మెడికల్ పోస్టుల భర్తీకి.. ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్!
భవిష్యత్‌లో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున స్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (జీడీఎంవో), స్టాఫ్ నర్సులు, ట్రైనీ నర్సులు, పారిశుధ్య సిబ్బంది కలిపి మొత్తం 30,887 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 8,439 మందిని నియమించగా మిగతా పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఒకవైపు ఆస్పత్రుల్లో అవసరమైన బెడ్లను ఏర్పాటు చేస్తూనే.. మరోవైపు వైద్య సిబ్బంది నియామకానికి సమాంతరంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నియామకాలన్నీ రెగ్యులర్ నియామకాలకు అదనం.
జిల్లాలు, పోస్టుల వారీగా ప్రభుత్వం అనుమతించిన పోస్టుల సంఖ్య
జిల్లా | జీడీఎంవో | స్పెషలిస్ట్ డాక్టర్లు | అనస్థీషియన్, ఇతర టెక్నికల్ | స్టాఫ్ నర్సులు | ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వో | పారిశుధ్య సిబ్బంది | డీఈవో | ట్రైనీ నర్సులు |
శ్రీకాకుళం | 209 | 84 | 103 | 600 | 719 | 600 | 50 | 227 |
విజయనగరం | 216 | 74 | 110 | 208 | 115 | 221 | 50 | 271 |
విశాఖపట్నం | 307 | 161 | 154 | 670 | 402 | 581 | 50 | 1,459 |
తూర్పుగోదావరి | 226 | 119 | 108 | 300 | 400 | 300 | 60 | 1,559 |
పశ్చిమగోదావరి | 204 | 89 | 110 | 256 | 214 | 275 | 68 | 512 |
కృష్ణా | 157 | 155 | 100 | 277 | 200 | 276 | 52 | 829 |
గుంటూరు | 285 | 174 | 104 | 505 | 420 | 531 | 72 | 1,602 |
ప్రకాశం | 203 | 83 | 134 | 282 | 223 | 252 | 68 | 1,104 |
నెల్లూరు | 228 | 126 | 110 | 367 | 314 | 349 | 44 | 464 |
చిత్తూరు | 222 | 113 | 115 | 209 | 219 | 231 | 50 | 1,376 |
వైఎస్సార్ | 211 | 117 | 106 | 259 | 218 | 222 | 54 | 398 |
కర్నూలు | 235 | 199 | 101 | 274 | 203 | 270 | 40 | 744 |
అనంతపురం | 223 | 104 | 106 | 280 | 462 | 286 | 54 | 655 |
మొత్తం | 2,926 | 1,598 | 1,461 | 4,487 | 4,109 | 4,394 | 712 | 11,200 |
ఇప్పటివరకు నియామకాలు | పూర్తి అయినవారి వివరాలు.. |
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ | 945 |
స్పెషలిస్ట్ డాక్టర్లు | 409 |
అనస్థీషియన్-టెక్నికల్ | 670 |
స్టాఫ్ నర్సులు | 2,300 |
పురుష, మహిళా నర్సులు ఆర్డర్లీ | 1,861 |
పారిశుధ్య సిబ్బంది | 840 |
డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవో) | 303 |
ట్రైనీ నర్సులు | 1,111 |
మొత్తం | 8,439 |