ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ‘పీహెచ్‌డీ’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): మెడికల్, డెంటల్, ఆయుర్వేద, ఫిజియోథెరపీ, నర్సింగ్ కోర్సుల్లో పీహెచ్‌డీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు.
ఈ మేరకు యూనివర్సిటీ జనవరి 27 (సోమవారం)ననోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. దరఖాస్తులు, గుర్తింపు పొందిన కేంద్రాలు, గైడ్ల వివరాలు 28 నుంచి http://ntruhs.ap.nic.in వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు. దరఖాస్తులను ఫిబ్రవరి 17వ తేదీలోగా యూనివర్సిటీకి పంపించాలని సూచించారు.
Published date : 28 Jan 2020 02:46PM