Skip to main content

మెడికల్ సీట్ల భర్తీకి మరో మాప్‌అప్ రౌండ్ కౌన్సెలింగ్: కాళోజీ వర్సిటీ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది.
ఈ మేరకు అదనపు మాప్‌అప్ రౌండ్ నోటిఫికేషన్‌ను ఆదివారం విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 4న సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 9 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే వర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కానీ అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు, అలాగే ఆలిండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన వారు కూడా ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని స్పష్టం చేశారు.
Published date : 04 Jan 2021 03:32PM

Photo Stories