Skip to main content

బోధనా పద్ధతులు

మాదిరి ప్రశ్నలు
  1. పుట్టిన ప్రతి మనిషికి సహజంగా, అప్రయ త్నంగా అలవడే భాష?
    1) వ్యవహారిక భాష
    2) మాండలిక భాష
    3) మాతృభాష
    4) ప్రామాణిక భాష
  2. జాతీయాలు, సామెతలు, నుడికారాల సొగసుతో సునాయాసంగా భావ వినిమయానికి తోడ్పడేది?
    1) మాండలిక భాష
    2) వ్యవహారిక భాష
    3) ప్రామాణిక భాష
    4) మాతృభాష
  3. 'శిశువు సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగ పడేది మాతృభాష’ అని ఎవరన్నారు?
    1) మహాత్మాగాంధీ
    2) రవీంద్రనాథ్ ఠాగూర్
    3) ఆర్.వి. శేషయ్య
    4) బల్లార్‌‌డ
  4. 'శిశువు తన జాగ్రదవస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడి మాతృభాషగా భావించడం సమంజసం’ అని ఎవరు పేర్కొన్నారు?
    1) ఠాగూర్, గాంధీజీ
    2) ఆర్.వి. శేషయ్య
    3) రైబర్‌‌న, బల్లార్‌‌డ
    4) కొమర్రాజు లక్ష్మణరావు
  5. పరభాష ద్వారా నేర్చే విద్య.. సోపానాలు లేని సౌధం లాంటిదని ఎవరన్నారు?
    1) మహాత్మాగాంధీ
    2) విశ్వకవి రవీంద్రుడు
    3) కొమర్రాజు లక్ష్మణరావు
    4) కె.యం. మున్షీ
  6. భారతీయులకు జాతీయభాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండాల్సి వస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగుభాషకు ఉన్న అర్హత మరే ఇతర భారతీయ భాషలకు లేదని వక్కాణించినవారు?
    1) జె.బి.ఎస్. హల్దేన్
    2) సి.పి. బ్రౌన్
    3) ఆర్.బి. కాల్డ్వెల్
    4) ఎ.డి. క్యాంప్‌బెల్
  7. తెలుగు భాష విజ్ఞాన సాంకేతిక పద జాలానికి పుట్టినిల్లు అవుతుందని ఎవరు పేర్కొన్నారు?
    1) సి.పి.బ్రౌన్
    2) మాక్స్ ముల్లర్
    3) జె.బి.ఎస్. హల్దేన్
    4) బిషప్ కాల్డ్వెల్
  8. త్రి భాషా సూత్రాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిపాదించారు?
    1) కొఠారి కమిషన్: 1964-66
    2) మాధ్యమిక విద్యా కమిషన్: 1951-52
    3) రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ - 1968
    4) కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం - 1956
  9. త్రి భాషా సూత్రం ప్రకారం హిందీని మాతృభాషగా అభ్యసించేవారు విధిగా ఏ భాషను అభ్యసించాలని నిర్దేశించారు?
    1) ఆంగ్లం
    2) తెలుగు
    3) ఒక దక్షిణాది భాష
    4) తమిళం
  10. త్రి భాషా సూత్రాన్ని చిత్తశుద్ధిగా అమలు పరుస్తున్న రాష్ట్రాలు?
    1) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
    2) తమిళనాడు, కేరళ
    3) ఆంధ్రప్రదేశ్, కేరళ
    4) ఆంధ్రప్రదేశ్, హర్యానా
  11. మన విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ఏ కమిటీ సిఫారుసుల మేరకు ప్రవేశపెట్టారు?
    1) హార్టాగ్ కమిటీ-1929
    2) లార్‌‌డ మెకాలే కమిటీ-1935
    3) ఉట్ ఎబ్సట్ కమిటీ- 1936
    4) చార్లెస్ ఉడ్ తారీఖ్ కమిటీ-1935
  12. మానవుడు శైశవావస్థ నుంచి తన హావ భావాలను, హాస క్రోధానురాగాలను, ఆలోచనలు, ఆచరణలను ఏ భాషా ముఖంగా వ్యక్తం చేస్తున్నాడో.. ఆ భాషే అతడి మాతృ భాష అని ఎవరన్నారు?
