2018–19 నర్సుల పదోన్నతుల్లో భారీగా అక్రమాలు..
Sakshi Education
సాక్షి, అమరావతి: 2018–19 సంవత్సరంలో నర్సులకు ఇచ్చిన పదోన్నతుల్లో భారీగా అక్ర మాలు జరిగాయి. ఎన్నో ఏళ్లుగా పదోన్నతి కోసం ఎదురు చూసిన బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులు ఈ అక్రమాల కారణంగా నిరాశకు గురయ్యారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్లిక్ చేయండి.
డీఎంఈ కార్యాలయం పరిధిలో నర్సింగ్ కాలేజీలున్నాయి. బీఎస్సీ నర్సింగ్‌తో స్టాఫ్‌నర్సుగాచేరి ఆ తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులకు లెక్చరర్‌గా పదోన్నతి ఇస్తారు. ఇలా సీనియారిటీ ప్రాతిపదికన తయారు చేసిన జాబితాను డీఎంఈ అధికారులు రాత్రికిరాత్రే మార్చేశారని, మధ్యాహ్నం ఆన్‌లైన్ లో పెట్టిన జాబితాను రాత్రికి మార్చి అనర్హుల పేర్లను పెట్టారని పలువురు నర్సులు డీఎంఈ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. అప్పట్లో తమకు అనుకూలం గా కోర్టు ఆర్డరు వచ్చినా పట్టించుకోలేదని పలువురు నర్సులు వాపోయారు. అప్పట్లో అక్రమాలకు పాల్పడిన సదరు ఉన్నతాధికారులపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజిలె¯న్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఒక్క పదోన్నతి కోసం 20 ఏళ్లు పనిచేశామని, చివరకు అర్హులకు ఇవ్వకుండా అమ్ముకున్నారని ఆరోపించారు.

Published date : 06 Apr 2021 02:22PM