Skip to main content

2030 నాటికి టీచర్‌ ఉద్యోగానికి...కనీస విద్యార్హతగా నాలుగేళ్ల బీఎడ్‌!

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో 2030 నాటికి పాఠశాల విద్యా బోధనకు కనీస అర్హతగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ను (ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌) పరిగణనలోకి తీసుకోవాలని నూతన విద్యా విధానం పేర్కొంది.
తద్వారా వి్రస్తృతమైన పరిధితో కూడిన విజ్ఞానాన్ని, కంటెంట్, పెడగాజీ తదితర అంశాలపై మెరుగైన శిక్షణను అందించవచ్చని వెల్లడించింది. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సులను నిర్వహించే కాలేజీల్లో మాత్రమే రెండేళ్ల బీఎడ్‌ కోర్సును అందించవచ్చని స్పష్టం చేసింది. అంతకుముందే బ్యాచిలర్‌ డిగ్రీ అర్హత కలిగిన వారు రెండేళ్ల బీఎడ్‌ను చదువుకోవచ్చని పేర్కొంది. ఇక బీటెక్‌ వంటి నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ చదివిన వారు లేదా పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివిన వారు ఒక ఏడాది బీఎడ్‌ చేయవచ్చని పేర్కొంది. వారు పీజీలో తమ ప్రత్యేక సబ్జెక్టు ప్రకారం అదే సబ్జెక్టులో ప్రత్యేక టీచర్‌గా వెళ్లవచ్చని పేర్కొంది. అయితే ఈ కోర్సులన్నీ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సును నిర్వహించే మల్టీడిసిప్లినరీ కాలేజీల్లోనే నిర్వహిం చాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ లేదా దూర విద్యా విధానంలోనూ ఇన్‌సరీ్వసు టీచర్ల కోసం బీఎడ్‌ కోర్సులను నిర్వహించవచ్చని పేర్కొంది. ఇక ఈ బీఎడ్‌ కోర్సులన్నింటిలో ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీ, మల్టీలెవల్‌ టీచింగ్‌ అండ్‌ ఎవాల్యూయేషన్, ఆధునిక అంశాలతో కూడిన పెడగాజీ, అంగవైకల్యంతో కూడిన విద్యార్థులకు బోధించేలా, నాణ్యమైన విద్యను అందించేలా శిక్షణ అందించాలని స్పష్టం చేసింది. మరోవైపు రెండు రకాలుగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సులను తీసుకురానుంది. ఇందులో ఎలిమెంటరీ బీఎడ్, సెకండరీ బీఎడ్‌ కోర్సులను తీసుకువచ్చేలా చర్యలు చేపట్టింది. ఇంటర్‌తోనే వీటిని చదువుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్‌తో నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) స్థానం లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ రానుంది.

పాలసీలోని మరికొన్ని ప్రధాన అంశాలు..
  • గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రత్యేక మెరిట్‌ స్కాలర్‌íÙప్‌లను ప్రవేశపెట్టాలని పేర్కొంది. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ పూర్తయ్యాక మెరిట్‌ స్కాలర్‌షిప్‌లను పొందిన విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.
  • ఇందుకోసం ప్రత్యేకంగా మెరిట్‌ బేస్డ్‌ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టాలని సూచించింది. తద్వారా ఉద్యోగాలు అక్కడి స్థానికులకే లభిస్తాయని పేర్కొంది. దీంతో ప్రతిభావంతులైన ఆ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో విశేష సేవలు అందించడం సాధ్యం అవుతుందని పేర్కొంది.
  • ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించే టీచర్ల కొరత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో ప నిచేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇ వ్వాలని సూచించింది. అంతేకాకుండా పా ఠశాల సమీపంలో లేదా స్థానికంగా నివాస వసతి కలి్పంచాలని, లేదంటే ఇంటి అద్దె అలవెన్సును పెంచాలని స్పష్టం చేసింది.
  • టీచర్‌ ఎడ్యుకేషన్, పెడగాజీ విషయంలో టీచర్లకు నాణ్యతతో కూడిన శిక్షణను అందించాలి. ఇందుకు 2030 నాటికి మల్టీడిసిప్లినరీ కాలేజీలు.. యూనివర్సిటీలుగా మార్పు చేసుకోవాలి. ఆయా కాలేజీలు, వర్సిటీలు బీఈడీ, ఎంఈడీ, పీహెచ్డీ వంటి కోర్సులను అందించేలా చూడాలి.
  • ఉపాధ్యాయులకు సంబంధించి నేషనల్‌ ప్రొఫెషనల్‌ స్టాండర్డ్స్‌ ఫర్‌ టీచర్స్‌ని (ఎన్‌పీఎస్‌టీ) 2022 నాటికి అభివృద్ధి చేయాలి. జనరల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్‌ స్టాండర్డ్‌ సెట్టింగ్‌ బాడీని (పీఎస్‌ఎస్‌బీ) ఎన్‌సీటీఈ ఏర్పాటు చేయాలి.
  • టీచర్లు ఎక్కువగా ఉన్నారంటూ తరచూ చేసే టీచర్ల బదిలీలను ఆపేయాలి. తద్వారా విద్యార్థులు తమ రోల్‌ మోడల్‌ అయిన టీచర్లను, విద్యా వాతావరణాన్ని కోల్పోకుండా ఉంటారు. బదిలీలు చేయాలంటే ప్రత్యేక పరిస్థితుల్లోనే బదిలీలు చేయాలని, అవీ ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు విధానాన్ని రూపొందించుకోవాలని పేర్కొంది.
సమగ్ర విధానంలో పూర్తి వివరాలు
ఉపాధ్యాయ విద్యకు సంబంధించి సమగ్ర వివరాలు ఎన్‌సీటీఈ రూపొందించే కార్యాచరణ మార్గదర్శకాల్లో వస్తాయి. పాలసీలో పూర్తి వివరాలు ఉండవు. భవిష్యత్తులో ఇంటరీ్మడియట్‌తో ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ వస్తుంది. ఇపుడు డీఎడ్‌ చేసిన వారికి డిగ్రీ ఉంటే బీఎడ్‌గా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎలిమెంటరీ బీఎడ్‌ చేసిన వారు 8వ తరగతి వరకు, సెకండరీ బీఎడ్‌ చేసిన వారు ఉన్నత తరగతులకు బోధిస్తారు.
–ప్రొఫెసర్‌ ఘంటా రమేశ్, అఖిల భారత బోధన అధ్యాపకుల సంఘం జాతీయ అధ్యక్షుడు
Published date : 01 Aug 2020 04:17PM

Photo Stories