APPSC: Panchayat Secretary 2017 Screening Test TM Question Paper with Official Key (Held on 23.04.2017)
1. MNREGA పథకంలో కింది పనిని చేయుటకు అనుమతి లేదు?
1) చేపల సంతానోత్పతికై చెరువు
2) చిన్న అంతస్రవణ ట్యాంక్
3) కంపోస్ట్ గుంట
4) పశువుల కొట్టం
- View Answer
- సమాధానం: 4
2. గ్రామాల్లో రహదారి వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశం కల ప్రధాన కార్యక్రమం ఏది?
1) NRHM
2) NRLM
3) PMGSY
4) PMAY
- View Answer
- సమాధానం: 3
3. రాజ్యాంగంలోని ఏ భాగం ఆంధ్రప్రదేశ్‌లోని PESA (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం) జిల్లాల గుర్తింపులో సహాయం అందిస్తుంది?
1) షెడ్యూల్ VI
2) షెడ్యూల్ V
3) షెడ్యూల్ IV
4) షెడ్యూల్ IX
- View Answer
- సమాధానం: 2
4. PRIA సాఫ్ట్వేర్ ఈ కింది గణాంకాలను సేకరిస్తుంది?
1) జమలు, ఖర్చు లెక్కలతో సహా వోచర్ నమోదులు, నగదు ఖాతా, నివేదికలు, రిజిస్టర్లు రూపొందించడం
2) భౌతిక, ఆర్థిక ఫలితాలను శాసించే ప్రక్రియకు తోడ్పాటు
3) ఆస్తుల వివరాల సేకరణ
4) గతిశీలకమైన డాటాబేస్
- View Answer
- సమాధానం: 1
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామంలో ఇంటి పన్ను ఎవరు కట్టించుకొంటారు?
1) గ్రామ పంచాయతీ
2) మండల పరిషత్
3) జిల్లా పరిషత్
4) గ్రామసభ
- View Answer
- సమాధానం: 1
6. సంసద్ ఆదర్శ గ్రామ యోజనలోని గ్రామాలకు నిధులు ఈ కింది దాని నుంచి రావు?
1) గ్రామ పంచాయతీ స్వంత ఆదాయం
2) కేంద్రం, రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఇచ్చే గ్రాంట్లు
3) కంపెనీలు సామాజిక బాధ్యత కింద ఇచ్చే నిధులు
4) ఆదాయపు పన్నుపై SAGY సర్ చార్జ
- View Answer
- సమాధానం: 4
7. స్థానిక స్వయం పరిపాలన ద్వారా అధికార వికేంద్రీకరణ చేయడంలో ఉద్దేశం ఏమిటి?
1) ప్రజలకు సాధికారికత
2) భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి ప్రోత్సాహం
3) సమాన అభివృద్ధికి ప్రోత్సాహం
4) కుల సముదాయాల మధ్య అధికార సమతుల్యత
- View Answer
- సమాధానం: 4
8. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఒక సంవత్సరంలో పార్లమెంట్ సభ్యుడు, జిల్లా కలెక్టర్‌ను ఎంత విలువ గల పనులను చేయమని కోరవచ్చును?
1) రూ.2 కోట్లు
2) రూ.3 కోట్లు
3) రూ.5 కోట్లు
4) రూ.10 కోట్లు
- View Answer
- సమాధానం: 3
9. ‘పంచాయత్’ అనే మాటకు శబ్దార్థం ఏమిటి?
1) పెద్దల ద్వారా పరిష్కారం
2) సమాజంచే ఎన్నుకొన్న ఐదుగురుగౌరవనీయులైన వ్యక్తుల సభ
3) ఐదుగురు రుషుల సమావేశం
4) ఐదుగురు వ్యక్తుల సేన
- View Answer
- సమాధానం: 2
10. కింది ఇచ్చిన రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు?
1) ఢిల్లీ
2) అండమాన్, నికోబార్ దీవులు
3) లక్షద్వీప్
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 1
11. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్ని జిల్లాల్లో PESA చట్టం అమల్లో ఉంది?
1) 2
2) 3
3) 5
4) 8
- View Answer
- సమాధానం: 3
12. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు ఎంత శాతం స్థానాలకు రిజర్వేషన్ ఉంది?
1) 25%
2) 33%
3) 30%
4) 50%
- View Answer
- సమాధానం: 2
13. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులు?
1) రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలి
2) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం లేదు
3) సంక్రమణ ఫార్ములా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలి
4) పంచాయతీరాజ్ పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలి
- View Answer
- సమాధానం: 2
14. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగో ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు?
1) ఎం.ఎల్. కాంతారావు
2) వై.వి.రెడ్డి
3) డి.సుబ్బారావు
4) ఆర్.సుదర్శనరావు
- View Answer
- సమాధానం: 1
15. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ఎగుమతి జోన్లు ఉన్న జిల్లాలు ఏవి?
1) చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూర్
2) చిత్తూరు, కృష్ణా, గుంటూర్
3) కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి
4) గుంటూర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి
- View Answer
- సమాధానం: 2
16. తమ వ్యవసాయ ఉత్పత్తిని నిలువ చేసుకొని దానిపై కుదువ పద్ధతిలో రైతులు ధనాన్ని పొందే, కుదువ పరపతి పథకాన్ని ఏమంటారు?
1) రైతు మిత్ర పథకం
2) రైతు రక్షా పథకం
3) రైతు నిల్వ పథకం
4) రైతు బంధు పథకం
- View Answer
- సమాధానం: 4
17. ఫిబ్రవరి, 2016 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెక్క గుజ్జు ట్రేడింగ్ వ్యవస్థలో ఏ చెట్ల కొనుగోలు, అమ్మకం జరగదు?
1) సుబాబుల్
2) యూకలిప్టస్
3) వెదురు
4) జీడిమామిడి
- View Answer
- సమాధానం: 3
18. 2015-16 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో (GSDP) ప్రాథమిక రంగపు వాటా సుమారుగా ఎంత?
1) 30%
2) 25%
3) 40%
4) 20%
- View Answer
- సమాధానం: 1
19. మండల్ సమాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి స్థాపించిన సాముదాయిక ఆధారిత సూక్ష్మ రుణ సంస్థ పేరు ఏమిటి?
1) నాంది
2) స్త్రీ నిధి
3) జట్టు
4) వెలుగు
- View Answer
- సమాధానం: 2
20. ‘అన్న సంజీవని’ అంటే ఏమిటి?
1) స్వయం సహాయక బృందాల ద్వారా నిర్వహించే జనరిక్ ఔషధాల దుకాణాలు
2) సేంద్రీయ ఎరువు, కీటక నాశినిలను వాడే ఒక పంటను వేయు పద్ధతి
3) పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం
4) గిరిజన రైతులకు మార్కెట్ పథకం
- View Answer
- సమాధానం: 1
21. దివ్యాంగులను గుర్తించి, వారికి సేవలు అందించడానికి వాడే కేంద్రీయ డాటా బేస్‌ని ఇలా పిలుస్తారు?
