వేసవి సెలవుల్లోనూ... ‘మధ్యాహ్న భోజనం’ : రమేశ్ పొఖ్రియాల్
Sakshi Education
న్యూఢిల్లీ: వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ ఏప్రిల్ 28న స్పష్టం చేశారు.
అందుకు రూ.2,600 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించాలని సూచించారు. లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యాహ్న భోజనంతో 11.34 లక్షల పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న 11.5 కోట్ల మంది చిన్నారులు ప్రయోజనం పొందుతారని తెలిపారు.
Published date : 29 Apr 2020 05:47PM