    1) గొడవర్తి సూర్యనారాయణ
    2) కె.యం. మున్షీ
    3) మహాత్మాగాంధీ
    4) విశ్వకవి రవీంద్రుడు
  13. పరిపాలనకు సంబంధించిన తెలుగు పారిభాషిక పదకోశం ఎవరి ఆధ్వర్యంలో ఎప్పుడు వెలువడింది?
    1) ఆయ్యదేవర కాళేశ్వరరావు-1961
    2) వావిలాల గోపాలకృష్ణయ్య-1958
    3) దాశరథి కృష్ణమాచార్యులు-1964
    4) సి. నారాయణరెడ్డి-1965
  14. పరిపాలన భాషగా తెలుగు భాషా స్వరూపాన్ని నిర్ణయించడానికి ఎవరి అధ్యక్షతన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు?
    1) పి.వి. నరసింహారావు
    2) సి. నారాయణ రెడ్డి
    3) వావిలాల గోపాలకృష్ణయ్య
    4) పింగళి లక్ష్మీకాంతం
  15. వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది?
    1) 1966 మార్చి 5
    2) 1974 మార్చి 19
    3) 1971 మార్చి 19
    4) 1974 ఏప్రిల్ 5
  16. అధికార భాషా వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చినవారు?
    1) గిడుగు రామమూర్తి
    2) నండూరి రామకృష్ణమాచార్యులు
    3) సి. నారాయణ రెడ్డి
    4) వావిలాల గోపాలకృష్ణయ్య
  17. అధికార భాషా సంఘం అధ్యక్షులుగా జిల్లాల్లో విస్తృత పర్యటనలు జరిపి కార్యాలయాల్లో తెలుగు భాషా అమలుకు విశేష కృషి చేసినవారు?
    1) సి. నారాయణ రెడ్డి
    2) గజ్జెల మల్లారెడ్డి
    3) నండూరి రామకృష్ణమాచార్యులు
    4) వావిలాల గోపాలకృష్ణయ్య
  18. పెద్ద పట్టణాల్లో సభలు నిర్వహించి, మూడు నిమిషాలు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఏదైనా ఒక అంశంపై తెలుగులో మాట్లాడటం అనే పోటీల ద్వారా తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించినవారు?
    1) పరుచూరి గోపాలకృష్ణ
    2) సి. నారాయణరెడ్డి
    3) నండూరి రామకృష్ణమాచార్యులు
    4) మాడుగుల నాగఫణిశర్మ
  19. ఆంధ్రభాషా సంస్కృతుల ప్రచారమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం?
    1) ఆంధ్రసారస్వత పరిషత్తు
    2) తెలుగు అకాడమీ
    3) అధికార భాషా సంఘం
    4) తెలుగు విశ్వవిద్యాలయం
  20. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించిన 'సారస్వత వ్యాస ముక్తావళి' కర్త?
    1) రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
    2) డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు
    3) డాక్టర్ దివాకర్ల వేంకటావధాని
    4) దేవులపల్లి రామానుజరావు
  21. 'శ్రీ‌ సిద్ధేంద్ర కళాక్షేత్రం' కూచిపూడి నృత్య పీఠం ఎక్కడ ఉంది?
    1) వరంగల్
    2) శ్రీశైలం
    3) రాజమండ్రి
    4) కృష్ణా
  22. వివిధ రంగాల్లో అత్యున్నత శిఖరాలు అందుకున్న 33 మంది మహానుభావుల ఆదర్శ జీవిత చరిత్రలను ‘తెలుగు వైతాళికులు’ పేరుతో ప్రచురించిన సంస్థ?
    1) ఆంధ్రసాహిత్య అకాడమీ
    2) తెలుగు విశ్వవిద్యాలయం
    3) ఆంధ్ర సారస్వత పరిషత్తు
    4) ఆంధ్ర విశ్వవిద్యాలయం
  23. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక, అవయవిక చర్యలను ఏమంటారు?
