మే 4వ తేదీ నాటికి పీజీ మెడికల్ సీట్ల భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని నిమ్స్ సహా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ వైద్య, దంత వైద్య విద్యలో తొలి విడత కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియను మే 4లోగా ముగించాలని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) ఆదేశించింది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు తాజాగా ఉత్తర్వులు పంపింది. మరోవైపు అఖిల భారత కోటాలో పీజీ వైద్య విద్యలో తొలివిడత ప్రవేశాలు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో చేరడానికి గడువును ఏప్రిల్ 24 వరకు పొడిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో చేరేందుకు ఈసారి అనుమతించింది. అఖిల భారత కోటా, రాష్ట్రాల్లో కన్వీనర్ కోటాల్లో రెండో విడత ప్రవేశాల తేదీలను తర్వాత ప్రకటిస్తామని డీజీహెచ్‌ఎస్ పేర్కొంది.
Published date : 22 Apr 2020 04:17PM