జేఈఈ మెయిన్ 2021: జనవరిలో కాదు ఫిబ్రవరిలో..
Sakshi Education
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పించే జేఈఈ-మెయిన్ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పరీక్ష జనవరిలో జరగాల్సి ఉంది. ఇంజనీరింగ్ ప్రవేశాలు ఇంకా జరుగుతూనే ఉన్నందున జేఈఈ మెయిన్‌ను వాయిదా వేసినట్లు తెలిపారు. సరైన బ్రాంచ్‌గానీ, స్కోర్‌గానీ రాలేదనుకునే విద్యార్థులకు ఇది మరో అవకాశాన్ని ఇస్తుందని అన్నారు. పెరుగుతున్న కరోనా కేసులు కూడా వాయిదాకు మరో కారణమని చెప్పారు. పరీక్ష తేదీ వివరాలు త్వరలో వెల్లడవుతాయని చెప్పారు. వచ్చే నెలలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.
Published date : 24 Nov 2020 02:03PM