Skip to main content

‘డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్’ క్విజ్ ఎలా ఉంటుందంటే..

సాక్షి, హైదరాబాద్: డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్ (DSSL) క్లిష్టమైన ఆలోచన, అభిరుచి ఆధారిత క్విజ్ పోటీ. భారతదేశంలోని 500 నగరాల్లో 30వేలకు పైగా పాఠశాలల నుంచి ఒక కోటి కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈ మెగా ఈవెంట్ గత సీజన్లలో పోటీ చేశారు.
దీనిలో విజేతలుగా నిలిచిన వారిని నిర్వాహకులే అన్ని ఖర్చులు భరిస్తూ ‘నాసా’పర్యటనకు తీసుకెళ్లారు. ఈ ఏడాది DSSDSSL ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

DSSL మూడు రౌండ్లు ఉంటాయి.
రౌండ్ 1: స్కూల్ లెవల్ రౌండ్ వయా డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్ రూల్
రౌండ్ 2: రాష్ట్ర స్థాయి రౌండ్‌లో స్కూల్ టాపర్ పాల్గొంటారు
రౌండ్ 3: జాతీయస్థాయి రౌండ్‌లో రాష్ట్ర టాపర్లు తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ రౌండ్ డిస్కవరీ చానల్‌లో ప్రసారమవుతుంది.

DSSLలో పాల్గొనే ప్రతీ విద్యార్థి 60 రోజుల ఉచిత బైజూస్ లెర్నింగ్ యాప్ యాక్సెస్ పొందడంతో పాటు ఈ-సర్టిఫికెట్, రూ. 5 వేల విలువ గల స్కాలర్‌షిప్ పొందుతారు. అగ్రశ్రేణి టీమ్‌లు తమ పాఠశాల ప్రిన్సిపాళ్లతో కలిసి ‘నాసా’పర్యటనకు వెళ్లే అవకాశాన్ని గెలుచుకుంటారు. విజేతలు రూ. 10 లక్షల వరకు నగదు బహుమతిని గెలుచుకునే అవకాశముంది.

పాల్గొనడం ఎలా..?
స్టెప్-1: డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్-2: విద్యార్థి పేరు, సిటీ పేరు, స్కూల్ పేరు ఎంటర్ చేసి, గ్రేడ్ (క్లాస్) సెలెక్ట్ చేయండి.
స్టెప్-3: ‘‘స్టార్ట్ ఈఔ టెస్ట్’’పై క్లిక్ చేయండి
స్టెప్-4: టెస్ట్ తీసుకోండి.
స్టెప్-5: టెస్ట్ పూర్తి అయ్యాక రివార్డులు క్లెయిమ్ చేయండి.
లింక్: http://onelink.to/3fdzvw  

మా పాఠశాల SDSSL పాల్గొన్నందుకు సంతోషించాను. ఈ యాప్‌ను అర్థం చేసుకోవడం చాలా సులభమే కాక త్వరితగతిన అనుసరించడానికి వీలుగా కూడా ఉంది. DSSL సీజన్-3 నాకు, మా విద్యార్థులకు మంచి అనుభవాన్ని నేర్పింది.
-వి.బాలు, హెడ్‌మాస్టర్, రత్నం స్కూల్, నెల్లూరు, ఏపీ

మేము DSSL లో సీజన్-1 నుంచి పాల్గొంటున్నాము. ఇది ఏ విద్యార్థి అయినా సులభంగా పాల్గొనేలా ఉంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఇంటి నుంచి కూడా క్విజ్‌లో పాల్గొనవచ్చు. ఈ పోటీ విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంచుతుంది.
-వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్, ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌, నల్లగొండ, తెలంగాణ

కరోనా మహమ్మారి కాలంలో సాధారణ పద్ధతిలో టెస్టులు నిర్వహించడం చాలా పెద్ద విషయం. DSSL మమ్మల్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లింది. ప్రతీ విద్యార్థి DSSL లో పాలుపంచుకోవాలని కోరుతున్నాను.
- డా. జి.భరద్వాజ, డెరైక్టర్, గ్రీన్ ఉడ్ హైస్కూల్, వరంగల్
Published date : 24 Dec 2020 05:11PM

Photo Stories