మోడల్ స్కూళ్లలో ప్రవేశ దరఖాస్తుల గడువు మార్చి 10 వరకుపెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9, 10 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించారు.
ఈ గడువును మార్చి 10 వరకు పొడిగించినట్లు మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 12కు బదులు ఏప్రిల్ 19న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Published date : 29 Feb 2020 02:16PM