Skip to main content

మరింత ఉన్నతంగా ట్రిపుల్ ఐటీలు: ఆదిమూలపు సురేష్

నూజివీడు: ట్రిపుల్ ఐటీలను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి సోమవారం కౌన్సెలింగ్‌ను మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ట్రిపుల్ ఐటీలను నిర్వీర్యం చేయాలని చూసిందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం జాతీయస్థాయిలో ప్రముఖ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. బోధనా సిబ్బంది ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రవేశ పత్రాలు అందించారు. అలాగే ఈ ఏడాదికి ఇంటర్ అడ్మిషన్లు ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని, సంక్రాంతి తర్వాత తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు, ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి, ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Published date : 05 Jan 2021 04:08PM

Photo Stories