‘సెప్టెంబర్ 21కి (దోస్త్)డిగ్రీ సీట్ల కేటాయింపు వాయిదా’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం చేపట్టిన రిజిస్ట్రేషన్ల గడువును సెప్టెంబర్ 9 వరకు పొడగించడంతో నేడు ప్రకటించాల్సిన సీట్ల కేటాయింపును ఈ నెల 21కి వాయిదా వేసినట్లు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు.
సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోందని, వీలైతే ముందుగానే సీట్ల కేటాయింపును ప్రకటిస్తామని మంగళవారం ఓ ప్రకటనలో వివరించారు. ఈనెల 21న దోస్త్ రెండోదశ రిజిస్ట్రేషన్లు, వెబ్‌ఆప్షన్లు ప్రారంభం అవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం 1,71,275 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా, వీరిలో 1,63,300 మంది విద్యార్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేశా రని వెల్లడించారు. వారిలో 1,52,272 మం ది కళాశాలల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నట్లు కన్వీనర్ తెలిపారు.
Published date : 16 Sep 2020 01:06PM