Skip to main content

జానపద సాహిత్యం

డీఎస్సీలో ‘జానపద సాహిత్యం’ తప్పనిసరి అంశం. లాంగ్వేజ్ పండిట్-తెలుగు, స్కూల్ అసిస్టెంట్ -తెలుగు ఇలా పరీక్షల స్వభావాన్ని బట్టి మార్కుల ప్రాధాన్యముంటుంది. అభ్యర్థులు ఈ విభాగంలో మార్కులు సాధించాలంటే డా॥జి.ఎస్. మోహన్ ‘జానపద విజ్ఞానాధ్యయనం’, ఆర్వీయస్ సుందరం 'ఆంధ్రుల జానపద విజ్ఞానం’ గ్రంథాలను సేకరించి అధ్యయనం చేయాలి. ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకోవాలి. అప్పుడే మంచి స్కోరు సాధించవచ్చు.
ఈ విభాగంలో ప్రత్యేకించి ‘జానపద సాహిత్య పరిచయం - లక్షణాలు - వర్గీకరణ - జానపద సాహిత్య సేకరణలో తెలుగువారి కృషి - పాశ్చాత్యుల కృషి - జానపద సాహిత్య విశేషాలు - జానపద కళారూపాలు - జానపద కళాకారులు, వారి వాద్య విశేషాలు - జానపద సాహిత్యంపై వచ్చిన పరిశోధనలు’ మొదలైన అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. రిచర్డ్ ఎం. డార్సన్ 1972లో ‘ఫోక్‌లోర్ అండ్ ఫోక్‌లైఫ్’ గ్రంథ ఉపోద్ఘాతంలో జానపద విజ్ఞానాన్ని నాలుగు విధాలుగా వర్గీకరించారు. అవి..
  1. మౌఖిక జానపద విజ్ఞానం: జానపద గేయాలు, కథా గేయాలు, జానపద పురాణాలు, ఇతిహాసాలు, గద్య కథనాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలికాలు, నుడికారాలు, తిట్లు, ఒట్లు మొదలైనవన్నీ ఈ విభాగంలోకి వస్తాయి.
  2. సాంఘిక జానపదాచారాలు: పుట్టుక, వివాహం, మరణం తదితరాంశాలకు సంబంధించిన ఆచారాలు, కుటుంబం, సంబంధ బాంధవ్యాలు, పండుగలు, వినోదాలు, ఆటలు, జానపద వైద్యం, మతం, నమ్మకం మొదలైనవన్నీ ఈ విభాగంలో చేరతాయి.
  3. వస్తు సంస్కృతి: భౌతిక జీవితానికి సంబంధించిన అన్ని వస్తువులే కాకుండా కళారూపాలు కూడా వస్తు రూపంలో ఉంటే ఈ విభాగంలోనే చోటు పొందుతాయి. చిత్రకళ, వాస్తుకళ, వివిధ వృత్తుల పరికరాలు, దుస్తులు, అలంకరణ, ఆభరణాలు, ఆహార సామగ్రి, పూజా సామగ్రి, శిలా విగ్రహాలు, దారు విగ్రహాలు తదితర వస్తు రూపాంశాలెన్నో ఈ విభాగంలో వస్తాయి.
  4. జానపద కళలు: సంగీతం, నృత్యం, అభినయం ఉండే ప్రదర్శన కళలన్నీ ఈ విభాగంలో చేరతాయి. గాత్ర సంగీతం, వాద్య సంగీతం, తోలు బొమ్మలాటలు, యక్షగానం, వీధి భాగోతం, కోలాటం, పగటి వేషాలు, బహురూపుల గారడీ విద్యలు మొదలైనవి ఈ విభాగంలో వస్తాయి.
