విద్యార్ధులకు, టీచర్లకు… గ్లోబల్ గ్రాడ్ షో పోటీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో గ్లోబల్ గ్రాడ్ షో (https://www.gloabalgradshow.com) ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్ధులు, విశ్వవిద్యాలయాల కోసం ఓ స్పర్ధను ఏర్పాటు చేసింది.
హోం క్వారంటైన్ మొదలుకొని బహిరంగ ప్రదేశాల్లో వైరస్‌ను నాశనం చేయడం వరకు కరోనా కీలక సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం ఈ పోటీ ప్రధాన ఉద్ధేశం. విద్యార్ధులు, అన్ని విశ్వవిద్యాలయాలు, సైన్సేతర రంగాల అధ్యాపకులు కూడా పోటీలో పాల్గొనవచ్చు. ఈ పోటీలో వెలుగులోకి వచ్చే వినూత్నమైన పరిష్కారాలు వినియోగంలోకి వస్తే ఆ విద్యార్ధికి ఏడాది ఫీజును బహుమతిగా అందిస్తారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నుంచి ప్రజలను, ఆర్ధిక రంగాన్ని రక్షించుకునేందుకు ఈ గ్లోబల్ గ్రాడ్ షో పోటీ ఉపయోగపడుతుందని ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో మహమ్మద్ అల్ షైబానీ తెలిపారు. ఏప్రిల్ 16న విజేతలను ప్రకటిస్తారు.
Published date : 07 Apr 2020 05:05PM