ఉద్యోగులూ.. తస్మాత్ జాగ్రత్త
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని, కరోనా వైరస్ బారిన పడకుండా వ్యక్తిగత శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు.
మార్గదర్శకాలు ఇలా..
మార్గదర్శకాలు ఇలా..
- కంటైన్మెంట్, బఫర్ జోన్‌కు 3 కి .మీ.ల పరిధిలో నివసించే ఉద్యోగులు విధులకు హాజరుకావద్దు.
- పరిమిత స్థాయిలో, రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వర్తించాలి.
- హైరిస్క్ ఉన్న ఉద్యోగులను, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, అనా రోగ్య సమస్యలు ఎదుర్కొనేవారిని డ్యూటీల నుంచి మినహాయించాలి.
- విధులకు హాజరయ్యే ఉద్యోగులు విధిగా పాసులను అందుబాటులో ఉంచుకోవాలి. రోజులవారీగా ఏయే ఉద్యోగులు ఏయే రోజులు డ్యూటీలకు హాజరవుతారనేది పాస్‌లపై స్పష్టంగా పేర్కొనాలి.
- హోం క్వారంటైన్‌లో ఉండాలనుకునే ఉద్యోగులకు సెలవులిచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించాలి.
- పని ప్రదేశం, ఉద్యోగులు ఎక్కువగా రాకపోకలు సాగించే మార్గం/లిఫ్ట్, కారిడార్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. క్రమం తప్పకుండా సబ్బు, ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి.
- ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు భౌతిక దూరం పాటించాలి. సీటుకు సీటుకు మధ్య కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి.
- ఆఫీసు లేదా ప్రాంగణం, క్యాంటీన్‌లోగానీ ఎట్టి పరిస్థితుల్లో నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దు.
- కార్యాలయాలకు సందర్శకులు రాకుండా జాగ్రత్త పడాలి. తాత్కాలిక పాసుల జారీని కూడా నిలిపేయాలి. ఒకవేళ ఎవరైనా అధికారిని కలవాలనుకుంటే అన్ని రకాలుగా స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతించాలి.
- సమావేశాలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు జరపాలి.
- ఉత్తర ప్రత్యుత్తరాలు పూర్తిస్థాయిలో ఈ మెయిల్స్ ద్వారానే చేపట్టాలి.
Published date : 23 Apr 2020 04:20PM