) తరగతి గది
  37. ఏ శాస్త్రవేత్త పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు అభ్యాసకుడి స్వభావం, విషయ స్వభావం, సహజ స్వభావాన్ని పరిగణించాలి అని తెలిపారు?
    1) జాకబ్‌సన్
    2) బీఎస్ బ్లూమ్స్
    3) హిరస్ట్, పీట‌ర్స్‌
    4) స్పియ‌ర్స్‌
  38. జీవశాస్త్ర పాఠ్యప్రణాళిక రచనకు కావాల్సిన అంశాల గురించి వివరిస్తూ ఎడ్వర్డ్‌ విక్టర్ తెలిపిన అంశాల్లో లేనిది?
    1) మూల్యాంకనం
    2) సమతూకం
    3) బోధన సామగ్రి
    4) ఉపాధ్యాయుడి సామర్థ్యం
  39. పాఠ్య ప్రణాళికలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కింది వాటిలో సరికాని ప్రవచనం?
    1) పాఠ్యప్రణాళిక సహజ అభివృద్ధికి తోడ్పడేదిగా ఉండాలి
    2) పాఠ్యప్రణాళిక సమస్యా పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి
    3) పాఠ్యప్రణాళిక ఇతర సబ్జెక్టుల్లో సహ సంబంధాన్ని నెలకొల్పేదిగా ఉండాలి
    4) పాఠ్యప్రణాళిక విద్యార్థుల తల్లిదండ్రుల అభిరుచులకు తగినట్లుగా ఉండాలి
  40. పాఠ్యప్రణాళికకు సంబంధించిన అంశాలలో ‘సహ సంబంధం’ అంటే వేటి మధ్య సహ సంబంధం?
    1) విద్యార్థికి, ఉపాధ్యాయుడికి మధ్య
    2) సబ్జెక్టుల మధ్య
    3) తరగతి గది - ప్రయోగశాల మధ్య
    4) విద్యార్థి- విద్యార్థికి మధ్య
  41. పాఠ్యప్రణాళికలోని కృత్యాలు ఏ విధంగా ఉండాలి?
    1) విద్యార్థులందరికీ ఒకేలా ఉండాలి
    2) విద్యార్థులకు కష్టంగా ఉండాలి
    3) ఉపాధ్యాయుడి అభిరుచులకు అనుగుణంగా ఉండాలి
    4) విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా ఉండాలి
  42. విద్యా ప్రణాళికలో జాతీయ విద్యావిధానం (1986) ఎన్ని మౌలిక అంశాలను పొందుపర్చాలని సూచించింది?
    1) 12
    2) 15
    3) 10
    4) 6
  43. జాతీయ విద్యావిధానం (1986) పాఠ్య ప్రణాళికలో పొందుపర్చాలని సూచించిన 10 అంశాల్లో జీవశాస్త్రానికి సంబంధించింది?
    1) జాతీయ భావన వికాసం
    2) స్త్రీ, పురుష సమానత్వం
    3) చిన్న కుటుంబ భావన
    4) సాంఘిక సమానత్వం

సమాధానాలు

1) 1 2) 3 3) 4 4) 3 5) 2 6) 2 7) 1 8) 4 9) 4 10) 2
11) 3 12) 1 13) 4 14) 2 15) 3 16) 4 17) 2 18) 1 19) 2 20) 1
21) 3 22) 3 23) 3 24) 2 25) 2 26) 3 27) 4 28) 1 29) 2 30) 3
31) 3 32) 2 33) 1 34) 3 35) 4 36) 3 37) 1 38) 4 39) 4 40) 2
41) 3 42) 3 43) 3
Published date : 03 Jan 2015 12:26PM

Photo Stories