1) స్వావలంబ్
2) సహాయం
3) సాదరెమ్
4) స్వాదరం
- View Answer
- సమాధానం: 3
22. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘ఉన్నతి’ పథకం ఉద్దేశాల్లో కిందిది ఒకటి?
1) గ్రామీణ యువతకు ఉన్నత విద్యకై వేతన పురస్కారాలు అందించుట
2) అల్ప సంఖ్యాక విద్యార్థులకు ఉన్నత విద్యకై వేతన పురస్కారాలు అందించుట
3) కడు పేదవారికి, సంవత్సరానికి కనీసం రెండు లక్షల రూపాయల ఆదాయం ఆర్జించే శక్తిని అందించుట
4) కడు పేదవారికి, సంవత్సరానికి కనీసం మూడు లక్షల రూపాయల ఆదాయం ఆర్జించే శక్తిని అందించుట
- View Answer
- సమాధానం: 3
23. అభయ హస్తం పథకంలో లబ్ధి పొందుటకు, స్వయం సహాయక బృందంలో సభ్యురాలైన మహిళ తన వంతు వాటాగా సంవత్సరానికి ఎంత సొమ్ము చెల్లించాలి?
1) Rs. 365
2) Rs. 200
3) Rs. 100
4) Rs. 12
- View Answer
- సమాధానం: 1
24. NTR భరోసా పథకం కింద 2017 జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కొత్త ఫించన్లు మంజూరు చేసింది?
1) 3 లక్షలు
2) 3.5 లక్షలు
3) 4 లక్షలు
4) 4.5 లక్షలు
- View Answer
- సమాధానం: 2
25. APRIGP (గ్రామీణ సమ్మిళిత వృద్ధి పథకం)లో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్ని మండలాలు భాగమై ఉన్నాయి?
1) 75
2) 100
3) 125
4) 150
- View Answer
- సమాధానం: 4
26. రాష్ట్రాలకు గ్రాంట్ల పంపిణీకి, 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర జన సంఖ్య, విస్తీర్ణాల వెయిటేజ్ ఏ నిష్పత్తిలో తీసుకున్నది?
1) 75:25
2) 80:20
3) 90:10
4) 100:0
- View Answer
- సమాధానం: 3
27. జాతీయ Rurban మిషన్ (గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు) రెండో దశలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని క్లస్టర్లు (సముదాయాలు) ఎంపిక చేయబడ్డాయి?
1) 6
2) 8
3) 10
4) 12
- View Answer
- సమాధానం: 1
28. 2017-18 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో తెలిపిన విధంగా, వెలుగు (ERP) అంటే సెర్ప సంస్థ ద్వారా ఎన్ని స్వయం సహాయక బృందాలు ఏర్పాటు అయినాయి?
1) 6 లక్షలు
2) 7 లక్షలు
3) 8 లక్షలు
4) 9 లక్షలు
- View Answer
- సమాధానం: 2
29. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల (MSME) విధానం ప్రకారం 2015-2020 నాటికి ఎంత కొత్త పెట్టుబడి వస్తుంది?
1) రూ.10,000 కోట్లు
2) రూ.12,000 కోట్లు
3) రూ.15,000 కోట్లు
4) రూ.25,000 కోట్లు
- View Answer
- సమాధానం: 3
30. హస్త కళాకారులు ప్రసిద్ధి చెందిన లక్క బొమ్మలు ఈ ఊరిలో తయారుచేస్తారు?
1) శ్రీకాళహస్తి
2) పెడన
3) కొండపల్లి
4) ఏటికొప్పాక
- View Answer
- సమాధానం: 4
31. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన హస్త కళలను ప్రదర్శించే కళల, హస్త కళల, వారసత్వ గ్రామాలను ఏమని పిలుస్తారు?
1) శిల్పారామం
2) లేపాక్షి ఎంపోరియా
3) హ్యాండీక్రాప్ట్స్ బజార్
4) హస్తకళా వేదిక
- View Answer
- సమాధానం: 1
32. వెలుగు (సెర్ప) వ్యవస్థ కింద ఒక స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఎంత మంది సభ్యులు కావాలి?
1) 5 నుంచి 10
2) 10 నుంచి 20
3) 15 నుంచి 20
4) 20 నుంచి 25
- View Answer
- సమాధానం: 2
33. పునర్వ్యవస్థీకరణ సమయంలో, పోలవరం ప్రాజెక్ట్‌లో మునిగే ప్రాంతంలో ఉన్న ఎన్ని మండలాలను, తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్‌లో కలపడం జరిగింది?
1) 5
2) 6
3) 7
4) 9
- View Answer
- సమాధానం: 3
34. 2017-18 సంవత్సరంలో రైతు రుణ మాఫీ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ 2017-18లో ఎంత సొమ్ము కేటాయించింది?
1) రూ.2,500 కోట్లు
2) రూ.3,200 కోట్లు
3) రూ.3,600 కోట్లు
4) రూ.4,000 కోట్లు
- View Answer
- సమాధానం: 3
35. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఉన్న కారణాల్లో ఒక దాన్ని, కింది వాటి నుంచి గుర్తించండి?
1) ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశంగా చట్టబద్ధమైనందున, భారత్ ఈ దినోత్సవాన్ని జరుపుతుంది
2) అసాధారమైన పాత్ర నిర్వహించిన సాధారణ మహిళల సాహస కృత్యాలను సంబురంగా జరుపుకొనుటకు
3) మహిళలు సమావేశాలు పెట్టుకొని, కొంత సమయం వారి కోసం పురుషుల నుంచి ఆటంకం లేకుండా గడుపుటకు
4) మహిళలు, పురుషుల కంటే గొప్పవారని నిరూపించుటకు
- View Answer
- సమాధానం: 2
36. మణిపూర్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు?
1) నొంగ్ తొంబమ్ బీరెన్ సింగ్
2) ఇబోబి సింగ్
3) డి.డి.లపాంగ్
4) ముకుల్ సంగ్మా
- View Answer
- సమాధానం: 1
37. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మనామం ఏమిటి?
1) విజయ్‌సింగ్ బిస్త్
2) అజయ్ సింగ్ బిస్ట్
3) ఆదిత్యనాథ్ బిస్ట్
4) అజయ్ బహదూర్ బిస్ట్
- View Answer
- సమాధానం: 2
38. కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన ఆరోగ్య విధానం, 2017 ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం ప్రజా ఆరోగ్యంపై ఖర్చు చేయాలని ఆశించబడుతుంది?
1) 5.5%
2) 4.5%
3) 3.5%
4) 2.5%
- View Answer
- సమాధానం: 4
39. కింది ఇవ్వబడిన వాటిలో ఏ రాష్ట్రాలు, అన్ని నగరాలు, పట్టణాలు బహిరంగ మల విసర్జిత రహిత ప్రదేశాలని 2016 అక్టోబర్ 2న ప్రకటించాయి?
1) గుజరాత్, ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక, ఢిల్లీ
3) గోవా, మహారాష్ట్ర
4) కేరళ, గోవా
- View Answer
- సమాధానం: 1
40. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం దేశ సముద్ర సంబంధిత ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత?
1) 55%
2) 45%
3) 35%
4) 25%
- View Answer
- సమాధానం: 2
41. త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి కింద పేర్కొన్న వాటిలో, ఏ రంగంలో ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది?
