Skip to main content

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సెప్టెంబర్‌ 1 నుంచి 15వ తేదీ వరకు ఎంటర్‌ప్రెన్యూర్‌íÙప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ పేరుతో ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహిస్తున్నామని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ ఎస్‌కే షహాబుద్దీన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. వ్యాపార ప్రణాళికలు, ఆర్థిక కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహించడం, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రాజెక్ట్‌ సమగ్ర నివేదిక (డీపీఆర్‌), బ్యాంకుల స్కీంలు తదితర అంశాలపై ఆయా రంగాల్లోని నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, మహిళలు, యువతీ యువకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌ అందజేస్తామని తెలిపారు. వివరాలకు 80085 79624, 93914 22821నంబర్లలో సంప్రదించాలని కోరారు.

చ‌ద‌వండి: నిరుద్యోగ యువతకు `సీపెట్‌` ఉచిత నైపుణ్య శిక్షణా కోర్సులు
Published date : 23 Aug 2021 02:51PM

Photo Stories