Skip to main content

త్వరలో 755 వైద్య సిబ్బంది నియామకాలు.. వివరాలు ఇవిగో..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ మెరుగైన వైద్య సేవలందించేందుకు మరింత మంది వైద్య సిబ్బందిని సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు వైద్య, విద్య డైరెక్టరేట్‌ పరిధిలోని పలు ఆస్పత్రుల్లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయిలోని డాక్టర్ల నుంచి ల్యాబ్‌ టెక్నీషి యన్ల వరకు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతుల్లో మొత్తం 449 మంది సిబ్బంది నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే వైద్య విధాన పరిషత్‌ ద్వారా క్షేత్రస్థాయి వైద్యశాలల్లోని వివిధ కేటగిరీల్లో మ రో 306 పోస్టుల నియామకానికి కూడా అనుమతిచ్చింది. వారిని 3 నెలల ప్రాతిపదికపై నియమించుకునేందుకు వైద్య విద్య డైరెక్టర్, వైద్య విధాన పరిషత్‌లకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

వివిధ జీవోల ప్రకారం వేతనాలు...
ఆర్థిక శాఖ ఉత్తర్వుల ప్రకారం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (అనస్తీషియా), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (జనరల్‌ మెడి సిన్‌)లతోపాటు మరికొందరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (పల్మనరీ మెడిసిన్‌), స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లను నియమించుకోవచ్చు. ఇందులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూల ద్వారా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు నియమించనుండగా స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లను థర్డ్‌ పార్టీ ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సమకూర్చుకోనున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో వైద్య కళాశాలల్లో నియమిం చుకునే సిబ్బందికి 2018లో జారీ చేసిన జీవో నంబర్‌ 452, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి 2020లో వచ్చిన జీవో నంబర్‌ 33 ప్రకారం గౌరవ వేతనం చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే క్షేత్రస్థాయి ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిన నియ మించుకునే 66 మంది వైద్య సిబ్బందికి ఎన్‌హెచ్‌ ఎం నిబంధనలు వర్తించనుండగా 240 మంది స్టాఫ్‌ నర్సులు, 28 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లకు 2020లోని ఇచ్చిన జీవో నంబర్‌ 33 ప్రకారమే వేతనాలు ఇవ్వనున్నారు. వైద్య విద్య డైరెక్టర్‌కు కేటాయించిన 449 పోస్టుల్లో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్‌ కళాశాలలతోపాటు సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, మహ బూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాలలు, ఆదిలాబాద్‌ రిమ్స్, ప్రభుత్వ ఈఎన్‌టీ వైద్యశాల, ఫీవర్‌ ఆస్పత్రి, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఛాతీ వైద్యశాల, మానసిక వైద్యశాల, ఎంజీఎం, వరంగల్‌లోని టీబీ ఆస్పత్రులకు సిబ్బందిని అవసరాల మేరకు కేటాయించారు. అదేవిధంగా వైద్య విధాన పరిషత్‌ కింద ఇచ్చిన 306 పోస్టులను రాష్ట్రంలోని పలు సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు కేటాయించారు.

ప్రభుత్వం అనుమతించిన అదనపు పోస్టులు ఇలా...

పోస్టు

వైద్య, విద్య డైరెక్టర్‌

విధాన పరిషత్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (అనస్తీషియా)

32

27

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (జనరల్‌ మెడిసిన్‌)

25

17

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (పల్మనరీ మెడిసిన్‌)

21

06

స్టాఫ్‌ నర్సులు

315

212

ల్యాబ్‌ టెక్నీషియన్లు

56

28

మొత్తం

449

290

(నోట్‌: ఇవికాక వైద్య విధాన పరిషత్‌లో మరో 16 ఎంబీబీఎస్‌ వైద్యులను
కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకోనున్నారు)

Published date : 26 Apr 2021 05:18PM

Photo Stories