వైద్య, ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని వెంటనే తీసుకోండి: సీఎం జగన్
Sakshi Education
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని వెంటనే భర్తీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
8 జిల్లాల్లోని కోవిడ్ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న ఐసోలేషన్, ఆక్సిజన్ సదుపాయాలున్న పడకల సంఖ్యను మరింత పెంచాలన్నారు. కరోనా వైరస్ లక్షణాలుంటే పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కనీస జాగ్రత్తలు, వైద్య సాయంతో కోలుకోవడం సులభ మన్నారు. వైరస్ సోకడం నేరం, పాపం కాదని.. దానిపట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని, అది ఎవరికైనా వ్యాపిస్తుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సీఎం సూచించారు. అనుమానం వస్తే ఎవరికి రిపోర్ట్ చేయాలి? వైద్యం ఎలా పొందాలన్న దానిపై క్షేత్రస్థారుులో సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలన్నారు. ఇందుకోసం డోర్ లెవల్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జగన్ ఆదేశించారు. ఫోన్ చేయగానే ఇంటికి వచ్చి శాంపిళ్లు తీసుకునే పరిస్థితి ఉండాలని స్పష్టంచేశారు. హైరిస్క్ ఉన్న వారు ముందుగానే పరీక్షలు చేరుుంచుకోవడం ద్వారా మరణాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని ప్రజలకు బాగా తెలియజేయాలని.. దీనిపై విసృ్తత ప్రచారం కల్పించాలని ఆయన ఆదేశించారు. రిస్క్ ఉన్న వ్యక్తులు వైద్యం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే పరిస్థితి విషమిస్తుందనే అంశాన్ని కూడా వివరించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 నివారణ చర్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. రైలు సర్వీసులు, విమాన సర్వీసులు ప్రారంభం అవుతుండడంతో ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ప్రజలు రావడం మొదలవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన నివారణ చర్యలపై చర్చించారు. సమావేశంలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నారుు..
ఖాళీల భర్తీ వేగంగా జరగాలి
కోవిడ్-19 నివారణలో భాగంగా రాష్ట్రంలో ఆస్పత్రులను సిద్ధం చేసుకోవడం.. సరిపడా సిబ్బందిని నియమించుకోవడం అత్యంత ముఖ్యమైన అంశాలు. ఏ ఆస్పత్రిలోనైనా వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలి. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న ఖాళీలను గుర్తించి రిక్రూట్‌మెంట్‌ను వేగంగా చేయాలి. ఎన్ని ఖాళీలుంటే.. అన్ని ఖాళీలూ భర్తీచేయాలి. సరిపడా సిబ్బంది ఉంటేనే ఇలాంటి విపత్తులను ఎదుర్కోగలం.
వీటితోపాటు..
అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని కోవిడ్ ఆస్పత్రుల్లో ఇప్పుడున్న ఐసోలేషన్, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. అలాగే, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తూర్పు గోదా వరి, వైజాగ్, చిత్తూరు జిల్లాల్లో పీహెచ్‌సీల స్థారుులోనే టెస్టింగ్ శాంపిళ్ల సేకరణ సదుపాయాలను కల్పించ నున్నామని తెలిపారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేస్తామని అధికారులు వెల్లడించారు. అంతేకాక..

- కోవిడ్ వచ్చిందని అనుమానం వస్తే ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఎలా వైద్య సదుపాయం పొందాలన్న దానిపై క్షేత్రస్థారుులో సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలి.
- ఇందుకోసం డోర్ లెవల్ రిపో ర్టింగ్ స్ట్రక్చర్ తయారుచేయండి.
- పరీక్షల కోసం ఎవరిని సంప్ర దించాలి? ఎవరికి ఫోన్‌చేయాలి? ఎక్కడకు వెళ్లాలి? ఇందుకు ఎవరి సహకారం తీసుకోవాలి? ఐసోలేషన్ ఎలా పాటించాలి? తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవస్థను రూపొందించండి.
- పజలు స్వచ్ఛందంగా పరీక్షలు చేరుుంచుకునేలా ఉం డాలి.ఫోన్ చేయగానే ఇంటికి వచ్చి శాంపిళ్లు తీసుకునే పరిస్థితి ఉండాలి. ఊ 104, ఆరోగ్యం, వైద్యం అందించే అంబులెన్‌స, 14410 టెలిమెడిసిన్ లేదా ప్రజాసమస్యల కోసం ఉద్దేశించిన 1902 లాంటి నంబర్లకు ఫోన్‌చేసినా ఆ వ్యక్తికి పరీక్షలు చేయడం, వైద్యం అందే ప్రక్రియలు సాఫీగా సాగేలా సమర్థ యంత్రాంగాన్ని నిర్మించాలి.
- హైరిస్క్ ఉన్నవారు ముందస్తుగానే పరీక్షలు చేరుుంచు కుంటే మరణాల నుంచి తప్పించుకోవచ్చు అనే విష యంపై విస్తృత ప్రచారం కల్పించాలి.
- రిస్క్ ఉన్న వ్యక్తులు వైద్యం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే పరిస్థితి విషమిస్తుందనే అంశాన్నీ తెలియజేయాలి.
- కరోనా ఎవరికైనా సోకవచ్చు. దీర్ఘకాలంలో దీనితో పోరాటం చేయాల్సి ఉంటుంది.
- మాటలకన్నా వాస్తవికతతో ముందుకు సాగాలి. అలా చేయకపోతే నష్టం కలుగుతుంది.
- కోవిడ్ వైరస్ విషయంలో వాస్తవాలను విస్మరించేకొద్దీ తీవ్ర నష్టం కలుగుతుందనే అంశాన్ని గుర్తించాలి.
- అందుకే చిట్టచివరి స్థారుులో మనం ఏర్పాటు చేయదలు చుకున్న విలేజ్ క్లినిక్స్ ఇలాంటి మహమ్మారులను నివారంచడంలో కీలకపాత్ర పోషిస్తారుు.
- పీహెచ్‌సీల్లో వైద్యుల సంఖ్యను పెంచడం.. వారిలో కొందరికి వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను కేటారుుంచడం వరకూ వెళ్లాల్సి ఉంటుంది అని జగన్ వివరించారు.
అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని కోవిడ్ ఆస్పత్రుల్లో ఇప్పుడున్న ఐసోలేషన్, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. అలాగే, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తూర్పు గోదా వరి, వైజాగ్, చిత్తూరు జిల్లాల్లో పీహెచ్‌సీల స్థారుులోనే టెస్టింగ్ శాంపిళ్ల సేకరణ సదుపాయాలను కల్పించ నున్నామని తెలిపారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేస్తామని అధికారులు వెల్లడించారు. అంతేకాక..
- విమానాల రాకపోకలు ప్రారంభం అవుతున్నందున ప్రయాణికుల నుంచి శాంపిల్ తీసుకుని, వారిని హోం క్వారంటైన్‌కు సూచిస్తామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. వారి వివరాలు తీసుకుని పర్యవేక్షిస్తామన్నారు.
- కనీస జాగ్రత్తలు పాటించేలా వారికి తగిన సూచనలు చేసి అవి పాటించేలా చూస్తామన్నారు.
Published date : 25 May 2020 03:19PM