1) శాస్త్ర సాంకేతిక రంగం
2) కళలు
3) సాహిత్యం, విద్య
4) పౌర సేవల రంగం
- View Answer
- సమాధానం: 4
42. ఇటీవల ‘పద్మశ్రీ’ పురస్కారం పొందిన శ్రీ గిరీష్ భరద్వాజ్ ఏ రంగంలో ప్రసిద్ధులు?
1) సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు
2) అత్యవసర ఆరోగ్య సేవలు
3) గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కు వంతెనలనిర్మాణం
4) అగ్నిమాపక సేవలు
- View Answer
- సమాధానం: 3
43. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీ నవజోత్‌సింగ్ సిద్ధూకు కింది ఇచ్చిన మంత్రిత్వ శాఖల్లో ఏది కేటాయించారు?
1) స్థానిక పాలన
2) క్రీడలు
3) పంచాయత్‌లు
4) ఉపాధి కల్పన
- View Answer
- సమాధానం: 1
44. కింద ఇచ్చిన వాటిలో ఏ దేశాధ్యక్షుని డిసెంబర్, 2016లో జాతీయ అసెంబ్లీ ‘రాజ్యాంగం, చట్టపు విస్తృత, తీవ్ర ఉల్లంఘన’ కారణంగా అభిశంసించింది?
1) దక్షిణ కొరియా
2) బ్రెజిల్
3) టర్కీ
4) న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 1
45. మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2017 విజేత ఎవరు?
1) అన్నా ముజుచుక్
2) జూ వెంజన్
3) టాన్ ఝోంగ్యి
4) ఝావో జ్యూ
- View Answer
- సమాధానం: 3
46. ఇటీవల ఆస్కార్ అవార్డ గెలుచుకున్న ‘లా లా ల్యాండ్’ అనే సినిమా ఒక సంగీతకారుడు నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న ఒక అమ్మాయిల కథ. ఆ ఇద్దరు కింద ఇచ్చిన ఏ నగరంలో కలిసి ప్రేమలో పడినట్లు చిత్రీకరించారు?
1) న్యూయార్క
2) బోస్టన్
3) లాస్‌వెగాస్
4) లాస్ఏంజల్స్
- View Answer
- సమాధానం: 4
47. ఇటీవల ఏ నగరంలో ‘అరకు కాఫీ’ రిటైల్ దుకాణం ప్రారంభించారు?
1) లండన్
2) పారిస్
3) జ్యూరిక్
4) ఆంస్టర్ డామ్
- View Answer
- సమాధానం: 2
48. పాల్ బీటీ ఏ పుస్తకానికి 2016 మాన్ బుకర్ బహుమతి గెలుచుకున్నాడు?
1) ఎ కోర్ట ఆఫ్ మిస్ట్ అండ్ ఫ్యూరీ
2) ఎన్ ఇండియన్ గర్ల
3) ది సెల్‌ఔట్
4) పాసెంజర్
- View Answer
- సమాధానం:3
49. కింది వాటిలో ఏది 1947 భారత స్వాతంత్య్ర చట్టంలోని అంశం?
1) భారత్‌ను రిపబ్లిక్‌గా ప్రకటించడం
2) రాజ్య సంస్థానాలను భారత రాజ్యంలో విలీనం చేయడం
3) బ్రిటిష్ రాణికి ‘భారత చక్రవర్తి’ అనే బిరుదు కొనసాగించడం
4) భారతదేశ విభజన
- View Answer
- సమాధానం: 4
50. భారత జాతీయ సేనకు మొట్టమొదటి ప్రధాన సేనాధిపతి ఎవరు?
1) మోహన్ సింగ్
2) సుభాస్ చంద్రబోస్
3) ప్రీతం సింగ్
4) రాష్ బిహరీ బోస్
- View Answer
- సమాధానం: 1
51. కింది వారిలో ఎవరు కృష్ణ పత్రిక సంపాదకునిగా పనిచేశారు?
1) కాశీనాథుని నాగేశ్వరరావు
2) మట్నూరి కృష్ణారావు
3) తుమ్మల సీతారాం మూర్తి
4) నార్ల వెంకటేశ్వరరావు
- View Answer
- సమాధానం: 2
52. భారతదేశ ఏ సంస్థానంలో భారత్‌లో విలీనం కావాలా, పాకిస్తాన్లో విలీనం కావాలా అనే విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది?
1) కశ్మీర్
2) మోర్బి
3) జునాగఢ్
4) జాంనగర్
- View Answer
- సమాధానం: 3
53. గదర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు?
1) సోహాన్ సింగ్ భక్నా
2) కర్తార్ సింగ్ సరభా
3) లాలా హరదాయల్
4) బాబా పృథ్వీ సింగ్ ఆజాద్
- View Answer
- సమాధానం: 1
54. 1784లో మొట్టమొదటిసారి బ్రిటిష్ శోషణకు వ్యతిరేకంగా ఆదివాసీ తిరుగుబాటుకు నాయకత్వం వహించిందెవరు?
1) సిద్ధు ముర్ము
2) తిల్కా మాఝీ
3) కన్హు ముర్ము
4) కేనా సర్కార్
- View Answer
- సమాధానం: 2
55. బంకిం చంద్ర చటర్జీ రాసిన ‘ఆనందమఠ్’ నవల నేపథ్యం ఏమిటి?
1) గిరిజన తిరుగుబాటు
2) ఒక జమీందార్ ప్రేమకథ
3) సన్యాసుల తిరుగుబాటు
4) రాజపుత్రుల, పఠాన్ల మధ్య యుద్ధం
- View Answer
- సమాధానం: 3
56. 1857లో సిపాయి తిరుగుబాటులో మొదటి ఉత్ప్రేరక సంఘటనకు కారణం?
1) సైనికుల్లో అసంతృప్తి
2) రాజ్య సంక్రమణ సిద్ధాంతం
3) అవధ్ స్వాధీనం
4) పౌర సమాజంలో అసంతృప్తి
- View Answer
- సమాధానం: 1
57. కింది వాటిలో ఏ ఉద్యమం భారతీయ ముస్లింలలో ఆధునిక పాశ్చాత్య విద్యా వ్యాప్తి కోసం ప్రారంభించబడింది?
1) దేవబంద్ ఉద్యమం
2) వహాబీ ఉద్యమం
3) ఖిలాఫత్ ఉద్యమం
4) అలీఘర్ ఉద్యమం
- View Answer
- సమాధానం: 4
58. కింద పేర్కొన్న ఏ నాయకుడు మొట్టమొదటిసారి ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు?
1) మహమ్మద్ ఇక్బాల్
2) మహమ్మద్ అలీ జిన్నా
3) మౌలానా మహమ్మద్ జౌహర్
4) సయ్యద్ అహ్మద్ ఖాన్
- View Answer
- సమాధానం: 1
59. ఏ విషయం చర్చించడం కోసం బ్రిటిష్‌వారు రౌండ్‌టేబుల్ సమావేశాలను నిర్వహించారు?
1) సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు
2) భారత్‌లో రాజ్యాంగ సంస్కరణలు
3) భారత్‌కు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వడానికి
4) భారత్‌లో కాంగ్రెస్, కాంగ్రేసేతర పార్టీలను విభజించడం
- View Answer
- సమాధానం: 2
60. ఏ స్వాతంత్య్ర సమరయోధుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రాణాలు కోల్పోయారు?
1) లాలా హరదయాల్
2) మదన్‌లాల్ ఢింగ్ర
3) లాలా లజపతిరాయ్
4) సిబరామ్ రాజ్‌గురు
- View Answer
- సమాధానం: 3
61. రాజద్రోహం ఆరోపణలపై శిక్ష విధించబడి, లోకమాన్య తిలక్ ఎక్కడ ఆరేళ్లు జైలు శిక్ష అనుభవించారు?
1) సెల్యులార్ జైల్, అండమాన్
2) ఎరవాడ జైలు, పూనా
3) సెంట్రల్ జైలు, లాహోర్
4) మాండలే జైలు, బర్మా
- View Answer
- సమాధానం: 4
62. స్థానిక భాషా పత్రికల చట్టం, 1878 (Vernacular Press Act, 1878) రూపొందించడానికి ఏ చట్టాలను నమూనాగా తీసుకున్నారు?
1) ఐరిష్ పత్రికా చట్టాలు
2) ఇంగ్లిష్ పత్రికా చట్టాలు
3) భారత పత్రికా చట్టాలు
4) అమెరికా పత్రికా చట్టాలు
- View Answer
- సమాధానం: 1
63. ఒక ట్రాక్టర్ సామర్థ్యాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు?
1) అశ్వశక్తి (హార్స పవర్)
2) కిలోవాట్స్
3) జౌల్స్
4) ఎఫ్.పి.ఎస్
- View Answer
- సమాధానం: 1
64. ఒక 110 వోల్ట్, 50 హెర్జ రేటింగ్ కల హీటర్ (వేడి చేసే) పరికరాన్ని భారతదేశంలో ఇంటిలో వాడే AC ఎలక్ట్రిక్ ప్లగ్‌లో వాడితే ఏం జరుగుతుంది?
1) అది కొన్ని నిమిషాలు లేదా సెకన్లోనే కాలిపోతుంది
2) మామూలుగా పనిచేస్తుంది
3) అది పేర్కొన్న దానికంటే తక్కువ వేడిని ఇస్తుంది
4) భారత్‌లో అలాంటి పరికరాన్ని వాడలేము
- View Answer
- సమాధానం: 1
65. ‘లాఫింగ్ గ్యాస్’ అని దేన్ని అంటారు?
1) సల్ఫర్ డైయాక్సైడ్
2) నైట్రస్ ఆక్సైడ్
3) హీలియం
4) కార్బన్ డైఆక్సైడ్
- View Answer
- సమాధానం: 2
66. వాయు బుడగ (బెలూన్)ను ఈ గ్యాస్‌తో నింపడం అంత సురక్షితం కాదు:
1) నత్రజని
2) గాలి
3) ఉదజని
4) హీలియం
- View Answer
- సమాధానం: 3
67. ఒక ఓడ సముద్రం మధ్య నుంచి ఒడ్డుకు వస్తున్నప్పుడు తీరంలో నిలబడిన వ్యక్తికి ఓడలోని ఏ భాగం ముందుగా కనిపిస్తుంది?
1) స్తంభం (మాస్ట్)
2) డెక్ (పై భాగం లేక వేదిక)
3) మొత్తం ఓడ
4) హల్ (కింది భాగం)
- View Answer
- సమాధానం: 1
68. సేంద్రీయ పదార్థాల కంపోస్ట్ తయారీలో ఏ ప్రక్రియ జరుగుతుంది?
1) వాయు రహిత జీర్ణ ప్రక్రియ
2) ఆమ్లజని ఆధారిత జీర్ణ ప్రక్రియ
3) క్విణనం లేక పులియబెట్టడం
4) దహనక్రియ
- View Answer
- సమాధానం: 2
69.జనప కట్ట నుంచి నార తీసేందుకు ఏ ప్రక్రియ ఉపయోగిస్తారు?
1) గుజ్జు తీయడం
2) వేడి చేయటం
3) రెట్టింగ్ (నానబెట్టడం)
4) వడగట్టడం
- View Answer
- సమాధానం: 3
70. కలరా ఉండలు ఏ సూత్రంపై పనిచేస్తాయి?
1) బాష్పీకరణం
2) ద్రవీకరణం
3) నిక్షేపణం
4) ఉత్పతనం
- View Answer
- సమాధానం: 4
71. టైమ్స్ ఉన్నత విద్యా ర్యాంకింగ్ 2017 ప్రకారం ప్రపంచ అత్యుత్తమ చిన్న విశ్వవిద్యాలయాల జాబితాలో మొదటి 10 ర్యాంక్‌లలో స్థానం సంపాదించిన ఒకే ఒక భారతీయ విద్యా సంస్థ?
1) టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ
2) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స
3) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై
4) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
72. అగ్నిIV బాలిస్టిక్ క్షిపణి లక్ష్య పరిధి కి.మీ.లలో ఎంత?
1) 1000-2000
2) 2000-3000
3) 3000-4000
4) 4000-5000
- View Answer
- సమాధానం: 3
73. స్టాక్ హోం పీస్ రీసెర్చ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన 2016 సమాచారం ప్రకారం భారత్ రక్షణ బడ్జెట్ చైనా రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే సుమారుగా ఎంత?
1) మూడో వంతు
2) సగం
3) ఐదో వంతు
4) నాలుగోవంతు
- View Answer
- సమాధానం: 4
74. ‘రూపే’ అంటే ఏమిటి
1) భారత వెర్షన్ చెల్లింపు కార్డ
2) చెల్లింపులకు ఆన్లైన్ పోర్టల్
3) ఎలక్ట్రాన్ నగదు
4) భారతీయ బిట్‌కాయిన్
- View Answer
- సమాధానం: 1
75. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ‘JAM" అంటే ఏమిటి?
1) చేరు, అధీకృతమ్ చేయి, ద్రవ్య వ్యవస్థలో చేరు
2) జన్ ధన్, ఆమ్ ఆద్మీ బీమా, ముద్రా
3) జనగణన, ఆధార్, ముద్రా
4) జన్ ధన్, ఆధార్, మొబైల్
- View Answer
- సమాధానం: 4
76. మానవుల్లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే జికా వైరస్‌కు వాహకంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందింది?
1) క్యూలెక్స్ పైపియన్స
2) ఏడిస్ ఈజిప్టీ
3) అనాఫిలాస్ మైజెన్
4) జికా వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందదు
- View Answer
- సమాధానం: 2
77. భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక ప్రక్రియ ఒక?
1) ఓపెన్ (సంప్రదింపులు కల) ప్రక్రియ
2) క్లోజ్డ్ (సంప్రదింపులు లేని) ప్రక్రియ
3) ప్రణాళికని బట్టి ఓపెన్ (సంప్రదింపులు కల) క్లోజ్డ్ (సంప్రదింపులు లేని) ప్రక్రియ
4) చెప్పడం చాలా కష్టం
- View Answer
- సమాధానం: 1
78. ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు 1938లో జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) వల్లబ్‌భాయ్ పటేల్
3) సుభాష్ చంద్రబోస్
4) రాజేంద్రప్రసాద్
- View Answer
- సమాధానం: 3
79. మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతమవడానికి ప్రధాన కారణం ఏమిటి?
