Skip to main content

సుప్రీం కోర్టు సంచలన తీర్పు:ఇక డీమ్డ్ వర్సిటీ డిగ్రీలకు ఓకే!

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు తదితర అంశాల్లో ఇకపై డీమ్డ్ వర్సిటీల డిగ్రీలు కూడా చెల్లుబాటు అవ్వనున్నాయి.
ఇందిరా గాంధీ నేషన్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)తో పాటు మరో నాలుగు డీమ్డ్ వర్సిటీలు జారీ చేసిన బీటెక్, డిప్లొమా డిగ్రీలు.. ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్ ప్రోత్సాహాకాలు, ఇతర ప్రయోజనాల కోసం పలు షరతులతో చెల్లుబాటు అవుతాయని తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్ కో) సీఎండీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పు అమలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వర్సిటీల నుంచి దూరవిద్య ద్వారా బీటెక్, డిప్లొమా కోర్సులు చేసిన విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతులు, నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల్లో అవకాశాలు లభించనున్నాయి.

ఆ నాలుగు డీమ్డ్ వర్సిటీలివే..
జేఎన్‌ఆర్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఉదయ్‌పూర్, రాజస్తాన్; ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్‌ఈ), సర్దార్ షహర్, రాజస్తాన్; అలహాబాద్ అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్; వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్, సలెం, తమిళనాడు నుంచి బీటెక్, డిప్లొమా చేసిన వారికి షరతులతో ప్రయోజనాలు లభించనున్నాయి.
Published date : 16 Dec 2020 03:26PM

Photo Stories