జాతీయ ఆరోగ్యమిషన్‌లో1,900 పోస్టులు.. సెప్టెంబర్ 30న నోటిఫికేషన్!
Sakshi Education
సాక్షి, అమరావతి: జాతీయ ఆరోగ్యమిషన్ పరిధిలో పనిచేసేందుకు గానూ వివిధ కేటగిరీల్లో నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది.
డాక్టర్లు, పారామెడికల్, నర్సులు తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 1,900 పోస్టులున్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. వీటికి ఈనెల 30న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీని అక్టోబర్ 10గా నిర్ణయించారు. తుది జాబితాను వచ్చే నెల 17న విడుదల చేసి.. 19వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఈ పోస్టులను ఆయా జిల్లాల్లో కలెక్టర్లే భర్తీ చేసుకునేలా వీలు కల్పించారు.
Published date : 25 Sep 2020 03:07PM