బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం సీట్ల భర్తీ ని మంగళవారం పూర్తి చేశారు.
తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ కార్యాలయ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమ వివరాలను బీసీ గురుకుల కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకు వచ్చిన జీపీఏ ఆధారంగా ఎంపిక జరిగిందని తెలిపారు. మొత్తం 14 బీసీ జూనియర్ కాలేజీల్లోని 2,040 సీట్లకు 5,543 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,869 మందిని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నట్టు కృష్ణమోహన్ తెలిపారు.
చదవండి: ఆలస్యంగా మేల్కొన్న ఇంటర్ బోర్డ్.. కార్పొరేట్ కాలేజీల్లో సగానికి పైగా సిలబస్ పూర్తి..!!
చదవండి: ఆలస్యంగా మేల్కొన్న ఇంటర్ బోర్డ్.. కార్పొరేట్ కాలేజీల్లో సగానికి పైగా సిలబస్ పూర్తి..!!
Published date : 18 Aug 2021 04:37PM