Skip to main content

ప్రామాణిక భాష, ప‌త్రిక‌లు, మాండ‌లికాలు

  1. వీటిలో ప్రామాణిక భాషా పదం?
    ఎ) గోరం
    బి) దుక్కం
    సి) పలం
    డి) భేదం
  2. ప్రామాణిక భాషకు - ప్రామాణికేతర భాషకు ఉన్న ప్రధాన భేదం?
    ఎ) భాషాధ్వనుల కూర్పు
    బి) క్రియలు
    సి) పద స్వరూపాలు
    డి) పైవన్నీ
  3. ప్రామాణికేతర భాషలో లేనివి?
    ఎ) మహాప్రాణాక్షరాలు
    బి) సంయుక్తాక్షరాలు
    సి) ఊష్మ- మూర్థన్యాలు
    డి) పైవన్నీ
  4. వీటిలో ప్రామాణిక పదం కానిది?
    ఎ) యముడు
    బి) లగ్గం
    సి) యజ్ఞం
    డి) వాడు
  5. న్యూన ప్రామాణికాలంటే?
    ఎ) అగౌరవ పదాలు
    బి) ప్రతిష్ఠ గల పదాలు
    సి) ప్రతిష్ఠ కోల్పోయిన పదాలు
    డి) అనాగరిక పదాలు
  6. ఆధునిక ప్రసార మాధ్యమాల భాష?
    ఎ) మాండలికం
    బి) న్యూన ప్రామాణికం
    సి) గ్రామ్యం
    డి) శిష్ట ప్రామాణికం
  7. ప్రసార మాధ్యమాల భాష ఏ ప్రాంతానికి చెందింది?
    ఎ) గోదావరి జిల్లాలు
    బి) గుంటూరు - కృష్ణా జిల్లాలు
    సి) రాయలసీమ
    డి) తెలంగాణ జిల్లాలు
  8. ప్రధానమైన ప్రసార సాధనాలు?
    ఎ) ముద్రితం
    బి) శ్రవ్యం
    సి) దృశ్య-శ్రవ్యం
    డి) పైవన్నీ
  9. ముద్రిత ప్రసార సాధనాలు?
    ఎ) వార్తా పత్రికలు
    బి) విజ్ఞానాత్మక గ్రంథాలు
    సి) కరపత్రాలు
    డి) పైవన్నీ
  10. ‘వార్తయందు జగము వర్థిల్లుచున్నది’ - మహాభారతంలో దీన్ని ఎవరు ఎవరితో చెప్పారు?
    ఎ) సంజయుడు ధృతరాష్ర్టునితో
    బి) నారదుడు ధర్మరాజుతో
    సి) విదురుడు ధృతరాష్ర్టునితో
    డి) కర్ణుడు దుర్యోధనునితో
  11. ‘వార్త’ అనే పదానికి అర్థం?
    ఎ) సమాచారం
    బి) వర్తమానం
    సి) వృత్తాంతం
    డి) పైవన్నీ
  12. ‘వార్త’ అనే పదానికి సమానార్థకమైన ఆంగ్లపదం?
    ఎ) News
    బి) Relay
    సి) Information
    డి) Data
  13. మొట్టమొదటిసారిగా ‘పత్రిక’ అనే పదాన్ని ప్రయోగించిన కవి?
    ఎ) తిక్కన
    బి) వేమన
    సి) తాళ్లపాక అన్నమాచార్యులు
    డి) బద్దెన
  14. ‘పత్రిక’ పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించిన ప్రబంధ కవి?
    ఎ) పెద్దన
    బి) పింగళి సూరన
    సి) తిమ్మన
    డి) భట్టుమూర్తి
  15. మొట్టమొదటిసారిగా 1816లో వెలువడిన భారతీయ భాషా పత్రిక?
    ఎ) వంగదర్శన్
    బి) సత్యదూత
    సి) బెంగాల్ గెజిట్
    డి) తెలుగు జర్నల్
  16. ‘ఆంధ్ర భాషా సంజీవని’ మాసపత్రిక సంపాదకులు?