జానపద సాహిత్యాన్ని ఎవరు ఎలా పిలిచారు
  1. దేశీసారస్వతం - శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
  2. ప్రజావాఙ్మయం - ఖండవల్లి లక్ష్మీరంజనం
  3. పదవాఙ్మయం - తల్లావఝ్జల శివశంకర శాస్త్రి
  4. మధుర గీతాలు - వేటూరి ప్రభాకర శాస్త్రి
  5. అనాదృత వాఙ్మయం - మల్లంపల్లి సోమశేఖర శర్మ
జానపద సాహిత్యం- పరిశోధనలు
  1. జానపద గేయ సాహిత్యం - బిరుదురాజు రామరాజు
  2. జానపద గేయగాథలు - నాయని కృష్ణకుమారి
  3. జానపద కళాసంపద - తూమాటి దోణప్ప
  4. జానపద కళారూపాలు - మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
  5. తోలుబొమ్మలాట - మొదలి నాగభూషణశర్మ
  6. వీరగాథ వాఙ్మయం - తంగిరాల సుబ్బారావు
  7. యక్షగాన వాఙ్మయం - ఎస్వీ జోగారావు
  8. జానపద కథా స్రవంతి - కె.సుమతి
  9. జానపద సాహిత్యం - పురాగాథలు - రావి ప్రేమలత
  10. తెలుగు సామెతలు - చిలుకూరి నారాయణరావు
  11. స్త్రీల రామాయణ పాటలు - శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
భిక్షకులు - ఆశ్రయం
  1. పిచ్చుకుంట్లు - రెడ్డి కులాశ్రీతులు
  2. వీరముష్టివారు - వైశాశ్రీతులు
  3. భట్రాజులు - క్షత్రియాశ్రీతులు
  4. విప్రవినోదులు - బ్రాహ్మణాశ్రీతులు
జానపద సిద్ధాంతాలు - ప్రతిపాదకులు
  1. మానవ శాస్త్రీయ సిద్ధాంతం - ఆండ్రూల్యాంగ్
  2. భారతమూల సిద్ధాంతం - థియొడర్ బెన్ఫె
  3. వలసవాదం - థియొడర్ బెన్ఫె
  4. ఇండో -యూరోపియన్ సిద్ధాంతం - గ్రిం సోదరులు
  5. స్వప్నమూల సిద్ధాంతం - లుడ్విగ్, లైస్నర్
  6. చారిత్రక భౌగోళిక సిద్ధాంతం (ఫిన్నిస్ వాదం) - ఫిన్నిస్

మాదిరి ప్రశ్నలు
  1. 'Folk Lore' అంటే?
    1. జానపదుల అధ్యయనం
    2. జానపద విజ్ఞానం
    3. జానపద సాహిత్యం
    4. జానపదుల మూఢనమ్మకం
  2. జానపద గేయాల ప్రధాన లక్షణాలు?
    1. లిఖిత ప్రచారం, ఏక కర్తృకం
    2. మౌఖిక ప్రచారం, జ్ఞాత కర్తృకం
    3. ఆశురచన, అనామక కర్తృతం
    4. అకృతక శైలి, గానయోగ్యతారాహిత్యం
  3. ఆంధ్రుల జానపద సాహిత్య సేకరణలో తీవ్ర కృషి చేసినవారు?
    1. ఆర్వీయస్ సుందరం
    2. నేదునూరి గంగాధరం
    3. జి.ఎస్.మోహన్?
    4. బిరుదురాజు రామరాజు?
  4. ‘జానపద వాఙ్మయోద్ధారక’ బిరుదాంకితులు
    1. నేదునూరి గంగాధరం
    2. బిరుదురాజు రామరాజు
    3. తంగిరాల సుబ్బారావు
    4. ఆర్వీయస్ సుందరం
  5. శారద కాండ్రు ఏ ప్రాంతానికి చెందినవారు?
    1. తెలంగాణ
    2. కోస్తాంధ్ర
    3. రాయలసీమ
    4. బీదర్
  6. ‘తోలుబొమ్మలాట’ జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందింది
    1. మౌఖిక జానపద విజ్ఞానం
    2. సాంఘిక జానపదాచారాలు
    3. వస్తు సంస్కృతి
    4. జానపద కళలు
  7. తెలుగు జానపద సాహిత్యాన్ని మానవశాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు?