    1) ఉపగమాలు
    2) ఉద్దేశాలు
    3) స్పష్టీకరణాలు
    4) లక్షణాంశాలు
  24. బోధనా లక్ష్యాలను మొదటిసారిగా ఏ విద్యావేత్త విశ్లేషించి, వర్గీకరించే ప్రయత్నం చేశారు?
    1) బ్లూమ్ ఫీల్డ్
    2) బెంజిమన్ బ్లూమ్
    3) హెర్బర్‌‌ట స్పెన్సర్
    4) విలియం జేమ్స్
  25. నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పును ఏమంటారు?
    1) బోధనా లక్ష్యం
    2) బోధనా ఉద్దేశం
    3) స్పష్టీకరణం
    4) మూల్యాంకనం
  26. నియమిత కాలంలో ఒక బోధనాంశాన్ని విద్యార్థి అభ్యసించినప్పుడు ఆ విద్యార్థిలో వచ్చిన ప్రవర్తనా మార్పుల మొత్తాన్ని ఎలా వ్యవహరిస్తారు?
    1) ఉద్దేశం
    2) లక్ష్యం
    3) స్పష్టీకరణం
    4) పైవన్నీ
  27. మనరాష్ట్రంలో మాతృభాషా బోధనా లక్ష్యాలను ఎవరు రూపొందించారు?
    1) ఆంధ్ర సారస్వత పరిషత్తు
    2) రాష్ర్ట పరిశోధనా సంస్థ
    3) తెలుగు అకాడమీ
    4) తెలుగు విశ్వవిద్యాలయం
  28. పాఠ్యాంశ పూర్వ పరకథలు, పాఠ రచయిత వివరాలు, పాఠం నేపథ్యం మొదలైనవి ఏ లక్ష్యం కిందకి వస్తాయి?
    1) విషయజ్ఞానం
    2) భాషాజ్ఞానం
    3) సాహిత్యజ్ఞానం
    4) భాషాభిరుచి
  29. పదాలు, సంధులు, సమాసాలు, నానార్థ పర్యాయపదాలు, లింగ, వచన, కాల భేదాలు ఏ లక్ష్యం కిందకి వస్తాయి?
    1) విషయజ్ఞానం
    2) భాషాజ్ఞానం
    3) సాహిత్యజ్ఞానం
    4) అవగాహన
  30. పాకం, ఛందస్సు, రసం, అలంకారం, రీతి, శైలి, పాఠ్య స్వరూపం లాంటివి ఏ లక్ష్యానికి చెందినవి?
    1) విషయజ్ఞానం
    2) భాషాజ్ఞానం
    3) సాహిత్యజ్ఞానం
    4) సాహిత్యాభిరుచి
  31. జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణాలు?
    1) జ్ఞానం
    2) అవగాహన
    3) భాషాభిరుచి
    4) పైవన్నీ
  32. పోలికలు, భేదాలు చెప్పడం ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణాలు?
    1) జ్ఞానం
    2) అవగాహన
    3) అభిరుచి
    4) రసానుభూతి
  33. నేర్చిన విషయానికి సొంత ఉదాహరణలు ఇవ్వడం ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
    1) అభివ్యంజనం
    2) అభిరుచి
    3) జ్ఞానం
    4) అవగాహన
  34. వివరించడం, విశ్లేషించడం, వివేచించడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణాలు?
    1) అవగాహన
    2) జ్ఞానం
    3) అభివ్యంజనం
    4) భాషాభిరుచి
  35. విద్యార్థులు బహుగ్రంథ పఠనం చేయడం, సారస్వత సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణాలు?
    1) రసానుభూతి
    2) భాషాభిరుచి
    3) సృజనాత్మక శక్తి
    4) సాహిత్యాభిలాష
  36. విద్యార్థులు మూఢాచారాలు పాటించ కుండా హేతుబద్ధంగా జీవించడం ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
    1) అవగాహన
    2) సముచిత మనోవైఖరులు
    3) భాషాప్రయుక్తం
    4) సంస్కృతి సంప్రదాయాలు
  37. విద్యార్థులు వేమన, పోతన రాసిన పద్యాలను విరివిగా సేకరించి చదువుతారు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణం?
