Skip to main content

ఛందస్సు- మాదిరి ప్రశ్నలు

ఛందస్సు
 పద్య గేయ లక్షణాలను తెలిపే శాస్త్రం ఛందస్సు. ఛందస్సు వేదాంగాల్లో ఒకటి. గణబద్ధమైంది ఛందస్సు. గురు లఘువుల కలయికతో గణాలు ఏర్పడతాయి. గణాలను స్థూలంగా నాలుగు విధాలుగా వర్గీకరించవచ్చు.
 1. ఏకాక్షర గణాలు: 2
  i) ఒకే ఒక్క గురువుంటే అది గ(U)
  ii) ఒకే ఒక్క లఘువుంటే అది ల (I)
 2. రెండక్ష రాల గణాలు: 4
  i) గలము లేక హగణం (UI)
  ii) గగము (UU)
  iii) లగము లేక వగణం (IU)
  iv) లలము (II)
 3. మూడక్షరాల గణాలు: 8.
  వీటినే నైసర్గిక గణాలంటారు. ఇవి 8.
  1) భగణం (UII)
  2) రగణం (UIU)
  3) తగణం (UUI)
  4) సగణం (IIU)
  5) యగణం (IUU)
  6) మగణం (UUU)
  7) జగణం (IUI)
  8) నగణం (III)
  వృత్తాల్లో వీటి ప్రాధాన్యం ఉంటుంది
 4. నాల్గక్షరాల గణాలు: 3
  1) నలము (IIII) 
  2) నగము (IIIU)
  3) సలము (IIUI)
 
 సూర్య గణాలు: 2
 1) నగణం (III)
 2) గలము లేక హగణం (UI)
 ఇంద్ర గణాలు: 6
 1) భగణం
 2) రగణం
 3) తగణం
 4) నలం
 5) నగం
 6) సలం
 ఇంద్రగణాలు కందం, ద్విపద వంటి జాతుల్లో సూర్యగణాలు తేటగీతి, ఆటవెలది, సీసం వంటి ఉప జాతుల్లో ఇంద్ర గణాలు, సూర్య గణాల ప్రాధాన్యం ఉంటుంది.
 
యతి ప్రాసలు: ‘ఆద్యోవళిః ద్వితీయోప్రాసం’ పద్య పాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు. యతికి వళి, వడి, విరతి వంటి పర్యాయ పదాలున్నాయి. పద్య పాదంలో రెండో అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
వృత్త పద్యాలు, జాతులు (కందం, ద్విపద) వంటి వాటిలో ప్రాస నియమం ఉంటుంది. తేటగీతి, ఆటవెలది, సీసం వంటి వాటిలో ప్రాస నియమం ఉండదు.
ప్రాస యతి: ప్రాస నియమం లేని పద్యాల్లో పద్య పాదంలో ప్రాసక్షరమైన రెండో అక్షరానికి యతి చెల్లించవలసిన అక్షరానికి పక్కనున్న అక్షరంతో యతి మైత్రిని చెల్లించడాన్ని ప్రాసయతి అంటారు.
 ఉదా: ‘తెల్లవారనుగడుసరిగొల్లవారు
పై తేటగీతి పద్య పాదంలో యతి చెల్లవలసిన ‘తె-గొ’ అనే అక్షరాలకు యతి చెల్లదు. కనుక ప్రాసాక్షరమైన ‘ల్ల’ నాల్గవ గణం రెండో అక్షరమైన ‘ల్ల’కు యతి చెల్లినందున ఇది ప్రాసయతి
యతి మైత్రి: పద్యపాదంలో మొదటి అక్షరానికి పాద మధ్యంలో నిర్ణీతాక్షరానికి మైత్రిని పాటించడం యతి మైత్రి అంటారు.
Published date : 05 Nov 2018 05:10PM

Photo Stories