Skip to main content

ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా 9 ‘ఏకలవ్య’ పాఠశాలలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా తొమ్మిది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
వీటిని 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 19 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లున్నాయి. వీటిలో మూడింటిని బాలికల కోసం ఏర్పాటు చేయగా మిగిలిన 16 స్కూళ్లలో కో-ఎడ్యుకేషన్ (బాల బాలికలు కలిసి చదువుకునేందుకు వీలుగా) ఉంది. కొత్తగా ఏర్పాటు చేయనున్నవి కూడా కో-ఎడ్యుకేషన్ స్కూళ్లే.
  • కొత్తగా మంజూరైన ఏకలవ్య మోడల్ గురుకుల స్కూళ్లను విశాఖపట్నం జిల్లాలోని పెదబయలు, అనంతగిరి, హుకుంపేట, పాడేరు, జి మాడుగుల, కొయ్యూరు, అరకు, తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల, రంపచోడవరంలో ఏర్పాటుచేస్తారు.
  • వీటి నిర్మాణానికి వెంటనే స్థలాలు గుర్తించాలని ఐటీడీఏ పీవోలకు ప్రభుత్వం ఆదేశించింది. నిధులు కూడా మంజూరు చేసింది.
Published date : 04 May 2020 03:42PM

Photo Stories