1) ప్రణాళిక సంవత్సరాలన్నిటిలో పారిశ్రామిక అభివృద్ధి
2) ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించగలగడం
3) దేశీయ పొదుపు మొత్తంలో త్వరిత వృద్ధి
4) ప్రణాళిక చివరి రెండు ఏళ్లలో మంచి వ్యవసాయ దిగుబడి
- View Answer
- సమాధానం: 4
80.కింది వాటిలో మహలనోబిస్ ప్రణాళికగా పేరుపొందింది ఏది?
1) ప్రథమ పంచవర్ష ప్రణాళిక
2) ద్వితీయ పంచవర్ష ప్రణాళిక
3) తృతీయ పంచవర్ష ప్రణాళిక
4) వార్షిక రోలింగ్ ప్రణాళిక
- View Answer
- సమాధానం: 2
81. ఏ కాలాన్ని భారత్‌లో సభ్యోక్తిగా ప్రణాళిక సెలవు కాలంగా పిలుస్తారు?
1) 1947 - 50
2) 1966-69
3) 1978-80
4) 1992-97
- View Answer
- సమాధానం: 2
82. చంద్రన్న బీమా పథకం ఎవరికి జీవన, వైకల్య బీమా రక్షణ కల్పిస్తుంది?
1) అవ్యవస్థీకృత కార్మికులు
2) చిన్నకారు రైతులు
3) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
4) APSRTC ప్రయాణికులు
- View Answer
- సమాధానం:1
83. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2017-18లో పెట్టే ప్రభుత్వ ఖర్చులో ఎంత భాగం రుణ సేవ (రుణాలు, వడ్డీ చెల్లింపులు) కోసం కేటాయించడం జరిగింది?
1) 10.5%
2) 12.5%
3) 14.5%
4) 16.5%
- View Answer
- సమాధానం: 3
84. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఫోరం పేరు ఏమిటి?
1) మీకోసం
2) మీసేవ
3) మార్పు నేస్తం
4) మార్పుకోసం
- View Answer
- సమాధానం: 1
85. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం భారత్‌లో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది?
1) మొదటి
2) రెండో
3) మూడో
4) నాలుగో
- View Answer
- సమాధానం:2
86. భారత ఆర్థిక మంత్రి సెలవిచ్చిన ప్రకారం GST అమలుకు లక్ష్యిత తేది ఏది?
1) 1 ఏప్రిల్ 2017
2) 1 మే 2017
3) 1 జూన్ 2017
4) 1 జూలై 2017
- View Answer
- సమాధానం: 4
87. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలు తరువాత మార్చి 2017 మధ్య భాగం వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అందించిన ‘కేంద్ర సహాయ’ మొత్తం ఎంత? (దగ్గరి కోటి రూపాయలకు రౌండ్ ఆఫ్ చేయడం జరిగింది)
1) రూ.25,461 కోట్లు
2) రూ.10,461 కోట్లు
3) రూ.5,461 కోట్లు
4) రూ.15,461 కోట్లు
- View Answer
- సమాధానం: 2
88. కింది వాటిలో ఏది నీతి ఆయోగ్ పనికాదు?
1) కేంద్రానికి విధానపరమైన సూచనలు, దిశానిర్దేశక సలహాలు ఇవ్వడం
2) సహకార సమాఖ్య భావనలను పెంపొందించడం
3) రాష్ట్రాలకు ఆర్థిక వనరుల కేటాయింపును నిర్ణయించడం
4) జ్ఞాన కేంద్రంగా వ్యవహరించడం
- View Answer
- సమాధానం: 3
89. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ‘పంట సంజీవని’ కార్యక్రమం దేనికి సంబంధించింది?
1) వ్యవసాయ కుంటల నిర్మాణం
2) రైన్ గన్ (జల్లు కురిపించే యంత్రం)ల పంపిణీ
3) జైవిక ఎరువుల ప్రోత్సాహం
4) సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం
- View Answer
- సమాధానం: 1
90. కింది వరుసలో తరువాతి దాన్ని గుర్తించండి?
CB, HGF, MLKJ, ?
1) QPONM
2) SRQPO
3) RQPON
4) PONML
- View Answer
- సమాధానం: 3
91.కింది వాటిలో మిగతా వాటితో పోలిస్తే భిన్నమైనది ఏది?
1) చతురస్రం
2) సమాంతర చతుర్భుజం
3) వృత్తం
4) పరావలయం
- View Answer
- సమాధానం: 4
ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు (శ్రీకర్, రవి, రాము, మంజు, శోభ, కీర్తి) ఒక వరుసలో, ఉత్తరం నుంచి దక్షిణం వైపు, అందరూ తూర్పు ముఖంగా కూర్చున్నారు. వరుస చిట్ట చివరలో "S" అక్షరంతో మొదలయ్యే పేరు (ఆంగ్లంలో పేరు రాసినప్పుడు) కలవారు కూర్చొనలేదు. మంజు "R" అక్షరంతో మొదలయ్యే పేరు (ఆంగ్లంలో రాసినప్పుడు) వ్యక్తికి ఎడమవైపు కూర్చున్నది. రవి వరుసలో చిట్టచివర కూర్చోలేదు. ఇద్దరు బాలికల మధ్యన "R" అనే అక్షరంతో మొదలయ్యే (ఆంగ్లంలో రాసినప్పుడు) పేరు గల బాలుడు కూర్చొన్నాడు. వరుసలో ఒక చిట్టచివరన ఒక బాలిక కూర్చొన్నది. కీర్తి, శోభకు కుడి పక్కన కూర్చొన్నది. శోభ "R" అనే అక్షరంతో మొదలయ్యే పేరు (ఆంగ్లంలో రాసినప్పుడు) కల బాలునికి కుడి వైపున కూర్చొన్నది. ఉత్తరపు వైపు నుంచి రెండో స్థానంలో కూర్చొన్న బాలుని పేరు "R" తో మొదలు కాదు (ఆంగ్లంలో రాసినప్పుడు). శ్రీకర్, రవిల మధ్య ఒక బాలిక ఉంది. రవి, కీర్తిల మధ్య ఒక బాలిక ఉన్నది.
92. వరుసలో దక్షిణం వైపు చిట్టచివరకూర్చుంది ఎవరు?
1) రాము
2) శోభ
3) కీర్తి
4) మంజు
- View Answer
- సమాధానం: 3
93. వరుసలో ఉత్తరం వైపు చిట్టచివర కూర్చుంది?
1) రవి
2) రాము
3) మంజు
4) శోభ
- View Answer
- సమాధానం: 2
94. వరుసలో మూడో స్థానంలో కూర్చుంది ఎవరు?
1) మంజు
2) రవి
3) శ్రీకర్
4) కీర్తి
- View Answer
- సమాధానం: 1
95. వరుసలో రెండో స్థానంలో కూర్చుంది ఎఛివరు?