    ఎ) వీరేశలింగం
    బి) కొక్కొండ వేంకటరత్నం పంతులు
    సి) చిలకమర్తి
    డి) పానుగంటి
  17. కందుకూరి వీరేశలింగం సంపాదకత్వంలో వెలువడిన పత్రిక?
    ఎ) వివేకవర్థిని
    బి) హాస్యసంజీవని
    సి) సతీహిత బోధిని
    డి) పైవన్నీ
  18. పత్రికల ప్రధాన లక్ష్యం?
    ఎ) ధనార్జన
    బి) ప్రచారం
    సి) సామాజిక సంక్షేమం
    డి) కీర్తిప్రతిష్ఠలు
  19. తెలుగులో వచ్చిన మొదటి పూర్తిస్థాయి దినపత్రిక?
    ఎ) ఆంధ్ర పత్రిక
    బి) దేశాభిమాని
    సి) జనవాణి
    డి) కృష్ణా పత్రిక
  20. ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకులు?
    ఎ) శివలెంక శంభుప్రసాద్
    బి) కాశీనాథుని నాగేశ్వరరావు
    సి) ముట్నూరి కృష్ణారావు
    డి) కోలవెన్ను రామకోటేశ్వరరావు
  21. ఆంధ్రప్రభ దినపత్రిక ప్రారంభ సమయంలో 1938లో సంపాదకులు?
    ఎ) ఖాసా సుబ్బారావు
    బి) నార్ల వెంకటేశ్వరరావు
    సి) న్యాపతి నారాయణమూర్తి
    డి) పైవారందరూ
  22. తెలుగు పత్రికల్లో సంపాదకీయం ప్రవేశపెట్టిన తొలి పత్రిక?
    ఎ) దేశాభిమాని
    బి) వర్తమాన తరంగిణి
    సి) తెలుగు జర్నల్
    డి) వివేక వర్థని
  23. సంపాదకీయాలకు సాహిత్య గౌరవం కలిగించిన పత్రికా సంపాదకులు?
    ఎ) తాపీ ధర్మారావు
    బి) నార్ల వెంకటేశ్వరరావు
    సి) ముట్నూరి కృష్ణారావు
    డి) ఖాసా సుబ్బారావు
  24. నవ్యతకీ, నాణ్యతకీ, హేతువాద దృక్పథానికి ప్రతీకలైన సంపాదకీయాలు రాసిన సంపాదకులు?
    ఎ) తాపీ ధర్మారావు
    బి) నార్ల వెంకటేశ్వరరావు
    సి) నీలంరాజు వెంకటశేషయ్య
    డి) కాశీనాథుని నాగేశ్వరరావు
  25. Non-Aligned (అలీన), Summit (శిఖరాగ్రం), Refugee (కాందిశీకుడు) వంటి అనువాద పదాలు సృష్టించి వాడుకలోకి తెచ్చిన పాత్రికేయుడు?
    ఎ) నార్ల వెంకటేశ్వరరావు
    బి) డా॥ఎ.బి.కె. ప్రసాద్
    సి) పతంజలి
    డి) డా॥బూదరాజు రాధాకృష్ణ
  26. పత్రికా రంగంలో అన్ని పేజీలను రంగుల్లో ఇచ్చిన పత్రిక?
    ఎ) ఆంధ్రజ్యోతి
    బి) ఈనాడు
    సి) సాక్షి
    డి) ఆంధ్రప్రభ
  27. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ బొంబాయిలో ఎప్పుడు ప్రారంభమైంది?
    ఎ) 1923, జూన్ 6
    బి) 1924, జూలై 30
    సి) 1927, జూలై 23
    డి) 1924, మే 16
  28. రేడియో ప్రసార భాషలో రచయిత శ్రద్ధ తీసుకోవాల్సిన అంశం?
