నీట్ పీజీ మెడికల్, ఎండీఎస్ పరీక్షలు వాయిదా వేయండి
వీరి ఇంటర్న్‌షిప్ పూర్తి కాకముందే పీజీ నీట్ మెడికల్, పీజీ నీట్ ఎండీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుండడంతో.. వీరు ఆయా పరీక్షలను రాయలేని పరిస్థితి నెలకొంది. బీడీఎస్ విద్యార్థులకు 2023 ఏప్రిల్లో, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆగస్టులో ఇంటర్న్షిప్ పూర్తికానుంది. ఈ రెండు కోర్సులకూ 2023 మార్చిలోనే ప్రవేశపరీక్షలను నిర్వహించడానికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్విసెస్(డీజీహెచ్‌ఎస్) ప్రకటన విడుదల చేసింది.
చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
దీంతో ఏడాది కాలాన్ని నష్టపోవాల్సి వస్తుందనే ఆందోళనలో విద్యార్థులున్నారు. దీనిపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఫిర్యాదులు రావడంతో.. జనవరి 12న ఆరోగ్య వర్సిటీ కేంద్ర ప్రభుత్వానికి, డీజీహెచ్‌ఎస్‌కు వేర్వేరుగా లేఖలు రాసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీట్ పీజీ మెడికల్, నీట్ పీజీ ఎండీఎస్ పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా కోరింది.