ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్: షెడ్యూల్ఇదిగో..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు (సీఎస్‌ఏబీ) నిర్ణయించింది.
ఈ నెల 16 నుంచి రెండు విడతలుగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది. దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐ ప్రవేశాలకు జాయిం ట్ సీట్ అలకేషనల్ అథారిటీ (జోసా) గత నెల 6 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఆరు విడతల్లో నిర్వహించింది. ఆరో విడత సీట్ల కేటాయింపును ఈ నెల 7న ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులంతా సోమవారం నుంచి 13వ తేదీలోగా జోసా పోర్టల్ ద్వారా ప్రవేశాల ఫీజును కొంత మొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకోవాలని జోసా వెల్లడించింది. ఆ కౌన్సెలింగ్ తరువాత ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సీఎస్‌ఏబీ షెడ్యూల్ జారీ చేసింది.
షెడ్యూల్ఇలా...
- 16-11-2020: జోసాలో మిగిలిపోయిన సీట్ల వివరాల ప్రకటన
- 17-11-2020 నుంచి 19-11-2020: రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, చాయిస్ ఫిల్లింగ్
- 20-11-2020: సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విడత-1 సీట్ల కేటాయింపు
- 20-11-2020 నుంచి 23-11-2020 వరకు: సీట్ యాక్సెప్టెన్స్, సీట్ల సరెండర్, ఆన్‌లైన్ రిపోర్టింగ్
- 25-11-2020: ప్రత్యేక విడత-2 సీట్ల కేటాయింపు
- 25-11-2020 నుంచి 27-11-2020: సీట్ యాక్సెప్టెన్స్, ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ల అప్‌లోడ్.
- 25-11-2020 నుంచి 30-11-2020 వరకు: రెండు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ రిపోర్టింగ్.
Published date : 09 Nov 2020 03:59PM