ఎన్‌ఎంఎంఎస్, ఎన్‌టీఎస్‌ఈ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి...
Sakshi Education
సాక్షి, అమరావతి: జాతీయ ఉపకార వేతన పరీక్ష, రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్‌టికెట్లను సిద్ధం చేసినట్లు ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హాల్‌టికెట్లు www.bse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి ఈనెల 20వ తేదీలోపు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. హెడ్మాస్టర్లు వారి స్కూలు ఎస్సెస్సీ కోడ్ ద్వారా లాగిన్ అయి్య విద్యార్థుల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేయించాలన్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తదితర స్కూళ్ల వారు వారికి కేటాయించిన స్కూల్‌కోడ్‌ను వినియోగించి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఎన్‌ఎంఎంఎస్ హాల్‌టికెట్ల కోసం యూడైస్ కోడ్ ఉపయోగించి లాగిన్ అయి్య డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని సూచించారు.
Published date : 20 Feb 2021 03:32PM