గూగుల్‌తో బైజూస్ జట్టు..ఎందుకంటే..?
Sakshi Education
న్యూఢిల్లీ: దేశీయంగా పాఠశాలల్లో ఆన్‌లైన్ విద్యాభ్యాసానికి తోడ్పడేలా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో దేశీ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్ చేతులు కలిపింది.
ఈ డీల్ ప్రకారం గూగుల్ వర్క్‌స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్, బైజూస్‌కి చెందిన విద్యార్థి పోర్టల్‌ను అనుసంధానిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న విద్యాసంస్థలు.. బైజూస్‌కి చెందిన మ్యాథ్స్, సైన్స్ బోధనా విధానాలతో తమ విద్యార్థులకు రిమోట్‌గా బోధించవచ్చు.
ఈ లక్ష్యంతో...
దీనితో పాటు ఉపాధ్యాయులకు గూగుల్ క్లాస్‌రూమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ విద్యాభ్యాసం ప్రయోజనాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలుసుకుంటున్నారని బైజూస్ సీవోవో మృణాల్ మోహిత్ తెలిపారు. గూగుల్‌తో భాగస్వామ్యం ద్వారా ఉపాధ్యాయులకు అవసరమైన సాంకేతిక తోడ్పాటును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

Published date : 03 Jun 2021 07:28PM