దోస్త్ పై సందేహాలుంటే హెల్ప్‌డెస్క్‌లకు ఫోన్ చేయొచ్చు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ప్రవేశాలపై సందేహాలుంటే తమ కార్యాలయంలోని హెల్ప్‌డెస్క్‌కు (040-66662262), ఉన్నత విద్యామండలి ఆఫీసులో డా.విజయారెడ్డి (99486 65161), డా.వసుంధర (98490 65364), సీసీఈ ఆఫీసులో టి.సురేశ్ కుమార్(7660020720), వాట్సాప్ నంబర్‌లో (7901002200) సంప్రదించాలని డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) కన్వీనర్ ప్రొ.లింబాద్రి తెలిపారు.
ఈ నెల 21న సీట్లు పొందినవారు 1,41,340 మంది ఉండగా, 23 వరకు 30,274 మందే సెల్ఫ్ రిపోర్ట్ చేశారన్నారు. సెల్ఫ్ రిపోర్ట్‌కు ఈ నెల 26 ఆఖరు తేదీ అని పేర్కొన్నారు. రెండో దశ కౌన్సెలింగ్‌కు త్వరగా వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలని, మీసేవా కేంద్రాల్లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Published date : 24 Sep 2020 04:14PM