సాక్షి, అమరావతి: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)పీజీ– 2023 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మర్చి 14న విడుదల చేసింది.
నీట్ పీజీ ఫలితాలు విడుదల.. కటాఫ్ ఇలా..
వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 5న దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షను నిర్వహించారు. 849 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,82,318 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలు వెలువడ్డాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 31న ఫలితాలు వెలువడాల్సి ఉంది. వ్యక్తిగత స్కోర్ కార్డును మార్చి 25న అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.