డిసెంబర్ 29 వరకు `లా` గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: లా కోర్సుల్లో ప్రవేశాల్లో భాగంగా మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్ల అప్‌లోడ్ గడువును ఈ నెల 29 వరకు పొడిగించినట్లు ప్రవేశాల కమిటీ తెలిపింది.
ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్, స్పోర్‌ట్స, ప్రత్యేక కోటా అభ్యర్థులు ఈ నెల 22లోగా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొంది. వచ్చే నెల 1, 2 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, వచ్చే నెల 3న సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందని వివరించింది. వచ్చే నెల 5న సీటు పొందిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వెల్లడించింది. వచ్చే నెల 5 నుంచి 8 వరకు ట్యూషన్ ఫీజు పేమెంట్ చలాన్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు సీటు పొందిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించింది. వచ్చే నెల 6 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. కన్వీనర్ కోటాలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో 5,120, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో 3,166, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో 626 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.
Published date : 22 Dec 2020 06:36PM