ఫిబ్రవరి 22 నుంచి ‘మెడికల్’ క్లాసులు.. ఫ్రెషర్స్ సహా అందరికీ..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 22 నుంచి వైద్య విద్య తరగతులు ప్రారంభించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది.
థియరీ క్లాసులను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని, ప్రాక్టికల్స్‌కు మాత్రమే విద్యార్థులు నేరుగా కాలేజీకి హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఆదేశించిం ది. విద్యార్థులందరినీ రెండు బ్యాచ్‌లుగా విభజించి 15 రోజుల చొప్పున ఒక బ్యాచీకి క్లాసులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. విశ్వవిద్యాల యం ఆదేశాలతో ఎంబీబీఎస్, ఆయుష్, డెంటల్ కోర్సుల ఫస్టియర్ క్లాసులతోపాటు ఇతర తరగతులు మొదలవుతాయి. కరోనా కారణంగా వైద్య వి ద్యా సంవత్సరం ఆలస్యం కావడం తెలిసిందే. ఇప్పటికే 2019-20లో చేరిన విద్యార్థులకు, 2016- 17లో చేరిన ఫైనలియర్ విద్యార్థుల కోసం ప్రాక్టిక ల్స్‌కు సంబంధించిన తరగతులు ప్రారంభమయ్యా యి. ప్రస్తుతం ఫస్టియర్, ఫైనలియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ తరగతులు జరుగుతున్నా ఏ కాలేజీలోనూ కరోనా కేసులు నమోదు కాలేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మిగిలిన తరగతులన్నింటి నీ ప్రారంభించాలని శుక్రవారం వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినట్లు వైస్ చాన్స్ లర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సమావేశం లో డిజిటల్ తరగుతుల విధానానికి, ఈ-లైబ్రరీ పద్ధతికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఇప్పటికే 20 వేల మంది హాజరు...
ఫస్టియర్ ఎంబీబీఎస్ తరగతులు గతేడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచే ప్రారంభం కావాల్సి ఉ న్నా కరోనా కారణంగా అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ సహా ఇతర అన్ని రకాల కాలేజీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య దాదాపు 55 వేలుగా ఉందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 33 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫస్టియర్ నుంచి ఫైనలియర్ వరకు విద్యార్థుల సంఖ్య 20 వేల మంది వరకు ఉంటారని, మరో 20 వేల మంది నర్సింగ్ విద్యార్థులు, 6 వేల మంది డెంటల్ విద్యార్థులు, 5 వేల మంది ఫిజియోథెరపీ విద్యార్థులు, మిగిలినవారు ఆయుష్ సహా ఇతరత్రా కోర్సులకు చెందినవారు ఉంటారని తెలిపారు. వారిలో అన్ని కోర్సుల్లో గతేడాది మొదటి బ్యాచ్, ఫైనలియర్ బ్యాచ్ విద్యార్థులు దాదాపు 20 వేల మంది వరకు హాజరవుతున్నట్లు ఆయన వివరించారు. ఈ నెల 22 నుంచి మిగిలిన వారు హాజరవుతారన్నారు. తల్లిదండ్రుల అంగీకారపత్రం ఉన్న వారినే కాలేజీకి అనుమతించాలని వర్సిటీ గతంలోనే కాలేజీలను ఆదేశించింది. అలాగే ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకొని నెగెటివ్ రిపోర్ట్ ఉన్న విద్యార్థులనే కాలేజీల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది.

Published date : 20 Feb 2021 04:53PM