    ఎ) భాష
    బి) శైలి
    సి) వాక్యనిర్మాణం
    డి) పైవన్నీ
  29. భారత్‌లో దూరదర్శన్ కార్యక్రమాలు మొదటిసారి ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
    ఎ) 1957
    బి) 1959
    సి) 1962
    డి) 1964
  30. ప్రసారభారతి బిల్లును 1997, సెప్టెంబర్ 15న ప్రకటించిన కేంద్ర మంత్రి?
    ఎ) ఐ.కె.గుజ్రాల్
    బి) నిఖిల్ చక్రవర్తి
    సి) ఎస్.జైపాల్ రెడ్డి
    డి) కె.ఎస్.శర్మ
  31. ఇంటర్నెట్ నిర్మాణంలో ప్రధానమైనవి?
    ఎ) కంప్యూటర్లు
    బి) మైక్రో ఎలక్ట్రానిక్స్
    సి) టెలికమ్యూనికేషన్లు
    డి) పైవన్నీ
  32. అధునాతన సాంకేతిక విప్లవం?
    ఎ) రేడియో
    బి) ఇంటర్నెట్
    సి) టెలివిజన్
    డి) వార్తాపత్రిక
  33. రాయలసీమ మాండలికంలో ‘మెట్టు’ పదాన్ని ఏ అర్థంలో వాడతారు?
    ఎ) సోపానం
    బి) అధిరోహం
    సి) కాలిచెప్పు
    డి) కాలిమెట్టెలు
  34. ప్రాంతీయ మాండలికాలకు మరోపేరు?
    ఎ) ప్రాదేశిక
    బి) స్థల
    సి) ప్రాచీన
    డి) పరిమిత
  35. తెలంగాణ మాండలికంలో ‘పోరి’ పదాన్ని ఏ అర్థంలో వాడతారు?
    ఎ) పక్షులు
    బి) జంతువులు
    సి) బాలిక
    డి) చెట్లు
  36. శిఖరాగ్రం, ఓ.కె, హృదయం, ఉన్నతం వంటి పదాలు ఏ మాండలికాలు?
    ఎ) విద్యార్థులు
    బి) విద్యాధికులు
    సి) అనాగరికులు
    డి) అధికారులు
  37. పార్టీ - డిన్నర్, అపాయింట్‌మెంట్ వంటి పదాలు ఏ వర్గ మాండలికాలు?
    ఎ) అధికార వర్గం
    బి) కార్మికులు
    సి) ఉన్నతస్థాయి
    డి) అనాగరికులు
  38. ‘ఐరన్‌లెగ్, బోర్, అంత సీన్ లేదు, బట్టీ, కాకా, ఫిగర్ బాగుంది’ వంటి పదాలు ఏ మాండలికాలు?
    ఎ) విద్యాధికులు
    బి) విద్యార్థులు
    సి) అధికారులు
    డి) కార్మికులు
  39. ‘సందమామ’, ‘రిచ్చా’, ‘లచ్చ’, ‘బువ్వ’ వంటి పదాలు ఏ మాండలికాలు?
    ఎ) అనాగరికులు
    బి) కూలీలు
    సి) రిక్షా కార్మికులు
    డి) అందరూ
  40. పిజ్జు, కూటర్, సిలిమా, ఇస్కూలు, యెంటిక, కూకో వంటి పదాలు ఏ మాండలికం?
    ఎ) నిరక్షరాస్యులు
    బి) విద్యార్థులు
    సి) రైతులు
    డి) కార్మికులు
  41. ‘మెట్ట’, ‘మాగాణి’, ‘గుత్త’, ‘కౌలు’ వంటి పదాలు ఏ మాండలికాలు?
    ఎ) నేత
    బి) వ్యవసాయ
    సి) వ్యాపార
    డి) కుమ్మరి
  42. ‘ఇంటికాడ’, ‘ఇయ్యాల’, ‘మధ్యాహ్నం’ వంటి పదాలు ఏ మాండలికాలు?
