Skip to main content

పరిశోధనల వృద్ధికి ప్రైవేటు తోడ్పాటేదీ? : డాక్టర్ బాలసుబ్రమణియన్

సాక్షి, హైదరాబాద్: సామాజిక బాధ్యతతో కూడిన సైన్‌‌స అత్యవసరమే అయినప్పటికీ శాస్త్ర, పరిశోధన రంగాల కోసం ఈ సమాజం ఏం చేస్తోందన్నది కూడా చాలా ముఖ్యమని ప్రముఖ శాస్త్రవేత్త, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ బాలసుబ్రమణియన్ స్పష్టంచేశారు.
ప్రపంచంలోనే అత్యధిక ఆదాయమున్న ప్రైవేట్ సంస్థలు ఈ దేశంలో ఉన్నప్పటికీ శాస్త్ర పరిశోధన రంగాలకు ఆ కంపెనీలు ఇస్తున్న ఊతం సున్నాకు సమానమని, ఈ పరిస్థితి మారినప్పుడే దేశంలో అర్థవంతమైన, సామాజిక బాధ్యతతో కూడిన పరిశోధనలు జరిగేందుకు అవకాశముందని తెలిపారు. హైదరాబాద్‌లోని బిర్లా సైన్‌‌స సెంటర్ లో జనవరి 29 (బుధవారం)నజాతీయ సైన్‌‌స పాలసీపై బహిరంగ చర్చ జరిగింది. అకాడమీ ఆఫ్ సైన్‌‌స, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్‌టీసీ), బిర్లా సైన్‌‌స సెంటర్, నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌లు సంయుక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ.. దేశంలో సైన్‌‌స రంగం మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుండటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ తరహాలో ప్రభుత్వ యూనివర్సిటీల్లో పరిశోధనలకు ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సమకూరితే మెరుగైన ఫలితాలను చూడవచ్చని చెప్పారు.
Published date : 30 Jan 2020 04:59PM

Photo Stories