1) మంజు
2) శోభ
3) రవి
4) శ్రీకర్
- View Answer
- సమాధానం: 4
96. రవి, కీర్తికి మధ్య ఎవరు కూర్చున్నారు?
1) రాము
2) శోభ
3) మంజు
4) శ్రీకర్
- View Answer
- సమాధానం: 2
97. ఇచ్చిన అక్షరమాలలో, అక్షరాల క్రమంలో ఒక చోట క్రమం తప్పింది. అక్షర క్రమాన్ని సరిచేసేందుకు కావాల్సిన దాన్ని కింద ఇచ్చిన సమాధానాల్లో గుర్తించండి? అక్షరమాల
"AABBCAABBCABBCAABBC AABBC"
1) A
2) B
3) C
4) AA
- View Answer
- సమాధానం: 1
98. "Bird", "Flock"కి ఎలాగో, "subject" కిందిదానికి అలాగ?
1) Object
2) Story
3) Populace
4) Matter
- View Answer
- సమాధానం: 3
99. 75, 50, 90, 65, 105, ? ఈ వరుసలో తర్వాత వచ్చే సంఖ్య ఏది?
1) 120
2) 80
3) 85
4)135
- View Answer
- సమాధానం: 2
100. ఈ కింది వాటిలో మిగతా వాటితో సరిపోలనిది?
- View Answer
- సమాధానం: 3
101. అఖిల్, అమల, నాగలలో ప్రతి ఒక్కరికీ రెండు పెంపుడు జంతువులు ఉన్నాయి. వారిలో ఒక్కరికి మాత్రం కుక్క పిల్ల లేదు. పిల్లి అమల దగ్గర మాత్రమే ఉంది. నాగ దగ్గర కుక్క పిల్ల ఉంది. అమల, అఖిల్‌ల దగ్గర కుందేళ్లు ఉన్నాయి. కుందేలు, తాబేలు రెండూ కలిసి ఎవరి వద్దా లేవు. తాబేలు ఒకరి పెంపుడు జంతువు. తాబేలు ఎవరికి పెంపుడు జంతువు?
1) నాగ
2) అఖిల్
3) అమల
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 1
102. ఏ ఎన్నికల విషయంలో 61వ రాజ్యాంగ సవరణ.. ఓటరు వయోపరిమితిని 21 నుంచి 18కి తగ్గించింది?
1) స్థానిక సంస్థలు
2) లోక్‌సభ
3) రాష్ట్రాల విధానసభలు
4) లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు
- View Answer
- సమాధానం: 4
103. కిందివాటిలో ఏ అంశం పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలోనిదో గుర్తించండి?
1) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
2) రాష్ట్రాల మధ్య వివాదాలు
3) సివిల్, క్రిమినల్ అప్పీళ్లు
4) ప్రజాప్రయోజన వ్యాజ్యాలు
- View Answer
- సమాధానం: 2
104. కోర్ట ఆఫ్ రికార్డ అంటే ఏమిటి?
1) భద్రతా కారణాల దృష్ట్యా న్యాయపరమైన రికార్డులు దాచి ఉంచే కోర్టు
2) ఒక కింది కోర్టు
3) ఏ కోర్టు నిర్ణయం అనుసరణీయ దృష్టాంతంగా ఉంటుందో ఆ కోర్టు
4) రికార్డులకు సంబంధించిన వివాదాలను చూసే కోర్టు
- View Answer
- సమాధానం: 3
105. కింద ఇచ్చిన సమాధానాల్లో.. ఏ సందర్భంలో మాండమస్ రిట్ ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు వర్తించదు?
1) వాతావరణ మార్పుల అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు
2) ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ
3) రైల్వేస్టేషన్లలో శుభ్రత
4) వరద ముప్పు ప్రాంతాల్లో సంరక్షణ గృహాలను నిర్మించడం.
- View Answer
- సమాధానం: 1
106. మన రాజ్యాంగం ఈ భాషకు జాతీయ భాష హోదా ఇచ్చింది?
1) ఇంగ్లిష్
2) హిందీ
3) 22 భాషలు
4) ఏ భాషకు ఇవ్వలేదు.
- View Answer
- సమాధానం: 4
107.ఒక భారతీయ పౌరుడు వేరే దేశంలో స్థిరపడితే.. అతను భారతీయ పౌరసత్వం ఉంచుకుంటూ ఇతర దేశపు పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉందా?
1) లేదు
2) ఉంది
3) ఆ దేశాన్ని బట్టి
4) ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చు
- View Answer
- సమాధానం: 1
108. రాజ్యాంగం నిర్దేశించిన విధముగా ‘బాలలకు ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009’ ప్రకారం ఒక ప్రభుత్వ సాయం పొందని పాఠశాల, ఒకటో తరగతిలో కానీ, ప్రీ స్కూల్ ఉంటే ఆ తరగతిలో కానీ, ఉన్న సీట్ల సంఖ్యలో ఎంత శాతం వరకు, ఇరుగు పొరుగున నివసిస్తోన్న బలహీన, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి?
1) 15%
2) 20%
3) 25%
3) 30%
- View Answer
- సమాధానం: 3
109.రాష్ర్ట శాసనసభలో ఓటింగ్ సమయంలో మిశ్రమ బల నిరూపణ పరీక్ష (కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్) అంటే ఏమిటి?
1) మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు ఒకరి కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు స్పీకర్ శాసనసభలో ఆదేశించే ఓటింగ్
2) మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు ఒకరి కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు గవర్నర్ శాసనసభలో ఆదేశించే ఓటింగ్
3) ఏక కాలంలో వివిధ బిల్లుల ఆమోదం కోసం పెట్టే ఓటింగ్
4) అసెంబ్లీలో ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యులు కలిసి మెలిసి కూర్చొని, జతలుగా ఓటింగ్‌లో పాల్గొనడం
- View Answer
- సమాధానం: 2
110. రాజ్యాంగంలోని అధికరణం 352 ప్రకారం రాష్ర్టపతి ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు?
1) సుమోటో (తనకు తానుగా)
2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా ప్రకారం
3) కేబినెట్ లిఖితపూర్వక సలహా ప్రకారం
4) హోం మంత్రి సలహా ప్రకారం
- View Answer
- సమాధానం: 3
111. ఒకే సమయంలో భారత్‌లో రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి పదవులు ఖాళీ అయినప్పుడు ఎవరు రాష్ర్టపతిగా వ్యవహరిస్తారు?
1) ప్రధానమంత్రి
2) లోక్‌సభ స్పీకర్
3) ఎన్నికల ప్రధాన అధికారి
4) భారత ప్రధాన న్యాయమూర్తి
- View Answer
- సమాధానం: 4
112.ఏ సభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చు?
1) కేవలం లోక్‌సభలో
2) కేవలం రాజ్యసభలో
3) ఏదైనా సభలో
4) కేవలం రెండు సభల సంయుక్త సమావేశాల్లో
- View Answer
- సమాధానం: 1
113. సాధారణంగా ఏ రోజున ప్రైవేట్ సభ్యుని బిల్లు లోక్‌సభలో చర్చించబడుతుంది?