    ఎ) వైయక్తిక
    బి) వృత్తి
    సి) అబ్రాహ్మణ
    డి) దళిత
  43. ‘రాజులు రాజులాపెనుత రాజులుగాక ‘తరాజు’ శబ్దాన్ని పద్యంలో ప్రయోగించిన తిట్టుకవి?
    ఎ) వేములవాడ భీమకవి
    బి) కూచిమంచి తిమ్మకవి
    సి) కవి చౌడప్ప
    డి) అడిదం సూరకవి
  44. ‘పేడ’ అనే అర్థంలో ‘పెండ’ పదం మహాభారతంలో ఏ పర్వంలో ఉంది?
    ఎ) ఆది
    బి) విరాట
    సి) అనుశాసన
    డి) అరణ్య
  45. ‘హంస వింశతి’ కావ్యంలో ‘కంబళి’, తలదుడ్డు’, ‘కవ్వము’, ‘మజ్జిగ’ వంటి తెలంగాణ మాండలికాలు ఎక్కువ ప్రయోగించిన కవి?
    ఎ) పాలవేకరి కదిరీపతి
    బి) కొరవి గోపరాజు
    సి) అనంతామాత్యుడు
    డి) అయ్యలరాజు నారాయణామాత్యుడు
  46. నండూరి వారి ‘ఎంకి పాటలు’ ఏ జిల్లా జానపదం మాండలికంలో ఉన్నాయి?
    ఎ) శ్రీకాకుళం
    బి) విశాఖ
    సి) గోదావరి డి) గుంటూరు
  47. తెలుగు కథల్లో మొట్టమొదటిగా మాండలిక పదాలు ప్రవేశపెట్టిన రచయిత?
    ఎ) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
    బి) కొడవటిగంటి కుటుంబరావు
    సి) కరుణకుమార
    డి) మాగోఖలే
  48. కోస్తాంధ్ర మాండలిక భాషలో వచ్చిన తొలి తెలుగు నవల?
    ఎ) రాజశేఖర చరిత్ర
    బి) మాలపల్లి
    సి) రామచంద్ర విజయం
    డి) శ్రీరంగరాజ చరిత్ర
  49. మూడు విభిన్న మాండలికాల్లో ‘వెలుగూ వెన్నెల గోదారి’, ‘ముత్యాల పందిరి’, ‘రంగిల్లి’ నవలలు రాసిన రచయిత?
    ఎ) రాచకొండ విశ్వనాథశాస్త్రి
    బి) కొడవటిగంటి కుటుంబరావు
    సి) డా.పోరంకి దక్షిణామూర్తి
    డి) కొమ్మూరి వేణుగోపాలరావు
  50. గురజాడ కన్యాశుల్కంలో ప్రయోగించిన ‘పోటీగరాపులు’, ‘ఆబోరు’, ‘గొట్టాలిమ్మ’, ‘దొబ్బింది’ వంటి పదాలు ఏ మాండలికాలు?
    ఎ) కోస్తాంధ్ర
    బి) కళింగాంధ్ర
    సి) రాయలసీమ
    డి) తెలంగాణ
  51. ‘కథాసాగర్’ కథా సంపుటిలో ఉన్న కథలు ఏ మాండలికానికి చెందినవి?
    ఎ) కోస్తాంధ్ర
    బి) తెలంగాణ
    సి) రాయలసీమ
    డి) అన్నీ
సమాధానాలు
1) డి 2) డి 3) డి 4) బి 5) సి 6) డి 7) బి 8) డి 9) డి 10) బి
11) డి 12) ఎ 13) సి 14) బి 15) సి 16) బి 17) డి 18) సి 19) ఎ 20) బి
21) డి 22) బి 23) సి 24) బి 25) ఎ 26) సి 27) సి 28) డి 29) బి 30) సి
31) డి 32) బి 33) సి 34) బి 35) సి 36) బి 37) ఎ 38) బి 39) డి 40) ఎ
41) బి 42) సి 43) డి 44) సి 45) డి 46) సి 47) డి 48) బి 49) సి 50) బి
51) డి
Published date : 30 Dec 2014 12:45PM

Photo Stories