విద్యా సంస్థలకు యూజీసీ, ఎమ్‌హెచ్‌ఆర్‌డీ సూచనలు
Sakshi Education
కరోనా (కోవిడ్ -19) వైరస్ క్రమేణా విస్తరిస్తున్న నేపథ్యంలో దాని నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని విద్యాసంస్థలకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎమ్‌హెచ్‌ఆర్‌డీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీచేశాయి.
కరోనా వైరస్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని యూజీసీ అన్ని యూనివర్సిటీలు, వాటి అనుబంధ, గుర్తింపు పొందిన కాలేజీలకు సూచనలు జారీచేసింది.
- విద్యార్థులు పెద్దపెద్ద గుంపులుగా ఒకే చోట చేరకుండా చూడాలి
- జలుబు, దగ్గు వంటి లక్షణాలతో కనిపిస్తే వెంటనే చికిత్స కేంద్రాలకు పంపాలి.
- చికిత్స పూర్తయ్యే వరకు ఆ విద్యార్థులు క్యాంపస్‌కు రాకుండా చూడాలి.
- విద్యార్థులు చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించేలా చూడాలి.
- పతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలి. ముక్కు చీదినప్పుడు, తుమ్మినప్పుడు టిష్యూపేపర్లను అడ్డం పెట్టుకోవాలి.
Published date : 12 Mar 2020 02:41PM