ఆన్‌లైన్‌లో డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించలేరా...
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు సెప్టెంబర్ 10వ తేదీన విచారణ జరిపింది.
కరోనా వైరస్ కారణంగా హాస్టల్స్ మూసి ఉన్నందున పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారని, చివరి సెమిస్టర్ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషనర్ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సాంకేతికతను ఉపయోగించుకుని ఇంజనీరింగ్ కోర్సులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అలాగే సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్‌గా పరిగణిస్తారా అని హైకోర్టు అడిగింది. న్యాయస్థానం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. ప్రభుత్వాన్ని అడిగి చెప్తానని అన్నారు. దీంతో విచారణ ఈనెల 15కు వాయిదా వేసింది.
Published date : 10 Sep 2020 06:42PM