    1) భాషాభిరుచి
    2) రసానుభూతి
    3) సృజనాత్మకశక్తి
    4) సముచిత మనోవైఖరి
  38. తరగతి వారీ కనీస అభ్యసన సామర్థ్యాలను నిర్ధారించడానికి ఎవరి అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించారు?
    1) జె.పి.ఎల్‌. గ్విన్
    2) కె.ఎం. మున్షీ
    3) ఆర్‌. హెచ్‌. దవే
    4) హెచ్‌. ఆర్‌. థామస్
  39. కనీస అభ్యసన సామర్థ్యాలను ఏ దశలో ప్రవేశపెట్టారు?
    1) ప్రాథమిక
    2) ప్రాథమికోన్నత
    3) ఉన్నత
    4) కళాశాల
  40. కనీస అభ్యసన సామర్థ్యాల్లో చేరనిది?
    1) స్వయం అధ్యయనం
    2) పరిసరాల వినియోగం
    3) ప్రాయోగిక వ్యాకరణం
    4) భావావగాహనం

సమాధానాలు
1) 3 2) 4 3) 1 4) 3 5) 2 6) 1 7) 1 8) 4 9) 3 10) 4
11) 2 12) 1 13) 1 14) 4 15) 2 16) 4 17) 3 18) 1 19) 1 20) 2
21) 4 22) 2 23) 3 24) 2 25) 1 26) 2 27) 2 28) 1 29) 2 30) 3
31) 1 32) 1 33) 4 34) 1 35) 2 36) 2 37) 1 38) 3 39) 1 40) 1

గతంలో అడిగిన ప్రశ్నలు
  1. విద్యార్థులు సన్నిహిత సంబంధం ఉన్న అంశాల మధ్య సామ్య భేదాలను కనుగొంటారు అనే స్పష్టీకరణం?
    1) సృజనాత్మక శక్తి అనే లక్ష్యానికి చెందింది
    2) అవగాహన అనే లక్ష్యానికి చెందింది
    3) భాషాభిరుచి అనే లక్ష్యానికి చెందింది
    4) భాషాజ్ఞానం అనే లక్ష్యానికి చెందింది
  2. విద్యార్థుల్లో సముచిత మనోవైఖరులను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు దృష్టి లో పెట్టుకోవాల్సిన స్పష్టీకరణాల్లో ఒకటి?
    1) విమర్శనాత్మక దృష్టి కలిగి ఉండడం
    2) శైలీ భేదాలను పరీక్షించడం
    3) నుడికారపు సొంపును ప్రదర్శించడం
    4) ధ్వన్యర్థాలను గ్రహించడం
  3. సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకో వడం అనేది ఏ భాషా బోధన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
    1) ధ్వన్యర్థాన్ని గ్రహించడం
    2) కవి సమ్మేళనాల్లో పాల్గొనడం
    3) పురాణేతిహాసాల్లోని విశేషాలను వివ రించడం
    4) శైలిలో ప్రత్యేకతలను చూపడం
  4. విద్యార్థికి భాషాభివృద్ధి అలవడుతుంది. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
    1) స్వతంత్ర రచనలు చేస్తాడు
    2) విమర్శనాత్మకంగా మాట్లాడతాడు
    3) కవి సమ్మేళనాల్లో పాల్గొంటాడు
    4) రచనలలోని రసభేదాలను తెలుసు కుంటాడు
  5. నిగూడార్థం కనుగొనడం, సూచనలను అనుసరించడం అనే స్పష్టీకరణాలు ఉన్న బోధనా లక్ష్యం?
    1) సంస్కృతి సంప్రదాయాలు
    2) అవగాహన
    3) రసానుభూతి
    4) భాషాభిరుచి

సమాధానాలు
1) 2 2) 1 3) 3 4) 3 5) 2
Published date : 22 Dec 2014 11:24AM

Photo Stories