Skip to main content

ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి మరో మాప్‌అప్ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్‌అప్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. వివరాలకు http://www.knruhs.telangana.gov.in/ ను చూడాలని సూచించింది.
Published date : 11 Jan 2021 01:52PM

Photo Stories