    1. నాయని కృష్ణకుమారి
    2. కుసుమ కుమారి
    3. డి. లలిత కుమారి
    4. రావి ప్రేమలత
  8. యక్షగానం దేనికి సంబంధించింది?
    1. జానపద కళ
    2. శిల్పకళ
    3. నాట్య కళ
    4. అదృశ్య కళ
  9. ‘పసిడిపలుకులు’, ‘మిన్నేరు’, ‘సెలయేరు’ జానపద రచనలు ఎవరు చేశారు?
    1. బిరుదురాజు రామరాజు
    2. ఆర్వీఎస్ సుందరం
    3. నేదునూరి గంగాధరం
    4. జి.ఎస్. మోహన్
  10. జానపద సాహిత్య స్వరూపం ఎవరి రచన?
    1. నేదునూరి గంగాధరం
    2. ఆర్వీఎస్ సుందరం
    3. జి.ఎస్. మోహన్
    4. బిరుదురాజు రామరాజు
  11. ‘జానపద కళాసంపద’ పేరుతో ఎనిమిది ఉత్తమ వ్యాస సంపుటాలను ఎవరు వెలువరించారు?
    1. నేదునూరి గంగాధరం
    2. ఆర్వీఎస్ సుందరం
    3. తంగిరాల సుబ్బారావు
    4. తూమాటి దోణప్ప
  12. జానపద కళారూపాలపై విశిష్ట గ్రంథం రాసిందెవరు?
    1. యస్వీ జోగారావు
    2. మొదలి నాగభూషణ శర్మ
    3. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
    4. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
  13. సంగీత, నృత్య ప్రధానమైన దేశీ రూపకం?
    1. కోలాటం
    2. తప్పెటగుళ్లు
    3. యక్షగానం
    4. బుర్రకథ
  14. ఏ ప్రక్రియకు ప్రాచీన రూపంగా ‘కొర వంజిని’ ని పేర్కొంటారు?
    1. కథా కావ్యం
    2. యక్షగానం
    3. చారిత్రక కావ్యం
    4. ఇతిహాసం
  15. జానపదుల కథల మీద విశేషంగా కృషి చేసిన పాశ్చాత్యుడు?
    1. రిచర్‌‌డ ఎం. డార్సన్
    2. స్టిత్ థాంప్సన్
    3. జె.ఎ.బోయల్
    4. సి.పి. బ్రౌన్
  16. తెలుగులో జానపద గేయాలను ప్రచురించిన వారిలో మొదటివారు?
    1. నేదునూరి గంగాధరరావు
    2. నందిరావు చలపతిరావు
    3. జె.ఎ.బోయల్
    4. సి.పి. బ్రౌన్
  17. తోలుబొమ్మలాట, వీధి భాగవతం అనేవి ఏ కళలలోకి వస్తాయి?
    1. జానపద కళలు
    2. నృత్య కళలు
    3. నాటక కళలు
    4. సంగీత కళలు
  18. వంతపాట గల కళారూపమేది?
    1. హరికథ
    2. బుర్రకథ
    3. తోలుబొమ్మలాట
    4. ప్రహసనం
  19. కృష్ణ చెంచులక్ష్మీ సంవాదం, గంగా గౌరీ సంవాదం అనే జానపద గేయాల్లో ఉన్న రసమేది?
    1. శృంగారం
    2. హాస్యం
    3. కరుణ
    4. అద్భుతం
  20. జానపద గేయవాఙ్మయ పరిచయం’ ఎవరు రచించారు?
    1. ఆచార్య నాయని కృష్ణకుమారి
    2. ఆచార్య బి. రామరాజు
    3. ఆచార్య యస్వీ జోగారావు
    4. హరి ఆదిశేషువు
  21. ‘ఆంధ్రుల జానపద విజ్ఞానం’ రచయిత?
