Skip to main content

నీట్- 2020 పరీక్ష మే చివరి వారానికి వాయిదా!

సాక్షి, ఎడ్యుకేషన్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG- 2020) మే చివరి వారానికి వాయిదాపడింది.
దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా మే 3న నిర్వహించవల్సిన నీట్- 2020పరీక్షను మే నెల చివరి వారానికి వాయిదా వేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)డెరైక్టర్ వినీత్ జోషి మార్చి 27 (శుక్రవారం)న ప్రకటించారు.

నీట్- 2020 ప్రిపరేషన్ గెడైన్స్, స్టడీ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

మార్చి 27 (శుక్రవారం)న విడుదల కావల్సిన అడ్మిట్ కార్డ్స్‌ను ఏప్రిల్ 15 తర్వాత విడుదల చేయనున్నట్టు తెలిపారు. దేశంలో కరోనా వ్యాప్తి నివారించే చర్యల్లో భాగంగా ఈ పరీక్షను వాయిదా వేసినట్టు, తిరిగి ఏ తేదీన నిర్వహించేది పరిస్థితులను బట్టి ప్రకటిస్తామని అన్నారు. విద్యార్ధులు అప్‌డేట్స్ కొరకు అఫీషియల్ వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలిస్తూ ఉండాలని, అంతేకాకుండా విద్యార్ధుల ఈమెయిల్, సెల్‌నెంబర్లకు కూడా సమాచారం అందిస్తామని తెలియజేశారు.
Published date : 28 Mar 2020 04:35PM

Photo Stories