NEET 2022: రేపే ‘నీట్’.. ఈ టైంకి పరీక్ష కేంద్రం గేట్ మూసివేస్తారు..
Sakshi Education
దేశవ్యాప్తంగా MBBS, BDSల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET–2022 పరీక్ష జూలై 17న జరగనుంది.
ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకు పెన్, పేపర్ పద్ధతిలో జరగనుంది. గతేడాది మూడు గంటలున్న పరీక్షను ఈసారి మరో 20 నిమిషాలు అదనంగా పెంచారు. పరీక్ష కేంద్రానికి అడ్మిట్ కార్డ్‌లో సూచించిన సమయానికి తప్పనిసరిగా చేరుకోవాలి. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రం గేట్ మూసివేస్తారు. ఆ తర్వాత కేంద్రంలోకి అను మతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి దాదాపు 55 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యా ప్తంగా 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, నిషేధిత వస్తువులతోసహా ఎలాంటి వ్యక్తిగత వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. పరీక్షలకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం అభ్యర్థులు 011–40759000 నంబర్‌కు ఫోన్ చేయొచ్చు.
చదవండి:
Published date : 16 Jul 2022 03:45PM