Skip to main content

RGUKT: ట్రిపుల్‌ ఐటీల్లో కౌన్సెలింగ్‌ తేదీలు.. ఈ ఒరిజినల్‌ ధ్రువపత్రాలు తప్పనిసరి..

నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధి­లోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2023–29 సంవత్సరానికి ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు గాను జూలై 20 నుంచి 25వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు జూలై 19న తెలిపారు.
RGUKT
ట్రిపుల్‌ ఐటీల్లో కౌన్సెలింగ్‌ తేదీలు.. ఈ ఒరిజినల్‌ ధ్రువపత్రాలు తప్పనిసరి..

నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి 4,400 సీట్లు ఉండగా, ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయించి మిగిలిన 4,040 సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూలై 13న ప్రకటించామని పేర్కొన్నారు. వీరందరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో జూలై 20, 21వ తేదీల్లో, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో 21, 22వ తేదీల్లో, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో 24, 25వ తేదీల్లో, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో 24, 25 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: RGUKT: ట్రిపుల్‌ ఐటీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇలా.. కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి..

అభ్యర్థులందరూ ఉదయం ఎనిమిది గంటల కల్లా ఆయా సెంటర్లకు హాజరు కావాలన్నారు. పదో తరగతికి సంబంధించి అన్ని రకాల ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం సీటును కేటాయిస్తారని, సీటు పొందిన వెంటనే అడ్మిషన్‌ ఫీజు, రిఫండబుల్‌ కాషన్‌ డిపాజిట్‌ కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,700, మిగిలిన కేటగిరీలకు చెందిన విద్యార్థులు రూ.4,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. 

చదవండి: Andhra Pradesh: ట్రిపుల్‌ ఐటీ.. చదువుల దివిటీ

Published date : 20 Jul 2023 03:38PM

Photo Stories