Skip to main content

ఆన్లైన్ విధానంలో ప్రొఫెషనల్ కోర్సులు: ఏఐసీటీఈ

ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలోనూ వినూత్న విధానాలకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)ను పెంచేందుకు వీలుగా జాతీయ నూతన విద్యావిధానం–2020లో అనేక అంశాలను చేర్చింది.
ఈ లక్ష్యాలను నెరవేర్చేందుకు వీలుగా కార్యాచరణను చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులలో అడ్మిషన్లు పెరిగేలా ఆన్లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్)విధానాలను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మరింత విస్తృతం చేస్తోంది. ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో నాన్ ప్రొఫెషనల్ కోర్సులే ఎక్కువగా అందుబాటులో ఉండగా ఇపుడు ప్రొఫెషనల్ కోర్సులను చేరువ చేసే ప్రక్రియకు బీజం పడింది. ఇందుకు అనుగుణంగా కొత్త విధివిధానాలతో రూపొందించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఆన్లైన్, ఓడీఎల్ నాన్ ప్రొఫెషనల్ కోర్సులను పలు విద్యాసంస్థలు అమల్లోకి తీసుకురాగా, ఇపుడు ఏఐసీటీఈ నిర్ణయంతో ప్రొఫెషనల్ కోర్సులనూ ఆయా విద్యాసంస్థలు విద్యార్థులకు అందించనున్నాయి.

రెగ్యులర్ కోర్సులకు దీటుగా
రెగ్యులర్ కోర్సులకు దీటుగా సమానమైన ప్రాధాన్యతతో ప్రొఫెషనల్ కోర్సులను విద్యార్థులు అందుకోనున్నారు. ఏఐసీటీఈ చట్టం–1987 ప్రకారం డిప్లొమో, పీజీ డిప్లొమో సర్టిఫికెట్, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో, పోస్టు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ డిగ్రీలను ఆన్లైన్, ఓడీఎల్ ద్వారా అమలు చేశారు. జనవరి/ఫిబ్రవరి లేదా జులై /ఆగస్టు మధ్య 12 నెలల కాల వ్యవధిలో ఇవి అమలు అవుతాయి. ఈ కోర్సులను నాణ్యత ప్రమాణాలతో విద్యార్థులకు అందించేలా ప్రతి సంస్థను ‘సెంటర్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్’ ఎప్పటికపుడు సమీక్షిస్తూ ఉంటుంది. ఆన్లైన్, డిస్టెన్స్ విదానంలో ఈ కోర్సులు అమలు చేస్తున్నా విద్యార్థులు, టీచర్ల మధ్య ముఖాముఖి అభ్యసనం ఉండేలా కొంతకాలం సంప్రదాయ అభ్యసన విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలోని కోర్సులకు కూడా రెగ్యులర్ కోర్సులతో సమానంగా ఆడిట్ సిస్టమ్ అమలవుతుంది. విద్యార్థి ఆయా కోర్సులను యూనిట్ల వారీగా విద్యార్థి అభ్యసించిన అంశాలు, అసెస్మెంట్లో తేలిన ప్రమాణాలను అనుసరించి ఈ క్రెడిట్లు ఇస్తారు.

కోర్సులు అందించే సంస్థలు ఈ విధంగా...
యూజీసీ గుర్తింపు, స్వయం ప్రతిపత్తి ఉన్న ఉన్నత విద్యా సంస్థలు, డీమ్డ్ వర్సిటీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సులు అందించాలి.

ఆన్లైన్ కోర్సులు అమలు చేసే సంస్థలకు నాక్ 4 పాయింట్ల స్కేలులో 3.26 పాయింట్లు, లేదా ఎన్బీఏ స్కోరు 1000 స్కేల్లో 700 పాయింట్లు కలిగి ఉండడం తదితర నిబంధనలను ఏఐసీటీఈ అమలు చేస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్కులో టాప్–100లో సంస్థలు ఉండాలి.

ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలు కలిగి ఉండాలి.

ఆయా సంస్థల్లోని ఇంటిగ్రేటేడ్ ప్రొఫెషనల్ కోర్సులను కూడా ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో అందించవచ్చు.

ఈ కోర్సులను అమలుచేసేటపుడు విద్యార్థులకు సహకారం అందించడానికి నిపుణులైన ప్రొఫెసర్లతో ‘లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ను’ ఏర్పాటు చేయాలి.

ఆన్లైన్ విధానంలో ఏఐసీటీఈ నిషేదించిన ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులను, మేనేజ్మెంట్, అప్లయిడ్ ఆర్ట్స్ వంటి కోర్సులను అమలు చేయరాదు.

పూర్తి వివరాలు www.aicte.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.

ఆయా కోర్సుల క్రెడిట్లు, కాల పరిమితి ఇలా ...

కోర్సు

క్రెడిట్లు

కాలపరిమితి

టెన్త్ తరువాత డిప్లొమో కోర్సులు

120

మూడు సంవత్సరాలు

మాస్టర్‌ డిగ్రీ (కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)

80

రెండు సంవత్సరాలు

పీజీ డిగ్రీ (మేనేజ్‌మెంట్‌ )కోర్సు

80

రెండు సంవత్సరాలు

పీజీ డిప్లొమో కోర్సులు

80

రెండు సంవత్సరాలు

పీజీ సర్టిఫికెట్‌ కోర్సులు

40

రెండు సంవత్సరాలు

పీజీ సర్టిఫికెట్‌ కోర్సులు

40

ఏడాది

Published date : 25 May 2021 12:31PM

Photo Stories