1) సోమవారం
2) బుధవారం
3) శుక్రవారం
4) శనివారం
- View Answer
- సమాధానం: 3
114.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం,2014లోని ఏ పరిచ్ఛేదాన్ని పోలవరం ఆర్డినెన్స బిల్లుగా పేరుపడిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ ఆర్డినెన్స-2014ను సవరించింది?
1) 1వ పరిచ్ఛేదం
2) 2వ పరిచ్ఛేదం
3) 3వ పరిచ్ఛేదం
4) 4వ పరిచ్ఛేదం
- View Answer
- సమాధానం:3
115. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 26వ పరిచ్ఛేదం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన ద్వారా ప్రస్తుతమున్న 175 నుంచి ఎంతకు పెంచవచ్చు?
1) 200
2) 225
3) 250
4) 275
- View Answer
- సమాధానం: 2
116. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏ కులాన్ని రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఆర్డర్, 1950 నుంచి తొలగించారు?
1) బేడ(బుడగ) జంగం
2) బావురి
3) బారికి
4) బిండ్ల
- View Answer
- సమాధానం: 1
117. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం,2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు, భత్యాల ఖర్చు
1) రెండు రాష్ట్రాల మధ్య 50:50 నిష్పత్తిలో పంచుతారు.
2) రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం పంచుతారు.
3) ఈ మొత్తాలను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
4) కోర్టుల్లో ఆయా రాష్ట్రాల నుంచి దాఖలైన కేసుల సంఖ్యను బట్టి రాష్ట్రాల మధ్య పంచుతారు.
- View Answer
- సమాధానం: 4
118. రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు జరుగుతుంది?
1) అధికరణం 211
2) అధికరణం 212
3) అధికరణం 213
4) అధికరణం 214
- View Answer
- సమాధానం: 4
119. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని ఏ షెడ్యూల్ ఏపీఎస్ఎఫ్సీ ఉంది?
1) 7వ షెడ్యూల్
2) 8వ షెడ్యూల్
3) 9వ షెడ్యూల్
4) 10వ షెడ్యూల్
- View Answer
- సమాధానం: 3
120.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని 46వ పరిచ్ఛేదం ప్రకారం, 13వ ఆర్థిక సంఘం కేటాయించిన మొత్తాన్ని ఏ విధంగా రెండు రాష్ట్రాల మధ్య విభజించాలి?
1) జనాభా నిష్పత్తి, ఇతర ప్రమాణాల ప్రకారం
2) బడ్జెట్ కేటాయింపుల ప్రకారం
3) షీలా భిడే కమిటీ నిర్ణయించిన ప్రకారం
4) 14వ ఆర్థిక సంఘం నిర్ణయించిన ప్రకారం
- View Answer
- సమాధానం: 1
121. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలోని సభ్యులు?
1) వై.రామకృష్ణుడు, కె.అచ్చంనాయుడు, గంటా శ్రీనివాసరావు
2) వై.రామకృష్ణుడు, కె.అచ్చంనాయుడు, కె.శ్రీనివాసులు
3) కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కె.శ్రీనివాసులు
4) కేఈ కృష్ణమూర్తి, పి.నారాయణ, పి.కేశవ్
- View Answer
- సమాధానం: 2
122.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని పరిచ్ఛేదం 51(1) కింద పరిశ్రమల నుంచి వాయిదా పన్నులను వసూలు చే సే హక్కు ఎవరికి ఉంటుంది?
1) రెండు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో
2) జనాభా నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాలకు
3) ఆ పరిశ్రమ ఏ రాష్ర్టంలో ఉంటే ఆ రాష్ట్రానికి
4) ఉమ్మడి రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో ఆ పరిశ్రమకు వచ్చిన టర్నోవర్ ఆధారంగా రెండు రాష్ట్రాలకు ఉంటుంది.
- View Answer
- సమాధానం: 3
123. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, ఆగస్టులో ప్రచురించిన శ్వేతపత్రం ప్రకారం రాష్ర్ట విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రుణ/స్థూల రాష్ర్ట ఉత్పత్తి (GSDP) నిష్పత్తులు ఇలా ఉన్నాయి?
1) 9.4 మరియు 8.1
2) 11.4 మరియు 18.1
3) 29.4 మరియు 28.1
4) 19.4 మరియు 18.1
- View Answer
- సమాధానం: 4
124. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పేర్కొన్న ‘నియమిత దినము’ ఏది?
1) 2014, జూన్ 2
2) 2014, మార్చి 4
3) 2014, జులై 2
4) 2014, మార్చి 1
- View Answer
- సమాధానం: 1
125. ‘సాముదాయక అభివృద్ధి కార్యక్రమాలపై’ అధ్యయనం కోసం నియమించిన కమిటీ?
1) సంతానం కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
4) జీవీకే రావు కమిటీ
- View Answer
- సమాధానం: 3
126. పంచాయతీరాజ్ విషయంలో రాష్ట్రాల విధాన మరియు శాసకీయ వ్యవస్థ మదింపు, ఫలితాల విశ్లేషణలకు కేంద్ర ప్రభుత్వం ఈ కింది నివేదికను వినియోగిస్తుంది?
1) వార్షిక సంక్రమణ సూచిక నివేదిక
2) పంచాయతీరాజ్ డాష్ బోర్డ
3) జాతీయ విస్తరణ సేవల నివేదిక
4) పంచాయతీరాజ్ ప్రగతి నివేదిక
- View Answer
- సమాధానం: 1
127. భారత్‌లో మొట్టమొదటసారి పంచాయతీరాజ్ సంస్థలను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1959, జనవరి 26
2) 1959, ఆగస్టు 15
3) 1959, అక్టోబర్ 2
4) 1959, ఏప్రిల్ 14
- View Answer
- సమాధానం: 3
128.అశోక్ మెహతా కమిటీ దీన్ని సిఫార్సు చేసింది?
1) మూడంచెల వ్యవస్థ
2) రెండంచెల వ్యవస్థ
3) జిల్లా కలెక్టర్ సంస్థ
4) జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ?
- View Answer
- సమాధానం: 2
129. స్వతంత్ర భారతంలో సాముదాయిక అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించిందెవరు?
1) కె.ఎల్.రావు
2) కె.ఎం.మున్షీ
3) ఎస్.కె.డే
4) వినోభాభావే
- View Answer
- సమాధానం: 3
130. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన అధికరణములలో ఈ కింది విషయం లేదు?
1) మూడంచెల పంచాయత్ వ్యవస్థ
2) కుల పంచాయత్‌ల స్థాపన
3) షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ జాతుల వారికి స్థానాల్లో రిజర్వేషన్
4) రాష్ట్ర ఎన్నికల సంఘాల స్థాపన
- View Answer
- సమాధానం: 2
131.గ్రామ పంచాయతీలపై మహాత్మాగాంధీ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి?
1) ప్రాంతీయ ప్రభుత్వాలు పంచాయతీలను పూర్తిగా నియంత్రించాలి
2) పంచాయతీలపై కేంద్రీయ నియంత్రణ ఉండాలి
3) పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించరాదు
4) పంచాయతీలు గణతంత్ర గ్రామ వ్యవస్థగా ఉండాలి
- View Answer
- సమాధానం: 4
132.రాజ్యాంగంలో 11వ షెడ్యూల్లో ఎన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి?
