NEET 2021: జాతీయస్థాయిలో 11 మందికి 100లోపు ర్యాంక్లు
విశ్వవిద్యాలయం అధికారిక వెబ్ సైట్ లో జాబితాను ఉంచింది. ఇది సమాచారం నిమిత్తమేనని, కౌన్సెలింగ్ కు అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్ జాబితా విడుదల చేస్తామని వీసీ డాక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని వైద్య కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసి కౌన్సెలింగ్ చేపడతారు. ఈ ప్రక్రియ జరగడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
11 మందికి 100లోపు ర్యాంక్లు
రాష్ట్రం నుంచి నీట్ కు హాజరైన వారిలో 39,388 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో తొలి వందలోపు ఆల్ ఇండియా ర్యాంక్లను 11 మంది సాధించారు. వీరిలో ఎనిమిది మంది జనరల్ అభ్యర్థులు, ముగ్గురు ఓబీసీ కేటగిరీకి చెందిన వారు ఉన్నారు.
ఆలిండియా ర్యాంకులు 100లోపు సాధించిన వారు..
విద్యార్థి |
ర్యాంకు |
చందం విష్ణు వివేక్ |
13 |
గొర్రిపాటి రుషిల్ |
15 |
పి. వెంకట కౌశిక్ రెడ్డి |
27 |
కేతంరెడ్డి గోíపీచంద్ రెడ్డి |
36 |
టి. సత్యకేశవ్ |
41 |
పరుచూరి వెంకటసాయి అమిత్ |
47 |
పి. కార్తీ్తక్ |
53 |
ఎస్. వెంకటకల్పజ్ |
58 |
కె. చైతన్య కృష్ణ |
71 |
పి. సాకేత్ |
84 |
వి. నిఖిత |
89 |
కటాఫ్ మార్కులు ఇలా..
జనరల్ కేటగిరీ: 138
జనరల్ పీడబ్ల్యూడీ కేటగిరీ: 122
బీసీ, ఎస్సీ, ఎస్టీ (పీడబ్ల్యూడీతో కలిపి): 108
చదవండి:
Intermediate: ప్రవేశాల గడువు పొడిగింపు: ఇంటర్ బోర్డు కార్యదర్శి