    1. ఆర్వీయస్ సుందరం
    2. బి. రామరాజు
    3. తంగిరాల సుబ్బారావు
    4. యస్వీ జోగారావు
  22. ‘తెలుగు హరికథా సర్వస్వం’ జానపద పరిశోధన గ్రంథం ఎవరిది?
    1. తూమాటి దోణప్ప
    2. బిరుదురాజు రామరాజు
    3. తంగిరాల సుబ్బారావు
    4. ఆర్వీయస్ సుందరం
  23. తెలుగులో జానపద గేయాల్లో పల్నాటి వీర చరిత్ర కథాగేయాన్ని ఎవరు సేకరించారు?
    1. సి.పి. బ్రౌన్
    2. జె.ఎ.బోయల్
    3. మెకంజీ
    4. కాంప్‌బెల్
  24. జుట్టు పోలిగాడు, కేతిగాడు, బంగారక్క పాత్రలున్న కళారూపం?
    1. ఒగ్గు కథ
    2. తోలు బొమ్మలాట
    3. వీధి భాగోతం
    4. పగటి వేషాలు
  25. గోండుల నృత్య విశేషం?
    1. బంజారా
    2. మామిడి
    3. గుస్సాడి
    4. లంబాడీ
  26. జానపద కళాకారులగు బవనీల వాద్య విశేషం?
    1. డమరుకం
    2. తప్పెట
    3. గంట, శంఖం
    4. జమిడిక
  27. ‘కనికట్టు’ విద్యను ప్రదర్శించే జాన పదులు?
    1. బుడబుక్కలోళ్లు
    2. బవనీలు
    3. కాటిపాపలు
    4. బైరూపులోళ్లు
  28. వీరగాథ చిత్రానికి ఇది ఉదాహరణ?
    1. సర్వాయి పాపడి కథ
    2. బాలనాగమ్మ కథ
    3. కాటమరాజు కథ
    4. బొబ్బిలి కథ
  29. బ్యాలడ్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
    1. గ్రీకు
    2. లాటిన్
    3. ఇంగ్లిష్
    4. ఫ్రెంచ్
  30. జానపద సంగీతం దేనిలో అంతర్భాగం?
    1. వస్తు సంస్కృతి
    2. ప్రదర్శన కళలు
    3. మౌఖిక సాహిత్యం
    4. జానపద ఆచారం
  31. కెప్టెన్ ఎం.డబ్ల్యు.కార్ రచించిన గ్రంథం?
    1. పసిడి పలుకులు
    2. ఆంధ్ర లోకోక్తి చంద్రిక
    3. లోకోక్తి ముక్తావళి
    4. తెలుగు సామెతలు
  32. జానపద విజ్ఞాన వస్తు ప్రదర్శనశాలల వల్ల ప్రయోజనం?
    1. జానపద గేయ సేకరణ
    2. సంస్కృతి పరిరక్షణ
    3. ఆచారాల సంరక్షణ
    4. వీధిగాథల సంగ్రహణ
  33. తత్త్వాలు పాడే వీధి గాయకుల వాయిద్యం?
    1. తంబూర
    2. ఏకతార
    3. మద్దెల
    4. పిల్లనగ్రోవి
  34. ఆర్.ఎస్. బాగ్‌‌స జానపద విజ్ఞాన వర్గీకరణలో ’గ’ అనే అక్షరం దేన్ని సూచిస్తుంది?
    1. పొడుపు కథ
    2. వాక్కు
    3. నమ్మకం
    4. సామెత
సమాధానాలు:
1) 2 2) 3 3) 2 4) 1 5) 1 6) 4 7) 1 8) 1 9) 3 10) 2
11) 4 12) 4 13) 3 14) 2 15) 2 16) 3 17) 1 18) 2 19) 2 20) 4
21) 1 22) 1 23) 1 24) 2 25) 3 26) 4 27) 3 28) 1 29) 2 30) 2
31) 2 32) 2 33) 1 34) 4
 
Published date : 20 Dec 2014 05:26PM

Photo Stories