నర్సింగ్ అడ్మిషన్ల గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జీఎన్‌ఎం (జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ) అడ్మిషన్లకు గడువును నవంబర్30 వరకు పొడిగించారు.
ఇంతకుముందు అక్టోబర్ 7 చివరి తేదీ కాగా, ఇప్పుడు దీన్ని పొడిగిస్తూ వైద్యవిద్య సంచాలకులు ఉత్తర్వులు జారీచేశారు. దరఖాస్తుకు, ఫీజు చెల్లింపునకు 30వ తేదీనే గడువుగా నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఎంపిక ప్రక్రియ డిసెంబర్ 7వ తేదీలోగా ముగుస్తుంది. డిసెంబర్ 14 నుంచి తరగతులు ప్రారంభించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Published date : 06 Nov 2020 04:08PM