నాక్, ఎన్‌ఐటీహెచ్‌ఎంలలో ఎస్సీ విద్యార్థులకు శిక్షణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నాక్) ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ పట్టభద్రులకు, జాతీయ పర్యాటక, ఆతిథ్య నిర్వహణ సంస్థ (ఎన్‌ఐటీహెచ్‌ఎం) ఆధ్వర్యంలో పది, ఇంటర్ పాసైన అభ్యర్థులకు శిక్షణనిస్తున్నట్టు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ తెలియజేసింది.
నాక్‌లో ఇంజనీరింగ్ పట్టభద్రులకు నిర్మాణరంగంలో, ఎన్‌ఐటీహెచ్‌ఎంలో టెన్త్, ఇంటర్ పాసైన వారికి చెఫ్‌లుగా శిక్షణనిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు హైదరాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవాలని సంస్థ వైస్‌చైర్మన్, ఎండీ లచ్చిరీం భూక్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Published date : 05 Mar 2020 04:34PM