మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం గడువు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.
ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం కింద నగదు రహిత వైద్యం అందుతున్న విషయం తెలిసిందే. దాంతోపాటు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు దాన్ని పొడిగిస్తోంది.
Published date : 19 Mar 2021 04:07PM