1) 27
2) 28
3) 29
4) 25
- View Answer
- సమాధానం: 3
133.ఇ-పంచాయత్ కార్యక్రమ అమలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వార్షిక పురస్కారం పేరు ఏమిటి?
1) ఇ-గ్రామ్
2) ఇ-పురస్కార్
3) ఇ-పాలన్
4) ఇ-శిరోమణి
- View Answer
- సమాధానం: 2
134. 2016-17 సంవత్సరానికి స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్ల కింద పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వార్షిక కేటాయింపు ఎంత?
1) రూ.1463.45 కోట్లు
2) రూ.642.77 కోట్లు
3) రూ.934.34 కోట్లు
4) రూ.1744.40 కోట్లు
- View Answer
- సమాధానం: 1
-
135. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994 ప్రకారం గ్రామ సభ కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి?
1) సంవత్సరంలో 4 సార్లు
2) సంవత్సరంలో 2 సార్లు
3) సంవత్సరంలో 6 సార్లు
4) నెలకొక్కసారి
- View Answer
- సమాధానం: 2
-
136. టి.ప్రకాశం గారి నేతృత్వంలో ప్రాదేశిక ప్రభుత్వం 1946లో ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి పథకం పేరు ఏమిటి?
1) గ్రామ అభివృద్ధి పథకం
2) తాలూకా అభివృద్ధి పథకం
3) ఫిర్కా అభివృద్ధి పథకం
4) జిల్లా అభివృద్ధి పథకం
- View Answer
- సమాధానం: 3
-
137. మద్రాస్ గ్రామ పంచాయత్‌ల చట్టం, 1950 ప్రకారం పంచాయతీలను ఎన్ని తరగతులుగా వర్గీకరించారు?
1) ఒకే తరగతి
2) రెండు తరగతులు
3) మూడు తరగతులు
4) నాలుగు తరగతులు
- View Answer
- సమాధానం: 2
-
138. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితుల, జిల్లా పరిషత్‌ల చట్టం, 1959 ప్రకారం పంచాయతీ సమితి సభ్యులను ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు?
1) సమితిలోని అన్ని గ్రామ పంచాయతీ అధ్యక్షులు ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉంటారు
2) ఓటర్లచే ప్రత్యక్ష ఎన్నిక
3) సమితిలోని అన్ని పంచాయతీ వార్డల సభ్యులచే ఎన్నుకొనబడుట
4) సమితిలోని అన్ని పంచాయతీలు ఒక సభ్యుడిని నామినేట్ చేస్తాయి
- View Answer
- సమాధానం: 1
-
139. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ సమితుల స్థానంలో మండల్ ప్రజాపరిషత్‌లను స్థాపించారు?
1) 1974
2) 1980
3) 1985
4) 1986
- View Answer
- సమాధానం: 4
-
140.పునర్వ్యవస్థీకరణకు ముందు 2014లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ సమితుల రద్దు తర్వాత ఎన్ని మండళ్లు ఏర్పడ్డాయి?
1) 1014
2) 1104
3) 1401
4) 1140
- View Answer
- సమాధానం: 2
-
141. కిందివాటిలో ఎం.టి.రాజు కమిటీ సిఫారసు ఏది?
1) పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు
2) గ్రామ సర్పంచ్‌ని ప్రత్యక్షంగా ఎన్నుకొనుట
3) జిల్లా అభివృద్ధి బోర్డుల ఏర్పాటు
4) బ్లాక్ అభివృద్ధి బోర్డుల ఏర్పాటు
- View Answer
- సమాధానం: 3
-
142. కిందివాటిలో సి.నరసింహం కమిటీ సిఫారసు ఏది?
1) జిల్లా అభివృద్ధి బోర్డుల ఏర్పాటు
2) మండల ప్రజా పరిషత్‌ల ఏర్పాటు
3) మహిళలకు జిల్లా పరిషత్‌లో రిజర్వేషన్
4) పంచాయతీ సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక
- View Answer
- సమాధానం: 4
-
143.మండల్ ప్రజా పరిషత్‌ల స్థాపనలోని ఉద్దేశం?
1) మెరుగైన పాలన కోసం సామాన్య మానవునికి, అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించడం
2) మెరుగైన పాలన కోసం పాత బ్లాక్ వ్యవస్థకు తిరిగి మళ్లడం
3) జన బాహుళ్యంపై మెరుగైన నియంత్రణ
4) కేంద్రం నిర్దేశించిన విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పుల అమలు
- View Answer
- సమాధానం: 1
-
144.ఒక పంచాయతీ సభ్యుని అనర్హత విషయంలో, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని 19(3) పరిచ్ఛేదంలో ఎంత మంది సంతానం అని తెలిపినారు?
1) ఒక్కరు
2) ఇద్దరు
3) ముగ్గురు
4) ఇంత మంది అని తెలుపలేదు
- View Answer
- సమాధానం: 2
-
145. MGNREGA పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో సుమారు ఎన్ని జాబ్ కార్డులను జారీ చేసింది? (దగ్గరగా ఉన్న సంఖ్యను గుర్తించండి)
1) 50 లక్షలు
2) 60 లక్షలు
3) 75 లక్షలు
4) 85 లక్షలు
- View Answer
- సమాధానం: 4
-
146. 2016-17 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో MGNREGA పథకం కింద చేసిన మొత్తం ఖర్చులో పనివారికి ఇచ్చిన కూలి ఖర్చు ఎంత శాతం? (దగ్గరగా ఉన్న గణాంకాన్ని గుర్తించండి)
1) 80%
2) 70%
3) 60%
4) 50%
- View Answer
- సమాధానం: 3
-
147. కింది వాటిలో ఏది MGNREGA చట్టంలోఉద్దేశాల్లో ఒకటి కాదు?
1) గ్రామీణ యువతకు ఉన్నత విద్య అందించుట
2) పంచాయతీరాజ్ సంస్థలను పరిపుష్టం చేయడం
3) సామాజిక సమ్మిళిత తత్వాన్ని చొరవతో ఏర్పరచడం
4) పేద ప్రజల జీవనాధార వనరుల మూలాలను పరిపుష్టం చేయడం
- View Answer
- సమాధానం: 1
-
148. ‘బేర్ ఫుట్ టెక్నీషియన్’లను (పాదరక్షలు లేని సాంకేతిక కార్మికుడు) ఏ పథకంలో నియమిస్తారు?
1) అందరికీ ఆరోగ్యం
2) MGNREGA
3) PMAY
4) NURM
- View Answer
- సమాధానం: 2
-
149. జాతీయ గ్రామీణ, పంచాయతీరాజ్ సంస్థ ఎక్కడ ఉంది?
1) జైపూర్
2) కొచ్చి
3) హైదరాబాద్
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 3
-
150. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపిక కావడానికి అర్హతకై, మైదాన ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీ జన సంఖ్య ఎంత ఉండవచ్చు?
1) 1000 నుంచి 2000
2) 1000 నుంచి 3000
3) 2000 నుంచి 4000
4) 3000 నుంచి 5000
- View Answer
- సమాధానం: 4